twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTT రంగంలో టాప్ లేపిన నెట్‌ఫ్లిక్స్.. డిస్నీ హాట్ స్టార్‌‌ను వెనుకకు తోసి..

    |

    గత కొద్ది నెలలుగా సబ్ స్క్రైబర్స్‌ను భారీగా కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రంగంలో సత్తా చాటింది. ఈ ఏడాది తొలి భాగంలో నెట్ ఫ్లిక్స్ భారీగా తడబాటుకు గురైంది. అయితే ఏడాది తొలి భాగంలో 1.2 మిలియన్లను కోల్పోయిన నెట్‌ఫ్లిక్స్ సెప్టెంబర్ మాసంలో 2.4 మిలియన్ల కొత్త యూజర్లను సాధించింది. దీంతో డీస్నీ+హాట్ స్టార్‌పై అధిక్యం సాధించింది.

    తాజా రిపోర్టు ప్రకారం.. డిస్నీ హాట్ స్టార్‌కు 221 మిలియన్ల యూజర్లు ఉంటే.. నెట్ ఫ్లిక్స్‌కు 223 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. దాంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రంగంలో అగ్రస్థానంలో నిలిచింది.

     Netflix get record subscribers than Disney Hotstar in OTT Competition

    నెట్ ఫ్లిక్స్ మళ్లీ అగ్రస్థానంలో చేరుకోవడంపై నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ఊపిరి పీల్చుకొన్నాడు థ్యాంక్స్ గాడ్.. గత త్రైమాసికంలో భారీగా యూజర్లను కోల్పోయాం. కానీ ఈ త్రైమాసికంలో తిరిగి పొందాం అని అన్నారు.

    తాజాగా యూజర్లు భారీగా పెరగడంతో 6 శాతం రెవెన్యూ పెంచుకొన్నది. దాదాపు 7.93 బిలియన్ల మేర ఆదాయాన్ని రాబట్టింది. అయితే అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారీ రేట్ల కారణంగా యూజర్లను ఆకట్టుకోలేకపోతున్నది. అమెజాన్, డిస్నీ, సోని లివ్, జీ5, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీ సంస్థలతో పోటీ పడాల్సి వస్తున్నది.

    English summary
    Popular OTT App Netflix get record subscribers than Disney Hotstar in OTT Competition. Reports suggest that, Netflix now has 223 million subscribers under its belt; the highest for any OTT platform in the world, as Disney has 221 million users.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X