Don't Miss!
- News
ఐప్యాక్ సర్వేతో రఘురామ రిజల్ట్స్ మ్యాచ్ ? పవన్-లోకేష్ ఎఫెక్ట్ కీలకం ! ముందస్తు ముహుర్తమిదే !
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
RRR మూవీ మరో నేషనల్ రికార్డు: ఏకంగా 57 దేశాల్లో ప్రభావం చూపిన ఏకైక సినిమా
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ శకం కనిపిస్తోంది. ఈ తరహా చిత్రాలు టాలీవుడ్‌లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వచ్చిన వాటిలో ఎక్కువ శాతం విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే భారీ కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది.
బ్రాతో ఇలియానా హాట్ సెల్ఫీ: ఎద అందాలు మొత్తం కనిపించేలా ఫోజు
తెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. అదే మాదిరిగానే ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను బడా సంస్థ జీ5 అత్యధిక మొత్తానికి సొంతం చేసుకుంది. అలాగే, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను మాత్రం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని నిర్మాతలకు ముట్టజెప్పినట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. అక్కడ థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఈ సినిమా మొదటి వారంలోనే ఈ సినిమా 1,83,60,000 స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసుకుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల జాబితాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా ఇది వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసుకుంది.
స్నానం చేస్తోన్న ఫొటోలతో షాకిచ్చిన హీరోయిన్: గర్భంతో ఉన్నా అస్సలు తగ్గట్లేదుగా!
RRR (రౌద్రం రణం రుధిరం) హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే నాన్ ఇంగ్లీష్ మూవీలలో టాప్ ప్లేస్‌కు చేరుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఏకంగా 57 దేశాల్లో ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఏకంగా 57 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా మూడు రోజుల పాటు ఈ సినిమా ఆయా దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా RRR (రౌద్రం రణం రుధిరం) రికార్డు క్రియేట్ చేసుకుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమాలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.