Don't Miss!
- Sports
IND vs NZ: రెండో టీ20లో భారత్ గెలవాలంటే ఈ మూడు మార్పులు చేయాల్సిందే!
- News
మరోసారి హైదరాబాద్లో కుంగిన రోడ్డు: గుంతలోకి టిప్పర్, ముగ్గురికి గాయాలు
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Unstoppable 2: పవన్ వేసుకొచ్చిన బ్లాక్ హుడీ ఫొటోస్ వైరల్.. ధర ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలోకి రాబోతున్నాడు అనగానే ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ కొనసాగుతున్న షోలో పవన్ ఎదురుగా కూర్చుని సమాధానాలు చెబుతూ ఉంటే చూడాలి అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం వీరి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ పై కూడా సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన వేసుకున్న బ్లాక్ హుడి ధర ఎంత ఉంటుంది అనే విషయం గురించి కూడా ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ఇక దాని ధర ఎంత ఉంది అనే వివరాల్లోకి వెళితే..

మొదటిసారి ఇలా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకియల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక టాక్ షోలో పాల్గొనడం వైరల్ గా మారింది. అది కూడా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పాల్గొనడం ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా వైరల్ గా మారుతుంది.

పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో..
ఇక
ఈ
ఎపిసోడ్
ఎప్పుడు
ప్రసారమవుతుందా
అని
ఇరు
వర్గాల
ఫ్యాన్స్
అయితే
ఎంతో
ఆతృతగా
ఎదురు
చూస్తున్నారు.
ఇక
నందమూరి
బాలకృష్ణ
తప్పకుండా
కాంట్రవర్సీ
విషయాలపై
ఎన్నో
ప్రశ్నలు
అడుగుతారు
అని
అందరికీ
తెలిసిన
విషయమే.
ఇక
పవన్
కళ్యాణ్
జీవితంలో
కూడా
చాలా
విషయాల
గురించి
ఇలాంటి
షోలో
క్లారిటీ
ఇస్తే
తప్పకుండా
అతని
పొలిటికల్
కెరిర్
కు
కూడా
ఉపయోగపడే
అవకాశం
ఉంది.
కాబట్టి
పవన్
ఏ
విధంగా
స్పందిస్తాడు
అనేది
కూడా
ఈ
సమయంలో
చాలా
కీలకం
కానుంది.

పవన్ డ్రెస్ వైరల్
ఇక పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ షూటింగ్ కూడా మంగళవారం పూర్తయింది. పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు కలుసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్రెస్ గురించి కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. బ్లాక్ హుడి కోసం ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా గట్టిగానే సెర్చ్ చేస్తున్నారు.

బ్లాక్ హుడి కోసం సెర్చ్
సాధారణంగా సెలబ్రిటీలు స్టైల్ గా కనిపిస్తే మాత్రం వారు వేసుకున్న డ్రస్ అలాగే వాచ్ షూస్ ఇలా అన్ని రకాల కాస్ట్యూమ్స్ పై నేటిజన్స్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం కామన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్లాక్ హుడి కోసం కూడా ఫాన్స్ అయితే ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ధర ఎంతంటే?
ఈ బ్లాక్ హుడీ హ్యూగో బాస్ కంపెనీకి చెందింది అని తెలుస్తోంది. విదేశీ కరెన్సీ లో అయితే ధర 245 డాలర్లుగా ఉంటుందట. ఇక మన భారతీయ మార్కెట్ లో రూ.20 వేల నుంచి రూ.27 వేల మధ్యలో ఈ మోడల్ హుడిస్ మార్కెట్ లో ఉన్నాయి. ఎక్కువగా పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ బ్లాక్ హుడీలను కొనేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఫుల్ ఎపిసోడ్ లో పవన్ ఎలాంటి విషయాలపై స్పందిస్తారో చూడాలి.