For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sammathame OTT: ఆ ఓటీటీలో సమ్మతమే స్ట్రీమింగ్.. మరీ మూడు వారాలకేనా!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో బ్యాగ్రౌండ్ లేని వాళ్లు కూడా చాలా మందే ఉంటున్నారు. ఇలా వచ్చి మొదటి సినిమాతోనే యమా ఫేమస్ అయిన వారిలో రాయలసీమ చిన్నోడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత చేసిన 'సెబాస్టియన్' మూవీ మాత్రం అతడికి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు.

  నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

  కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కిరణ్ అబ్బవరం ఇటీవలే 'సమ్మతమే' అనే సినిమాలో నటించాడు. గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గత నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి స్థాయి ప్రేమకథతో సందేశాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను అల్లు అరవింద్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే 'సమ్మతమే' సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరిగింది.

  Kiran Abbavaram Sammathame Movie Streaming on Aha From July 15th

  వివాహం తర్వాత అమ్మాయిలు.. భర్తల అభిరుచి తగినట్లు.. ప్రేమలో పడిన యువతులు తమ ప్రియుడు చెప్పినట్లు మారడం వల్ల ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ 'సమ్మతమే' చిత్రాన్ని తెరకెక్కించారు. అంచనాలకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ మంచిగానే ఉన్నా.. దాన్ని నడిపించిన తీరు నిరాశజనకంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఈవినింగ్ షోలకు కూడా ఈ సినిమా తేరుకోలేకపోయింది. ఫలితంగా ఓపెనింగ్స్‌ను దక్కించుకోలేదు. అదే కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లతో రన్‌ను ముగించుకుంది.

  మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

  థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన 'సమ్మతమే' మూవీని ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే దానిపై రెండు మూడు రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. అయితే, తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసుకున్న తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. తాజాగా దీనిపై ప్రకటన చేసింది. అందులో ఈ చిత్రాన్ని జూలై 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అంటే విడుదలైన మూడు వారాలకే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందన్న మాట. ఇక, దీని కోసం చాలా మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  కిరణ్ అబ్బవరం హీరోగా యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన చిత్రమే 'సమ్మతమే'. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాలో తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనకాల ప్రవీణ నిర్మించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.

  English summary
  Kiran Abbavaram Now Did a Film Sammathame Under Gopinath Reddy Direction. This Movie Movie Streaming on Aha From July 15th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X