Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2 షోకు ఆహ్వానించినా వెళ్లలేదు.. ఎందుకు రిజెక్ట్ చేశానంటే.. బాలకృష్ణపై మండిపడ్డ రోజా
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం రేపుతున్నది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలో సీజన్ 2లో చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్లు గెస్టులుగా వచ్చారు. తాజాగా ప్రభాస్ ఈ షోలో రావడం ఓటీటీ రంగంలో ప్రకంపలను సృష్టించింది.
కొద్ది రోజుల్లో పవన్ కల్యాణ్ గెస్టుగా రాబోతున్నాడు. ఇలా రాజకీయ, సినీ నాయకులకు ఈ షో క్రేజీగా మారింది. ఈ సందర్భంగా ప్రముఖ టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో అన్‌స్టాపబుల్ షోపై రోజా స్పందిస్తూ..

నాపై టీడీపీ, జనసేన ట్రోల్స్
నాపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోను. గతంలో టీడీపీ వాళ్లు నన్ను ట్రోల్ చేసేవారు. ఇప్పుడు వారికి జనసేన కార్యకర్తలు తోడయ్యారు. అయితే వాస్తవాలు లేకుండా వారు నన్ను విమర్శిస్తుంటారు. నేను మంత్రి అయ్యాక...నా అన్నయ్య నాకు ముద్దు పెడితే.. దానిని కూడా ట్రోల్ చేశారు. ఒక అమ్మ, నాన్నకు పుట్టి ఉంటే.. అలా నన్ను ట్రోల్ చేయరు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి ఆలోచించను. కంటెంట్ లేనన్పుడు ఇలాంటి దిగజారుడు పనులు చేస్తుంటారు అని రోజా అన్నారు.

అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో పాల్గొనమని
అయితే అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. కానీ ఆ షోలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు తప్పు చేయలేదని బాలకృష్ణ రుజువు చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం అలాంటి టాక్ షోకు వెళ్లడం నాకు నచ్చదు అని రోజా అన్నారు.

అందుకే వెళ్లలేదు అంటూ రోజా
బాలకృష్ణతో నాకు మంచి పరిచయం ఉంది. మేమిద్దరం కలిసి నటించాం. ఆయన హోస్ట్‌గా వ్యవహరించే టాక్ షోకు రమ్మని చెప్పారు. కానీ ఆ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల్లో రాజకీయ విభేదాలు, గందరగోళం ఏర్పడింది. దాంతో పార్టీకి నష్టం కలుగుతుందని నేను ఆ షోకు రానని చెప్పాను. నేనే ఆ షోకు వెళ్తే పార్టీకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని బాలకృష్ణ ఆహ్వానాన్ని తిరస్కరించాను అని రోజా తెలిపారు.

ఎన్టీఆర్‌కు బాలయ్య ద్రోహం
స్వర్గీయ ఎన్టీఆర్ అంటే సినీ కళకారులందరికి అభిమానం. అలాంటి వ్యక్తిని కూలదోసి అధికారాన్ని లాగేసుకొన్నాడు చంద్రబాబు. తన కూతురు భవిష్యత్ కోసం లేదా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ చేసింది తప్పు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. నట వారసత్వం, ఆస్తులు పంచి ఇచ్చిన తండ్రిపై ఇలాంటి నిందలు మోపడం సరికాదు. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే ఆ టాక్ షోకు ఇక వెళ్లకూడదని నిర్ణయం తీసుకొన్నాను అని రోజా చెప్పారు.

మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల దుమారం
నందమూరి బాలకృష్ణను, అన్‌స్టాపబుల్ షోను ఉద్దేశించి సినీ నటి, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. అన్ స్టాపబుల్‌కు వెళ్లనని, ఆ షోలో చంద్రబాబు చేత చెప్పించిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో బాలయ్య, టీడీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.