For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో దేశంలోనూ RRR రిలీజ్.. అధికారికంగా ప్రకటించిన యూనిట్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ, కొన్ని చిత్రాలు మాత్రమే ఏదో ఒక విభాగంలో ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాయి. అలాంటిది బడ్జెట్, కాస్టింగ్, విజువల్స్, లాంగ్వేజస్, బిజినెస్ ఇలా ఎన్నో విభాగాల్లో టాప్‌గా నిలిచి.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం మాత్రం RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపకల్పనలో వచ్చిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక బిజినెస్ కూడా జరిగింది.

  డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

  పేరుకు తెలుగు సినిమానే అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. దీంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు దక్కాయి. ఫలితంగా ఇది వంద కోట్లకు పైగానే లాభాలను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని అందుకుంది. థియేటర్లలో దాదాపు యాభై రోజుల పాటు సందడి చేసిన RRR.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించింది. ఇక, ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ జీ5లో, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభం అయింది. థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును చూపిస్తోంది.

  RRR Streaming Start In South Korea on Netflix

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించిందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈ సినిమా హవాను చూపిస్తోంది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. ఇండియాతో సమానంగా విదేశాల్లోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. అలాగే, జీ5లోనూ ఇది రికార్డులు క్రియేట్ చేసింది.

  RRR Streaming Start In South Korea on Netflix

  యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్

  RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మరికొన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడీ చిత్రాన్ని కొరియన్ భాషలోనూ రిలీజ్ చేసింది. అయితే, అక్కడ ఇది థియేటర్లలో సందడి చేయడం లేదు. నెట్‌ఫ్లిక్స్ సంస్థే దక్షిణ కొరియాలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టింది. ఇందులో కొరియన్ సబ్‌టైటిల్స్ వచ్చేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మరి అక్కడ ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

  స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇక, ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవేన్‌సన్, అలీసన్ డూడీ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

  English summary
  Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now This Movie Streaming Started In South Korea on Netflix.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X