For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu బిగ్ బాస్ మరో స్కెచ్.. బీబీ జోడీ తర్వాతే ఓటీటీ 2.. జూలైలో కాకుండా అప్పుడు!

  |

  బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. ముందుగా హిందీలో తీసుకొచ్చిన ఈ రియాలిటీ షోకి విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో తదితర భాషల్లో కూడా ఈ షోను ప్రారంభించారు. అందులో భాగంగానే 2017లో తెలుగులో మొదటి సీజన్ వచ్చింది.

  జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించిన ఈ సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో వరుసగా పలు సీజన్లను తీసుకొస్తున్నారు. టెలివిజన్ లోనే కాకుండా డిజిటల్ తెరపై కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 2వ సీజన్, బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది.

  సూపర్ డూపర్ హిట్ లుగా..

  సూపర్ డూపర్ హిట్ లుగా..

  ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా రికార్డులు సాధించాయి.

  సింగర్ రేవంత్ గెలవడంతో..

  సింగర్ రేవంత్ గెలవడంతో..

  తెలుగులో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు భారీ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని నడిపించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ఎన్నో ట్విస్టులు, అనుకోని సంఘటనలు, ఊహించన పరిణామాలతో సాగిన ఆరో సీజన్ ఫినాలేలో సింగర్ రేవంత్ ట్రోఫిని అందుకోవడంతో అతనే విజేతగా నిలిచాడు.

  నిజాయితీ పరులకు అన్యాయం..

  నిజాయితీ పరులకు అన్యాయం..

  బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆరో సీజన్ మాత్రం అందుకు భిన్నంగా చాలా నిరుత్సాహపరించింది. ప్రేక్షకులనే కాకుండా బీబీ లవర్స్ ను కూడా ఆకట్టుకోకుండా ఈసారి ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రలోభాలు కూడా ఉండటంతో నిజాయతీగా ఆడిన కొంతమంది కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు ఎక్కువగా తలెత్తాయి. అందుకే ఈ సీజన్ కు రేటింగ్ బాగా పడిపోయిందని టాక్.

  టాప్ సెలబ్రిటీస్ ను అప్రోచ్..

  టాప్ సెలబ్రిటీస్ ను అప్రోచ్..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైన ఏడో సీజన్ ను హిట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది బీబీ టీమ్. అందుకు అనుగుణంగానే ప్రణాలికలు రచిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 కోసం హీరోలు, పాపులర్ టెలివిజన్ యాక్టర్స్, సింగర్స్, గత సీజన్ రన్నరప్స్ ను అప్రోచ్ అవుతూ డీల్ కుదుర్చుకుంటోంది బిగ్ బాస్ మేనేజ్ మెంట్.

  బీబీ జోడి డ్యాన్స్ షో..

  బీబీ జోడి డ్యాన్స్ షో..

  అయితే ఈ ఏడాది వెనువెంటనే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ను, బిగ్ బాస్ టెలివిజన్ సీజన్ ను నడిపించేందుకు బీబీ టీమ్ స్కెచ్ వేసిందని టాక్ నడుస్తోంది. ఆ సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొనేందుకు టాప్ సెలబ్రిటీస్ వెంట పడుతున్నారు నిర్వహాకులు. ఇక ఇటీవల బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తి కాగానే బీబీ జోడీ పేరుతో రియాలిటీ డ్యాన్స్ షోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో బిగ్ బాస్ గత సీజన్లలోని కంటెస్టెంట్స్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.

  జూన్ మొదటి వారంలో..

  జూన్ మొదటి వారంలో..

  ఈ బీబీ జోడీ డ్యాన్స్ షో పూర్తి కాగానే బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ ను ప్రారంభించనున్నారట. బీబీ జోడీ మార్చిలో అయిపోగానే ఏప్రిల్ లో ఈ ఓటీటీ నాన్ స్టాప్ సీజన్ ను స్టార్ చేయాలని బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ 1 వారంలో ఈ ఓటీటీ రెండో సీజన్ ను పూర్తి చేసి మెయిన్ సీజన్ అంటే బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

  హోస్ట్ గా ఎవరంటే..

  హోస్ట్ గా ఎవరంటే..

  ఇదివరకు ఈ బిగ్ బాస్ 7 సీజన్ ను జూలైలో ప్రారంభించనున్నారని టాక్ నడిచిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ముందుగా జూన్ లో ఓటీటీ సీజన్ పూర్తి చేసి ఆరో సీజన్ లాగే సెప్టెంబర్ లో ఏడో సీజన్ ను ప్రారంభించనున్నారని సమాచారం. ఇక ఈ సీజన్ కు హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా రానున్నట్లు ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతోంది. మరి హోస్ట్ గా ఎవరు వస్తారో.. సీజన్స్ ఎప్పుడు ప్రారంభిస్తారో అనేది వేచి చూడాలి.

  English summary
  Makers Did Not Cancelled Bigg Boss OTT 2 Season And Planning To Start In March After Completion Of BB Jodi. Bigg Boss Telugu 7 Season Will Start In September.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X