Don't Miss!
- News
కరోనాకేసుల ఊగిసలాట: కాస్త తగ్గిన కొత్తకేసులు; లక్షా ఏడువేల యాక్టివ్ కేసులు!!
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Sarkaru Vaari Paata: ఓటీటీ రిలీజ్ పై చర్చలు.. ఫైనల్ గా వచ్చేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లుగానే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో మాత్రం నిర్మాతలను లాభాల్లోకి తీసుకురాలేకపోయింది.
ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని డేట్స్ కూడా ఇవే అంటూ ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

వాయిదా పడుతూ..
గీత గోవిందం సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యువ దర్శకుడు పరశురామ్ ఆ తర్వాత నాగ చైతన్యతో సినిమా చేయాల్సింది. కానీ అప్పుడే మహేష్ బాబు కథ చెప్పాలని కోరడంతో పరుశురాం సింగిల్ సిట్టింగ్ లోనే కథ చెప్పి ఓకే చేయించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు కు జోడిగా కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ పై కూడా విడుదలకు ముందే అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్ గా మార్చి 12వ తేదీన సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. మహేష్ బాబు సినిమా కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడం జరిగింది.

మహేష్ కోసమే..
అయితే ఈ సినిమా విడుదల అనంతరం కొంత నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక కమర్షియల్ గా మహేష్ బాబు తన స్టార్ హోదాతోనే ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చేలా చేశాడు అని చెప్పవచ్చు. కేవలం మహేష్ కోసమే ఈ సినిమాను ఫ్యాన్స్ ఎక్కువగా చూశారు. సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ తో పాటు సరికొత్త కామెడీ టైమింగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా పాటలు కూడా ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

బాక్సాఫీస్ కలెక్షన్స్
బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట సినిమా పూర్తి స్థాయిలో అయితే ఇంకా లాభాల్లోకి రాలేక పోయింది. ఇంకా ఈ సినిమా 13 కోట్లకు పైగా షేర్ వసూలు సాధించాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా టోటల్గా సినిమా వంద కోట్లకు పైగా షేర్ వసూలు సాధించినప్పటికీ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మాత్రం సినిమా ఇంకా పూర్తిస్థాయిలో లాభాల్లోకి రాలేకపోయింది.

ఓటీటీలో విడుదల ఎప్పుడు?
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే అమెజాన్ ప్రైమ్ లో సర్కారు వారి పాట జూన్ 10వ తేదీన లేదా జూన్ 24వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫైనల్ గా అయితే జూన్ 10వ తేదీన రావచ్చని బలమైన టాక్ వినిపిస్తోంది. త్వరలోనే విడుదల తేదీపై చిత్ర యూనిట్ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.