Kannappa OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి కన్నప్ప.. మంచు విష్ణు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కన్నప్ప. అలనాటి భక్త కన్నప్పకు రీమేక్‌గా భారీ స్టార్ క్యాస్టింగ్, అధునాతన సాంకేతిక సాయంతో ఈ సినిమాను నిర్మించారు. మంచు విష్ణు నటన, నటీనటుల ప్రతిభతో ఈ సినిమా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా.. దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ తారాగణంతో కన్నప్ప
కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషి, మోహన్‌లాల్ , ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మంచు మోహన్ బాబు నిర్మాణ సారథ్యం వహించారు. ఈ చిత్రానికి స్వయంగా మంచు విష్ణు కథ , స్క్రీన్ ప్లేను అందించారు.

కన్నప్ప మూవీ బడ్జెట్ ఎంత?
నిర్మాణ విలువలు, రిచ్‌నెస్‌లో ఎక్కడా రాజీ లేకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు మోహన్ బాబు. న్యూజిలాండ్‌లోని ఓ దీవిలో 7 వేల ఎకరాల రిసార్ట్‌ను లీజ్‌కు తీసుకుని ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కన్నప్ప సినిమాకు దాదాపు రూ.120 కోట్ల నిర్మాణ వ్యయం అయినట్లు ఫిలింనగర్ టాక్.
కన్నప్ప డిస్ట్రిబ్యూషన్ & బిజినెస్
భారీ స్టార్ క్యాస్టింగ్, టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషించటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కన్నప్ప మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.90 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు విలువ నిర్దేశించాయి. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 650, ఇండియాలో 4000, ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్‌లలో విడుదల చేశారు.
కన్నప్ప కలెక్షన్స్
కన్నప్ప మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టగా.. తొలి వారం 30 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అయితే ఆ తర్వాతి నుంచి కన్నప్ప చిత్రం కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఇండియాలో 33 కోట్ల రూపాయల నెట్, 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయల వసూళ్లు రాగా.. దాంతో కలిపి కన్నప్పకు వరల్డ్ వైడ్‌గా 44 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో ఏరియాల వారీగా కన్నప్ప కలెక్షన్స్ పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్ల రూపాయలు, తమిళంలో 80 లక్షలు, హిందీలో 4 కోట్ల రూపాయలు, కన్నడంలో 30 లక్షల రూపాయలు, మలయాళంలో 80 లక్షలు వసూళ్లు వచ్చాయి. దాంతో కన్నప్ప చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. థియేట్రికల్ బిజినెస్ ప్రకారం.. 90 కోట్ల రూపాయల షేర్‌కు గాను కేవలం 25 కోట్లు మాత్రమే రాబట్టి ఏకంగా కోట్ల రూపాయల షేర్ నష్టంతోనూ, 136 కోట్ల రూపాయల గ్రాస్ నష్టంతోనూ బిజినెస్‌ను క్లోజ్ చేసింది కన్నప్ప.
కన్నప్ప ఏ ఓటీటీలో?
సినిమాను రిలీజ్ చేసే సమయంలోనే కన్నప్ప ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమవుతుందని మంచు విష్ణు ముందే హింట్ ఇచ్చారు. తాజాగా ఈ ఉత్కంఠకు ఆయన తెరదించుతూ కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని మంచు విష్ణు తెలిపారు. మరి ఓటీటీలో కన్నప్ప ఏ మేరకు ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











