Don't Miss!
- News
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వర్సెస్ కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Unstoppable 2 శ్రీదేవీతో అలాంటి విభేదాలు.. సెట్లో, షూటింగులో మా ఇద్దరి పరిస్థితి అలా.. బాలకృష్ణతో జయప్రద
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారం అవుతున్న Unstoppable 2 Show ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలతో మధురానుభూతులు పంచుకొన్న బాలయ్య తాజాగా తన షోను ఉమెన్ స్పెషల్ షోగా మార్చారు. ఈ షోలోకి సీనియర్ హీరోయిన్లు జయసుధ, జయప్రద, యువ హీరోయిన్ రాశీ ఖాన్నా, అలాగే పర్వతాహోకురాలు మలావత్ పూర్ణను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీదేవితో ఉన్న తన విభేదాల గురించి జయప్రద చెబుతూ..

సత్యజిత్ రే ప్రశంస గురించి
జయప్రదను ఉద్దేశించి మాట్లాడుతూ దర్శకుడు సత్యజిత్ రే అన్న మాటలను గుర్తు చేశారు. ఇంత అందగత్తె ఈ భూలోకంలో పుట్టి ఉండదు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా.. జయప్రద సిగ్గుపడింది. అయితే సత్యజిత్ రే అన్న మాటలు నిజమేనా అంటే.. జయప్రద తలూపింది. జయప్రదను ఈ సందర్భంగా ఆమె అందాన్ని జయసుధ, బాలకృష్ణ ప్రశంసలు గుప్పించారు.

జయసుధ అసలు పేరు ఏమిటంటే?
జయసుధ గురించి జయప్రద చెబుతూ.. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. కలిసి పెరిగాం. కలిసి నటించాం. నేను జయసుధ ఇంటికి వెళ్లేదానిని. వాళ్ల అమ్మ...జయసుధను సుజాత అని పిలిచేది. నేను కూడా జయసుధను సుజాత అని పిలిచే దానిని. అలా ఒకరికొకరం మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. అడవి రాముడు సినిమా షూటింగులో మా మధ్య స్నేహం మరింత బలంగా మారిపోయింది అని జయప్రద చెప్పింది.

సూపర్‌స్టార్ కృష్ణతో 48 సినిమాలు చేశా
సూపర్‌స్టార్ కృష్ణ గారితో నేను 48 సినిమాల్లో నటించాను. ఆయనతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్లలో నేను ఒకరిని. అతడితో అన్ని సినిమాలు నటించడం చాలా గొప్ప విషయం. షూటింగులో చాలా కామ్‌గా ఉండేవారు. చాలా మంచి మనిషి. ఎదుటి వారికి ఏదైనా సమస్య ఉందని తెలిస్తే త్వరగా స్పందించేవారు. అలాంటి వారు మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని జయప్రద అన్నారు.

పెళ్లి తర్వాత మరింత బిజీగా
హీరోయిన్స్‌కు పెళ్లి కాగానే.. తల్లి పాత్రలు ఇస్తుంటారు. కానీ నా విషయంలో అలాంటిది జరగలేదు. మేము సినిమాల్లో నటించేటప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలు మా గురించి అలా ఆలోచించలేదు. నా పెళ్లి తర్వాత నేను ఫుల్ బిజీ అయ్యాను. పెళ్లి అనేది మా కెరీర్‌కు అడ్డం కాలేదు. పెళ్లి తర్వాత నేను చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించాను అని జయప్రద చెప్పారు.

శ్రీదేవితో విభేదాలు నిజమే అంటూ జయప్రద
శ్రీదేవీతో నాకు విభేదాలు ఉండేవి. మేము ఇద్దరం కలిసి నటించే సమయంలో సెట్లోకి రాగానే మా ఇద్దరి మధ్య డైరెక్టర్ రాజీ చేసేందుకు ప్రయత్నించేవారు. మమ్మల్ని ఒకరినొకరికి పరిచయం చేసి కూల్ చేసేందుకు డైరెక్టర్ ప్రయత్నించేవారు. సెట్లో డైరెక్టర్‌కు ఫస్ట్ పని మమ్మల్ని కలిపేందుకు ప్రయత్నించడమే.
అయితే మా మధ్య ప్రొఫెషనల్‌గా మంచి పోటీతత్వం ఉండేది. ఆమె కంటె గొప్పగా మేకప్ చేసుకోవాలని, ఆమె కంటే నేను గొప్పగా డ్రెస్ వేసుకోవాలని ప్రయత్నించేదానిని. శ్రీదేవి కూడా నాతో ఆ విషయాల్లో పోటీ పడేది. మా మధ్య ఆ గ్యాప్ ఉండేది అని జయప్రద చెప్పారు.