OG Trending Globally: 18 దేశాల్లో OG సంచలనం.. ఓటీటీలో పవన్ కల్యాణ్ మూవీ విధ్వంసం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతున్నది. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించి ఈ సినిమా రిలీజ్‌కు ఒక నెల ముందే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ విడుదల తర్వాత అదే జోష్‌ను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో కొనసాగిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్‌లో సంచలన రికార్డు క్రియేట్ చేసింది.ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

OG చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే థియేట్రికల్ రన్‌లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ రికార్డు, ట్రెండింగ్ క్రియేట్ చేస్తున్న ఓజీ మూవీ గురించిన వివరాల్లోకి వెళితే..

OG Trending Worldwide

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ (OG) సినిమా హక్కులు రికార్డు స్థాయిలో జరిగింది నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 70 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 25 కోట్ల రూపాయల మేర రైట్స్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 165 కోట్ల షేర్.. 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన పరిస్థితిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే రిలీజ్ తర్వాత పవన్ కల్యాణ్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 194 కోట్ల రూపాయలు, కన్నడలో 20 కోట్ల రూపాయలు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు, హిందీలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 224 కోట్ల రూపాయలు నమోదు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 70 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

పవన్ కల్యాణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు చేసిన ఈ చిత్రం తాజాగా ప్రముఖ ఓటటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లోకి రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా సునామీ క్రియేట్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సినిమా 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ గానే.. కాకుండా ఓటీటీలో కూడా అనూహ్యమైన స్పందనను చూరగొంటున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్‌లో సంచలనం రీతిలో స్ట్రీమింగ్ అవుతున్నది. అక్టోబర్ 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు లభ్యమైన గణాంకాల ప్రకారం.. ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో 10 స్థానంలో ట్రెండ్ అవుతున్నది. ఇక వరల్డ్ వైడ్‌గా 9వ స్థానంలో ట్రెండ్ అవుతున్నది. ఇంక ఇండియాలో 1 స్థానంలో ట్రెండ్ అవుతున్నది. ఇక నాన్ ఇంగ్లీష్ మూవీ కేటగిరిలో ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతున్నది. ఇప్పటి వరకు 3.5 మిలియన్ వ్యూస్ సాధించింది అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది.

More from Filmibeat

Read more about: og pawan kalyan netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X