Don't Miss!
- News
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: హీరోయిన్ కావాలంటే కాంప్రమైజ్.. ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య షాకింగ్ కామెంట్!
ఆహా షో ద్వారా నందమూరి బాలకృష్ణ మరింత క్రేజ్ అందుకుంటున్నారు అనే చెప్పాలి. ప్రతి ఎపిసోడ్లో కూడా విభిన్నమైన తరహాలో గెస్టులందరిని కూడా ఆయన సరదాగా ప్రశ్నలకు అడుగుతూ ఉండడం అలాగే వారికి చిన్నచిన్న టాస్కులు ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సెకండ్ సీజన్ 6వ ఎపిసోడ్లో ముగ్గురు అందమైన నటీమణులు కనిపించబోతున్నారు. ఇక ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే..

జై బాలయ్య సాంగ్
నందమూరి బాలకృష్ణ ఆహా షో తదుపరి ఎపిసోడ్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ప్రభాస్ గోపీచంద్ కంటే ముందు జయసుధ జయప్రద రాశి కన్నా కూడా ఒక ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఇక ముందుగా ఆ ముగ్గురు నటి మణులతో జై బాలయ్య అంటూ పాట పాడుతూ చిందులు వేశారు. ఇక జయప్రద రాగానే ఏదో తేడాగా ఉంది అంటూ కామెంట్ చేసింది.

నేను పడిపోయాను
రాశి ఖన్నాను చూసిన బాలయ్య ఊరికే నవ్వుతు నన్ను పడేస్తావో అని అన్నారు. అంతేకాకుండా నేను పడిపోయాను అని కూడా ఆయన సరదాగా వివరణ ఇచ్చారు. అలాగే రాశి ఖన్నా కూడా ఒక అందమైన పాటతో అందరిని ఎంతగానో కట్టుకుంది. అలాగే జయసుధ జయప్రద తో ఒక ఆట ఆడిన బాలయ్య.. అందులో ఇద్దరు కూడా ఆటో పట్టించారు.

ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు
అలాగే నాలుగు టేకిలా షాట్స్ వేసి మనం గేమ్ ఆడదామా అంటూ కూడా బాలయ్య రాశి ఖన్నా తో అనడం హైలెట్ గా నిలిచింది. షాట్స్ అంటే చలో అంటూ వచ్చేస్తారు అని కూడా బాలయ్య కామెంట్ చేయడం వైరల్ అయింది. ఇక అంతే కాకుండా ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు కూడా వేశారు. కొంతమంది హీరోల పేర్లు చెబుతు జయప్రదతో ఎవరికి నటించడం అంటే ఇష్టమని కూడా అడుగుతూ.. సరదాగా నవ్వించారు.

కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా?
ఇంకా బాలయ్య.. జయప్రద జయసుధ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. నేను శృతిహాసన్ ఇప్పుడు హార్ట్ పేయిర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. అలాగే కొన్ని సందిగ్ధమైన ప్రశ్నలు కూడా వేశారు. హీరోయిన్ కావాలంటే కొన్ని కాంప్రమైజ్ లు కాక తప్పదు అని.. ఇది నిజమా అబద్దమా అని బాలకృష్ణ అడిగారు. ఇక ఆ ప్రశ్నకు అందరూ కూడా విభిన్న తరహాలో ఆలోచించారు.

వందసార్లు ఆలోచిస్తారు..
అలాగే ఉమెన్ సెంట్రిక్ సినిమాల మీద నిర్మాతలు డబ్బులు పెట్టడానికి వందసార్లు ఆలోచిస్తారు అనేది నిజామా అబద్దమా అని కూడా ఆ ముగ్గురి నటీమణులను అడిగారు. ఇక అందుకు జయప్రద రియాలిటీ అని సమాధానం చెప్పేశారు. ఈ ఎపిసోడ్ లో అయితే నందమూరి బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్స్ ను అనేక రకాల ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక డిసెంబర్ 23న ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఇంకా ఎన్ని కాంట్రవర్సిటీ విషయాలను డిస్కస్ చేశారో చూడాలి.