Peddi OTT Price: రామ్ చరణ్ పెద్ది ఓటీటీ రైట్స్.. భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆశించిన మేర అభిమానులను, ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయారు. ఇక అంతకు ముందు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరోసారి ఆ స్థాయిలో దుమ్ములేపేందుకు తన రాబోయే చిత్రం పెద్దితో రెడీ అవుతున్నారు రామ్ చరణ్. ఈ క్రమంలో పెద్ది సినిమా బడ్జెట్ ఎంత? కాస్ట్ అండ్ క్రూ? షూటింగ్ వివరాలు, ఓటీటీ రైట్స్ వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆయన టాలెంటెడ్ డైరెక్టర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. ఇదే సమయంలో ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో నటించేందుకు ఒప్పుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపు దిద్దుకుంటున్న స్పోర్ట్స్ డ్రామానే పెద్ది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్, ఫార్స్ ఫిల్మ్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం.

Ram Charan Buchi Babu Upcoming Movie Peddi Ott Rights sold for huge Price

పెద్ది సినిమా కోసం నిర్మాత వెంకట సతీశ్ కిలారు రూ.300 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుండటం విశేషం. మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కోచ్ గా కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై మరింతగా అంచనాలను పెంచుతోంది. అలాగే ఈ చిత్రంలో దివ్యేందు శర్మ, జగపతి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

పెద్ది చిత్రంపై ప్రస్తుతానికి భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ లుక్ కే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ ధర పలుకుతోంది. పెద్ది చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ.130 కోట్లతో హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్ ను ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ టీ సిరీస్ రూ.20 కోట్లకు సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతుండటం విశేషం.

ఇక ఈ చిత్రంలో నటించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నారని తెలుస్తోంది. పెద్ది సినిమాకు స్టార్ కాస్ట్ ఉండటంతో పాటు, ఆస్కార్ అవార్డీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. రత్నవేలు సినిమాటోగ్రఫీగా, నవీన్ నూలి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మార్చి 27, 2026న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: ram charan buchi babu peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X