OG movie OTT : ఓజీ మూవీ ఓటీటీ, శాటిలైట్స్ రైట్స్ డిటైల్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గ్యాంగ్ స్టార్ ఫిలిం OG. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ అందుతున్నాయి. చివరిగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఫలితాన్ని అందించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఇప్పుడు అభిమానుల గురి OG సినిమాపై పడింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో విడుదల కాబోతుండడంతో ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అప్పుడప్పుడు సినిమా చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు.

కాగా OG చిత్రానికి సంబంధించిన రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లను మేకర్స్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ప్రస్తుతం మేకర్స్ ఓజీ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందుకుగాను అనుగుణంగా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.

Pawan Kalyan Sujeeth Upcoming Movie They Call Him OG OTT Details

సెప్టెంబర్ 21న OG సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది. ఇక ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ చిత్రం ఎలాగూ నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుండడం తెలిసింది. అయితే OG చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ఏ సంస్థలు దక్కించుకున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. OG సినిమా ఓ టి టి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓజీ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ దక్కించుకుంది. భారీగానే ఈ చిత్రం రైట్స్ కు చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా దక్కించుకుందని తెలుస్తోంది. ఇలా రిలీజ్ కు ముందే OG చిత్రానికి సంబంధించిన నాన్ థియేటర్ రైట్స్ డీల్ పూర్తి కావడం విశేషం. ఇక ఓటిటిలోకి OG సినిమా ఎప్పుడు వస్తుందనేది పక్కా డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. మునుముందు ఆ వివరాలు రానున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఓజీ. ఇక చిత్రానికి కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ ను వెచ్చించి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఇక సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా అలరించబోతున్నారు. తొలిసారిగా ఆయన కెరీర్ లో సౌత్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తెలుగుతో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: pawan kalyan sujeeth og movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X