HHVM on OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి హరిహర వీరమల్లు.. ఎక్కడ చూడొచ్చంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథా నాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా అట్టహాసంగా ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ.. వెండితెరపై భావోద్వేగాలను భారీగా పండించారు. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరి హర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, ఇతర భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ లభించింది. అయితే బిజినెస్ పరంగా చూస్తే.. బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌కు దూరంగా నిలిచిపోయిందనే విషయం ట్రేడ్ వర్గాల రిపోర్టుల ద్వారా వెల్లడైంది.

Harihara Veeramallu

హరిహర వీరమల్లు సినిమా బిజనెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 125 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా 70 కోట్ల రూపాయల షేర్, 113 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ పరంగా చూస్తే.. 55 శాతం మేర రికవరీ సాధించింది. ఈ చిత్రం సుమారుగా 50 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌కు భారీ ధర పలికింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా రైట్స్‌ను సుమారుగా 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చారు.

థియేట్రికల్ రన్ ముగించుకొన్న హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఆగస్టు 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను వీక్షించి ఆనందించండి అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. హరిహర వీరమల్లు సినిమా గురించి చిత్ర యూనిట్ ట్వీట్ చేస్తూ.. మీ నిరీక్షణ ముగిసింది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్ హీరోయిజాన్ని స్మాల్ స్క్రీన్ మీద చూసి ఆనందించండి. యాక్షన్, హిస్టరీని కలబోసి ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ట రూపొందించారు అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X