twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Parampara Season 2 Review: జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన 'పరంపర 2' ఎలా ఉందంటే?

    |

    రేటింగ్: 2.5/5

    బాహుబలి సినిమా నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ నుంచి వచ్చిన తాజా వెబ్ సిరీస్ పరంపర 2. గతంలో వచ్చిన పరంపర వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సిరీస్ జూలై 21వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, ఆమని, కస్తూరి వంటి స్టార్ నటీనటులు నటించడంతో సిరీస్ మీద మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు మొదటి సీజన్ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో రెండో సీజన్ మీద కూడా ఆసక్తి ఏర్పడింది. మరి పరంపర 2 సీజన్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    పరంపర 2 కథలోకి వెళితే

    పరంపర 2 కథలోకి వెళితే

    మోహన్ రావు(జగపతి బాబు) కుమారుడు గోపి(నవీన్ చంద్ర) ఎలా అయినా తన తండ్రి రాజకీయంగా ఎదగాలని ఉద్దేశంతో తన నాయుడు బాబాయి(శరత్ చంద్ర)కి ఎదురు తిరిగడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. లైసెన్స్ లేకుండా తుపాకీ వాడినందుకు గాను మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తూ ఉంటాడు. అతను సారీ చెబితే బయటకు తీసుకు వస్తానని నాయుడు చెబుతాడు. కానీ గోపి మాత్రం అందుకు ఇష్టపడడు. జైలులో అతనికి ఐఏఎస్ ఆఫీసర్ రత్నాకర్(రవివర్మ) పరిచయం అవుతాడు. రత్నాకర్ జైలు నుంచే సాగిస్తున్న వ్యాపారాల వలన వారానికి 30 లక్షల సంపాదన వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు గోపీ. ఆ వచ్చిన డబ్బంతా పెట్టి భానుమతి ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి తద్వారా రాజకీయ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే పదవికి సురేష్ నామినేషన్ వేస్తే అతనికి పోటీగా గోపి తల్లి భానుమతి కూడా నామినేషన్ వేస్తుంది. ఈ క్రమంలో ఆమెను చంపేందుకు కూడా సురేష్, నాయుడు సిద్ధం అవుతారు. ఈ క్రమంలో మధ్యలో ఆకాంక్ష తల్లిదండ్రులను చంపింది ఎవరు అనే విషయం కూడా బయటకు వస్తుంది. ఇన్ని ట్విస్టుల నేపథ్యంలో ఏం జరిగిందో తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:


    ఇక పరంపర 2 వెబ్ సిరీస్ విషయానికి వస్తే మొదటి సీజన్ తో పోలిస్తే ఈ రెండవ సీజన్ కు చాలా తక్కువగా ఎపిసోడ్స్ ఉన్నాయి. అలాగే ఎపిసోడ్స్ నిడివి కూడా తక్కువగానే ప్లాన్ చేశారు. అందువల్ల ప్రేక్షకులకు కొంచెం ఆసక్తిగా చూసే అవకాశం కలిగింది. అయితే మొదటి సీజన్ చూసిన వాళ్ళందరూ ఎవరైనా జైలు నుంచి బయటకు వచ్చిన గోపి బాబాయ్ మీద పగ తీర్చుకుంటాడని భావిస్తారు కానీ రత్నాకర్ మాటలు విన్న తర్వాత గోపి బయటకు వచ్చి బాబాయి మీద దాడికి వెళ్ళకుండా తనను తాను బలంగా తయారు చేసుకోవడం మీద దృష్టి పెడతాడు.. అక్కడి నుంచే ప్రేక్షకులలో సిరీస్ పై ఆసక్తి కలుగుతుంది. ఇక ఈ రెండో సీజన్ చివరిలో కూడా మూడో సీజన్కు అవకాశం ఉండేలాగా ఒక చిన్న లీడ్ ఇచ్చారు. ఫైనల్ ఎపిసోడ్ అలాగే ఎడిటింగ్ కూడా బాగా కుదిరాయి.

     సాంకేతిక వర్గం

    సాంకేతిక వర్గం


    రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్ అలాగే రైటర్స్ బాగా సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు కానీ కథా కథనం విషయానికి వస్తే కొన్ని లూప్ హోల్స్ అలాగే లాజిక్స్ వదిలేశారు. ఒక జిల్లా ఎస్పీ కనిపించకుండా పోతే ఎవరు అసలు ఏమీ తెలియనట్లు ప్రవర్తించడం అసలు ఆ ఎస్పీ ప్రస్తావనే తీసుకురాకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే కొన్ని విషయాల్లో సినిమాటిక్ లిబర్టీ గట్టిగా వాడేశారు. అలా వాడకుండా ఎక్కడికక్కడ లాజికల్ గా క్లారిటీ ఇచ్చుకుంటే బాగుండేది.

    నటీనటులు విషయానికి

    నటీనటులు విషయానికి


    నటీనటులు విషయానికి వస్తే ఈ సీరియల్స్ లో జగపతిబాబు, శరత్ కుమార్ వంటి అగ్ర నటీనటులు కాకుండా నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్, బిగ్ బాస్ దివి వంటి నేటి తరం నటులు కూడా కనిపించారు. ముఖ్యంగాజగపతిబాబు, శరత్ కుమార్ నటనానుభవం స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదటి భాగంలోనే వీరిద్దరికి నటించే స్కోప్ ఎక్కువగా దక్కిందని చెప్పవచ్చు. ఇక నవీన్ చంద్రకు కూడా బాగా నటించే అవకాశం దక్కింది. ఈ సీజన్లో ఆవేశంతో కాకుండా ఆలోచనతో కూడిన మనిషిగా కనిపించి ఆసక్తి రేకెత్తించాడు. ఇక ఆకాంక్ష సింగ్ కి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. నైనా గంగూలి కేవలం రెండు మూడు సీన్స్ లోనే కనిపిస్తుంది. ఇక కనిపించింది నాలుగైదు సీన్లు అయినా రవివర్మ సిరీస్ మీద మంచి ఇంపాక్ట్ కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే మంచి సినిమా అవకాశాలు దక్కించుకున్న దివి ఇలాంటి చిన్న పాత్రలో ఎందుకు నటించింది అనే విషయం మీద మాత్రం క్లారిటీ రాదు.

     సాంకేతిక వర్గం పనితీరు

    సాంకేతిక వర్గం పనితీరు


    అలాగే ఈ కథకు తగినట్లుగా రాసుకున్న కథనం బాగా కుదిరింది. ఈ కథకు కృష్ణ విజయ్ ఎల్, హరి ఏలేటి రాసిన మాటలు కూడా బాగున్నాయి. తక్కువ మాటల్లో ఎక్కువ డెప్త్ ఉండేలా రాసుకునారు. ఇక కాస్ట్యూమ్స్ సహా మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

    ఫైనల్ గా

    ఫైనల్ గా


    ఇక ఫైనల్ గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే పరంపర సీజన్ వన్ నచ్చిన వారికి సీజన్ 2 కూడా ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ కంటే రెండో సీజన్ బాగుంది. మొత్తానికి తెలిసిన కథ అయినప్పటికీ మంచి ఆసక్తికర విషయాలతో రూపొందించారు.

    ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

    ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌


    నటీనటులు: నవీన్ చంద్ర, శరత్ కుమార్, జగపతి బాబు, ఆకాంక్ష సింగ్, నైనా గంగూలీ, ఆమని, కస్తూరి, దివి తదితరులు
    కథ : హరి ఏలేటి
    మాటలు: కృష్ణ విజయ్ ఎల్, హరి ఏలేటి
    సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
    సంగీతం: నరేష్ కుమరన్
    నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
    దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల

    English summary
    jagapathi babu, naveen chandra, sarath kumar starrer Parampara Season 2 Review and rating is here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X