twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2 షోలో కన్నీళ్లు పెట్టుకున్న ప్రభాస్.. ఎప్పుడు చూడని విధంగా డార్లింగ్!

    |

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డార్లింగ్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆయనపై అభిమానులకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రభాస్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానుల కోసం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 ద్వారా సూపర్ ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ ఎపిసోడ్ రెండో పార్టును విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

    శుక్రవారం రెండో పార్టు..

    శుక్రవారం రెండో పార్టు..

    ఇటీవల షూటింగ్ జరుపుకున్న ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ఇంటర్వ్యూ నిడివి భారీగా ఉండటంతో ఈ ఎపిసోడ్‌ను బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి బిగినింగ్‌గా, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి కన్‌క్లూజన్‌గా రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి పార్ట్‌1ను డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు ప్రసారం చేశారు. ఇక రెండో పార్ట్ అయిన బాహుబలి 2 ను జనవరి 6వ తేది అంటే ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.

     ఆయన ఒక లెజెండ్..

    ఆయన ఒక లెజెండ్..

    గోపీచంద్, ప్రభాస్ లతో కొన్ని సరదా గేమ్స్ అడించిన బాలకృష్ణ వారిద్దరి సంతకాలు చేయించుకున్నారు. తర్వాత ఇండస్ట్రీ అంటే రకరకాల సినిమాలు, రకరకాల ఎంటర్టైన్ మెంట్, లేకపోతే మంచి సందేశాత్మక సినిమాల గురించి మాట్లాడలంటే.. టి. కృష్ణ (గోపిచంద్ తండ్రి) గారి గురించి మాట్లాడాలి. ఆయన ఒక లెజెండ్. ఎందుకంటే నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, శోభన్ బాబు గారి లాంటి వాళ్లతో దేవాలయం, అలాగే వందేమాతరం, ప్రతిఘటన ఆల్ టైమ్ క్లాసిక్స్ వంటి చిత్రాలు చేసిన గొప్పవారు అని బాలకృష్ణ అన్నారు.

     గడిపిన సమయం చాలా తక్కువ..

    గడిపిన సమయం చాలా తక్కువ..

    గోపీ ఇప్పుడు మీ నాన్నగారితో నీకు ఉన్న అనుబంధం.. అంటే నీకు ఎంత వయసులో ఉన్నప్పుడు ఆయన నీకు దూరం అయ్యారు అని బాలకృష్ణ అడిగారు. దానికి 8 సంవత్సరాలప్పుడు అని గోపిచంద్ చెప్పాడు. ఏవైనా జ్ఞాపకాలు ఉన్నాయా అని అడిగితే.. ఉన్నాయి.. కానీ చాలా తక్కువ. అంటే తండ్రి అంటే భయం ఉండేది. గడిపిన సమయం చాలా తక్కువ సార్. అప్పుడు ఎందుకు ఎక్కువగా స్పెండ్ చేయలేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది అని గోపిచంద్ అన్నాడు. నీ సక్సెస్ చూసి ఆయన ఎంత సంతోషపడేవారో అని బాలకృష్ణ అన్నారు.

    చెప్పలేనంత మంచివారు..

    చెప్పలేనంత మంచివారు..

    ఒక మంచి మనిషి కొడుకువి.. ఒక గొప్ప మనిషి కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకువి. చెప్పలేనంత మంచివారు ఆయన. నటుడిగా ఆయన నైపుణ్యం, హితుడిగా ఆయన కారుణ్యం.. భక్తికి కొలమానం భక్త కన్నప్ప అని కృష్ణంరాజు గురించి గొప్పగా చెప్పిన బాలకృష్ణ ఆయనతో ప్రభాస్ దిగిన కొన్ని ఫొటోలను చూపించారు. దీంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు ప్రభాస్. తర్వాత ప్రభాస్ గురించి కృష్ణం రాజు మాట్లాడిన వీడియో చూపించారు.

    ప్రభాస్ నుంచి నేర్చుకునే పరిస్థితి..

    ప్రభాస్ నుంచి నేర్చుకునే పరిస్థితి..

    ఏదో ఒక పోగ్రామ్ లో ఒక చిన్న పిల్లవాడు.. హే ప్రభాస్ తండ్రిరా అన్నాడు. అలా అనేసరికి చాలా సంతోషం వేసింది. రెండు మూడు సినిమాలకే ప్రభాస్ అంతలా ప్రేక్షకులకు నచ్చాడు. ఇక బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. నాకంటే గొప్పవాడు అయ్యాడు. చాలా హ్యాపీగా ఉంది. అని కృష్ణంరాజు ఎమోషనల్ గా చెప్పే ఇంటర్వ్యూ వేశారు. తర్వాత ఆర్టిస్ట్ గా ప్రభాస్ నుంచి నేను నేర్చుకునే పరిస్థితికి వచ్చాను అని ఒక సినిమా ఫంక్షన్ లో కృష్ణంరాజు అన్నారు. దానికి అది అబద్ధం అని ప్రభాస్ చెప్పాడు. అప్పుడు అబద్ధం చెప్పడం ఈ కృష్ణంరాజుకు జీవితంలో అలవాటు లేదు. ఇక ముందు కూడా ఉండదు అని అనడంతో వెనుక నుంచి ప్రభాస్ హగ్ చేసుకుంటాడు. ఆ వీడియోను చూపించారు.

     కన్నీళ్లతో ప్రభాస్..

    కన్నీళ్లతో ప్రభాస్..

    వాళ్ల ఆశీస్సులు మనతో ఉండాలి. అది వాళ్ల గొప్పతనం. వాళ్ల ఔదార్యం. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అమరదీపం, భక్త కన్నప్ప వంటి చిత్రాలు చేశారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఉన్నాయి అని బాలకృష్ణ చెప్పాడు. తర్వాత రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రభాస్. కర్చీఫ్ తో కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రభాస్ కనపించడం ఇదే తొలిసారి అని డార్లింగ్ అభిమానులు అనుకుంటున్నారు.

    English summary
    Prabhas Eyes Get Into Tears About Krishnam Raju Death In Balakrishna Balakrishna Unstoppable With NBK 2 Latest Episode
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X