Don't Miss!
- Technology
Moto G42 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, లాంచ్ ఆఫర్స్ ఇవిగో...
- News
ప్రధాని హెలికాప్టర్ మార్గంలో నల్ల బెలూన్లు- ఎవరి పని : విచారణ మొదలు..!!
- Finance
Viral Tweet: తల్లదండ్రుల ప్రేమ అలా ఉంటది.. హర్ష్ గోయెంకా ట్వీట్ పై మహీంద్రా స్పందనకు నెటిజన్లు ఫిదా..
- Lifestyle
బరువు తగ్గడానికి కష్టపడే వారి కోసం ఈ జ్యూస్‌లు ...
- Sports
బాగా ఇరిటేట్ చేస్తాడు: పుజారాపై హైదరాబాదీ పేసర్ సిరాజ్ హాట్ కామెంట్స్
- Automobiles
భారతదేశంలో తిరుగులేని కార్ బ్రాండ్‌గా ఎదుగుతున్న కొరియన్ కంపెనీ 'కియా మోటార్స్'..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Ante Sundaraniki OTT: అనుకున్న డేట్ కంటే ముందే రాబోతున్న నాని సినిమా.. ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అంటే సుందరనికి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే నాని నుంచి చాలా రోజుల తరువాత కామెడీ సినిమా వస్తుండడంతో ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని చూపించారు. అయితే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈ సినిమాను అనుకున్న డీల్ కంటే ముందే ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అతి తక్కువ ఓపెనింగ్స్
నాని ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని చెప్పవచ్చు. అయితే అంటే సుందరనికి సినిమా మాత్రం నాని స్టార్ హోదాకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అందుకోకపోవడం విశేషం. ఒక విధంగా ఈ సినిమాకు మ్యూజిక్ కూడా పెద్దగా పాజిటివ్ హైప్ క్రియేట్ చేయలేదు. గతంలో చూసుకుంటే నాని ప్రతి సినిమా కూడా మ్యూజికల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. కానీ అంటే సుందరనికి సినిమాకు వచ్చేసరికి మాత్రం మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.

అంచనాలు రివర్స్
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నజ్రియా మొదటిసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఆమె చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ నానితో జంటగా నటించేందుకు పెద్దగా ఆలోచించకుండా ఒప్పేసుకుంది. ఇక ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకున్నారు. దానికి తోడు వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయడం కూడా కొంత హైప్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలు రివర్స్ అయ్యాయి.

నెగిటివ్ టాక్ రాలేదు కానీ..
అంటే..సుందరనికి
సినిమాకు
నెగిటివ్
టాక్
పెద్దగా
ఏమి
రాలేదు.
అలాగని
మళ్ళీ
మళ్ళీ
చూసే
సినిమా
అనేంతగా
పాజిటివ్
టాక్
కూడా
రాలేదు.
రివ్యూలు
కూడా
పాజిటివ్
గానే
వచ్చాయి.
ఇక
యావరేజ్
సినిమా
అని
తేలడంతో
ఓ
వర్గం
ఆడియెన్స్
పెద్దగా
ఆసక్తి
చూపలేదు.
ఇక
ఓపెనింగ్స్
చాలా
తక్కువ
రావడంతో
చాలా
వరకు
డిస్ట్రిబ్యూటర్స్
నష్టపోయారు
అనే
చెప్పాలి.

నష్టం ఎంతంటే?
అంటే.. సుందరనికి సినిమా బాక్సాఫీస్ వద్ద 30కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలవ్వగా కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే దక్కింది. ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతున్నప్పటికి బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమనే చెప్పాలి. ఈ సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇక ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇటీవల నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసలైతే ముందుగా నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం 6 వారాల తరువాత విడుదల చేయాలి. కానీ ఇప్పుడు థియేట్రికల్ గా సినిమా సక్సెస్ కాకపోవడంతో ఓటీటీ సంస్థతో మరో డీల్ మాట్లాడుకొని అంతకంటే ముందే జూలై 8వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. త్వరలోనే ఈ డేట్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా ఒక క్లారిటీ రానున్నట్లు సమాచారం.