OG Movie on OTT: ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. పవన్ కల్యాణ్ మూవీ ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే?
పవర్ స్టార్ పవర్ కల్యాణ్ నటించిన OG చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తున్నది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించి కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం రానున్న రోజుల్లో ఓటీటీలో తుఫాన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నదనే వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ OG. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్‌ను ఇచ్చాయి. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు.

ఓజీ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 225 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్ల రూపాయల మేర గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. అయితే ఓటీటీ సంస్థలతో ముందస్తుగా చేసుకొన్న ఒప్పందం ప్రకారం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.
అయితే షూటింగ్ దశలోనే భారీ హైప్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను భారీ రేటు చెల్లించి నెట్‌ఫ్లిక్ష్ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల ఓటీటీ రైట్స్ అన్నీ కలిపి సుమారుగా 95 కోట్ల రూపాయల మేర ఓటీటీ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాను థియేటర్‌లో పండుగ చేసుకొన్న అభిమానులు.. ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఓజీ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్లాన్ చేస్తున్నది. ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే అనధికారికంగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సినిమా గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా త్వరలోనే ప్రకటన చేయనున్నద అని తెలిసింది.
ఓజీ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 190 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో 19 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షల రూపాయలు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. 280 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications










