Lavanya Tripathi జోరు మీద ఉన్న అందాల రాక్షసి.. రాకెట్ స్పీడ్‌తో ధనాధన్!

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న లావణ్య త్రిపాఠి.. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత దూసుకెళ్తా, మనం, సొగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో తనదైన శైలిలో తన అభిమానులకు కొత్త అనుభూతిని పంచింది. ఇటీవల అర్జున్ సురవరం, చావుకబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే చిత్రాలతో మంచి విజయాలను అందుకొన్నది.

అయితే ఇటీవల కాలంలో లావణ్య త్రిపాఠి కెరీర్ రాకెట్ స్పీడ్‌ దూసుకెళ్తున్నది. తెలుగు, తమిళంలో సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన కెరీర్ మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. విభిన్నపాత్రలను ఎంచుకొంటూ నటిగా కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Lavanya Tripathis Puli Meka set to OTT release on Zee5

ఇక లావణ్య త్రిపాఠి కెరీర్ విషయానికి వస్తే.. తమిళంలో అథర్వతో నటిస్తున్న ఇంకా పేరు పెట్టని సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. రెండు పాటలు ఇంకా చిత్రీకరించాల్సి ఉంది.

ఇక జీ5 రూపొందిస్తున్న పులి మేక వెబ్ సిరీస్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మంజునాథ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ పూర్తి కావొస్తున్నది. అలాగే తమిళ, తెలుగు భాషల్లో వెబ్ సిరీస్‌లు షూట్స్‌లో ఉన్నాయి. ఇలా చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో లావణ్య త్రిపాఠి.. మరో రెండు భారీ ప్రాజెక్టులను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X