twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Recce Web Series review.. శివ బాలాజీ, ఎస్తేర్ నొర్హోనా అదుర్స్.. సర్‌ప్రైజింగ్‌ రోల్‌లో సీనియర్ నటుడు

    |

    Rating: 3/5

    తారాగణం: శ్రీరాం, శివ బాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నోర్హోన్హా, జీవా, శరణ్య ప్రదీప్, రామరాజు, తోటపల్లి మధు, సమ్మెట గాంధీ తదితరులు

    బ్యానర్: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్
    నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి
    ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకాంత్ పోలూరు
    దర్శకత్వం: పోలూరు కృష్ణ
    కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కృష్ణ పోలూరు
    సినిమాటోగ్రఫి: రామ్ కే మహేష్
    సంగీతం: శ్రీరామ్ మద్దూరి
    యాక్షన్: రాంబాబు
    సౌండ్ డిజైనర్: సాయి
    ఎడిటర్: కుమార్ పీ అనిల్
    ఆర్ట్ డైరెక్టర్: కార్తీక్ అమ్ము, బాబు
    కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య పెద్ది
    ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ మట్ట
    ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ. లింగం, నాని

     రెక్కీ వెబ్ సిరీస్‌ కథ ఏమిటంటే?

    రెక్కీ వెబ్ సిరీస్‌ కథ ఏమిటంటే?

    తాడిపత్రి పట్టణంలో రంగ నాయకులు (రామరాజు), వరదరాజులు (ఆడుకలం నరేన్) మధ్య వర్గ పోరాటం జోరుగా ఉంటుంది. తన ప్రత్యర్థి వరదరాజులును అడ్డు తొలగించుకొనేందుకు పరదేశి (సమ్మెట గాంధీ) బ్యాచ్‌తో రంగనాయకులు స్కెచ్ వేస్తాడు. అయితే ఊహించని విధంగా రంగనాయకులు ప్రమేయం లేకుండానే వరద రాజులు ఆయన కుమారుడు చలపతి (శివ బాలాజీ) దారుణ హత్యకు గురవుతారు.

     రెక్కీ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు

    రెక్కీ వెబ్ సిరీస్‌లో ట్విస్టులు


    వరద రాజులు, చలపతి హత్యలకు అసలు కారణం ఏమిటి? వారి హత్యల వెనుక హస్తం ఎవరిది? ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్స్‌పెక్టర్ లెనిన్ (శ్రీరాం) ముందుకు ఎలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వరదరాజు హత్యకు వేసిన స్కెచ్‌లో కులయప్ప (తోటపల్లి మధు) పాత్ర ఏమిటి? వరద రాజులు, చలపతి హత్యకు ఓ కారణంగా ఈవో భార్య రేఖ (ఎస్తేరా) మారింది. ఈ కథలో ఎమ్మెల్యే గురువారెడ్డి (జీవా) పాత్ర ఏమిటి? వరదరాజులు, చలపతి హత్యల తర్వాత వారి భార్యలు తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే రెక్కీ వెబ్ సిరీస్ కథ.

    రెక్కీ వెబ్ సిరీస్ అనాలిసిస్

    రెక్కీ వెబ్ సిరీస్ అనాలిసిస్


    రెక్కీ వెబ్ సిరీస్ ఫ్యాక్షన్ నేపథ్యంగా హత్యలు, వర్గపోరు, అక్రమ సంబంధాలు, రాజకీయ ఎత్తుగడలు ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిందని చెప్పవచ్చు. దర్శకుడు పొలూరు కృష్ణ రాసుకొన్న కథ, డిజైన్ చేసిన క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించిన విధంగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో భారీ ఎలివేషన్ ఇచ్చే విధంగా పాత్రలను రాసుకొన్న తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. రెక్కీ వెబ్ సిరీస్‌కు ప్రధానంగా కృష్ణ పోలూరు అందించిన స్క్రీన్ ప్లే అత్యంత బలంగా మారడమే కాకుండా.. ప్రతీ ఎపిసోడ్‌పై ఆసక్తిని నింపేలా చేసింది.

    ఏడు ఎపిసోడ్స్‌తో ఫస్ట్ సీజన్

    ఏడు ఎపిసోడ్స్‌తో ఫస్ట్ సీజన్


    రెక్కీ వెబ్ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ ఎపిసోడ్‌లో మంచి కంటెంట్‌తో సాగడం వల్ల ఏకధాటిగా చూడటానికి వెసలుబాటు ఉంటుంది. పాత్రల తీరుతెన్నులు ప్రేక్షకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ట్విస్టులు ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ పాయింట్స్‌గా మారాయని చెప్పవచ్చు. దర్శకుడు కృష్ణ పోలూరు తెరకెక్కించిన విధంగా బాగుంది. రూరల్ పాలిటిక్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అధికారుల వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు.

     నటీనటుల పెర్ఫార్మెన్స్

    నటీనటుల పెర్ఫార్మెన్స్


    నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. రంగనాయకులుగా, వరదరాజులుగా బలమైన భారమైన పాత్రల్లో కనిపించారు. చైర్మన్ కుమారుడు చలపతిగా శివ బాలాజీ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చలపతిగా కొత్త శివ బాలాజీని చూస్తాం. ఇక శివబాలాజీ భార్య బుజ్జమ్మగా శరణ్య ప్రదీప్, ఈవో భార్య రేఖగా ఎస్తేర్ నోరోన్హా ఇంట్రెస్టింగ్ పాత్రలతో ఆకట్టుకొన్నారు. వెబ్ సిరీస్‌లో కీలకంగా మారిన పాత్రలో ఎస్తేర్ మెప్పించింది.

     శ్రీరాం, ఇతర నటీనటులు

    శ్రీరాం, ఇతర నటీనటులు

    అలాగే ఇన్స్‌పెక్టర్ లెనిన్‌గా శ్రీరాం పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయన భార్య గౌరీగా ధన్యబాలకృష్ణన్ ఆకట్టుకొన్నారు. ఈ వెబ్ సిరీస్‌లో రచయిత తోటపల్లి మధు రోల్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌గా చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ ద్వారా పరదేశీ పాత్రలో సమ్మెట గాంధీ కొత్త అవతారం ఎత్తాడు. పవర్‌ఫుల్ పాత్రతో సమ్మెట గాంధీ అద్బుతమైన పెర్ఫార్మెర్‌గా అవతరించాడని చెప్పవచ్చు. సెకండ్ సీజన్‌లో పరదేశీగా సమ్మెట గాంధీ తన నటనతో వీర విహారం చేయొచ్చనే ఫీలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది.

     టెక్నికల్ అంశాలతో..

    టెక్నికల్ అంశాలతో..


    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. రెక్కీ వెబ్ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ సినిమాటోగ్రాఫర్ రామ్ కే మహేష్. విజువల్స్ అద్బుతంగా, ప్రతీ ఫ్రేమ్ మంచి క్వాలిటీతో నింపేశాడు. ఈ వెబ్ సిరీస్‌కు మరో బలం మ్యూజిక్. శ్రీరామ్ మద్దూరి అందించిన బ్యాక్ డ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను భారీగా హైలెట్ చేసింది. ఎడిటర్ కుమార్ పీ అనిల్ పనితనం కూడా పర్‌ఫెక్ట్ అనిపించేలా ఉంటుంది.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్


    రెక్కీ వెబ్ సిరీస్‌ను మంచి యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందించడానికి నిర్మాత శ్రీరామ్ కొలిశెట్టి అనుసరించిన విలువలు బాగున్నాయి. పాత్రలకు తగినట్టుగా నటీనటులు ఎంపికతోనే ఈ వెబ్ సిరీస్ సగం విజయం సాధించిందని చెప్పవచ్చు. ప్రతీ పాత్రను నటీనటులు ప్రాణం పెట్టి పోషించారని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

     ఫైనల్‌గా చెప్పేదేమింటంటే?

    ఫైనల్‌గా చెప్పేదేమింటంటే?

    ఫ్యాక్షన్, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో గ్రిప్పింగ్‌గా, అనుక్షణం ఆసక్తిని రేపే కథనంతో రూపొందిన వెబ్ సిరీస్ రెక్కీ. నటీనటులు పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్‌కు బలంగా మారాయి. రూరల్, ఫ్యామిలీ పాలిటిక్స్‌తో మానవ సంబంధాలను జోడించి కొన్ని సీన్లు మినహాయిస్తే.. కుటుంబ సభ్యులందరూ చూసే విధంగా రూపొందించారు. జీ5 ఓటీటీలో జూన్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. మంచి ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ఏడు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ వారాంతంలో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచడం గ్యారెంటీ.

    English summary
    Sriram, Siva balaji, Ester Noronha's Recce Web Series hits the Zee5 ott on June 17th. Here is the exclusive review of Filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X