OG OTT Price : భారీ ధరకు OG ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లకు అమ్ముడైందంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీ THEY CALL HIM OG. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ అలరించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషించారు. జాకీ ష్రాఫ్, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, అజయ్ ఘోష్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలోని ముఖ్య పాత్రలను పోషించారు. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అద్భుతమైన సంగీతం అందించారు.

ప్రస్తుతం ఓజీ సినిమా థియేట్రికల్ జోరుగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో టాప్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య భారీ ఖర్చుతో నిర్మించారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి థియేటర్లలోకి విడుదలయ్యే వరకు సినిమాకు రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఓపెనింగ్ డేనే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కింది.

Pawan Kalyan Sujeeth OG Movie sold OTT Rights for Huge Price

ఇక OG చిత్రం నెల రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం థియేట్రికల్ గా దుమ్ములేపుతోంది. ఓటీటీలోనూ ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అక్లోబర్ చివరి వారంలో లేదంటే నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్ ను అందుబాటులోకి రానుంది. కాగా, OG మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఓటీటీ విడుదలకు సంబంధించిన పక్కా డేట్ ను అనౌన్స్ చేయలేదు.

పవర్ స్టార్ కెరీర్ లో భారీ హైప్ సాధించిన ఈ చిత్రానికి ఓటీటీ ధర కూడా భారీగానే పలికింది. కేవలం డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ రూ.81 కోట్లు వెచ్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ సినిమా రిలీజ్ కు ముందే జరగడం విశేషం.

మరోవైపు ఎస్ఎస్ థమన్ తన కెరీర్ లోనే బెస్ట్ సౌండ్ ట్రాక్, సాంగ్స్ ను OG చిత్రానికి అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే OG మ్యూజిక్ నేషన్ వైడ్ గా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. దీంతో OG మూవీ ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ రూ.16 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ కు సంబంధించిన హక్కులు ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని తెలుస్తోంది. అవి కూడా కలుపుకుంటే 120 కోట్ల రూపాయల వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక OG చిత్రం వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషంగా మారింది.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X