For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shaakuntalam OTT: సమంత క్రేజ్.. భారీ ధరకు శాకుంతలం డిజిటల్ రైట్స్! ఏ ఓటీటీకి అంటే?

  |

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సౌత్ ఇండియాలోనే పాపులర్ కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటి తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. ప్రుముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం విడుదలను ఎట్టకేలకు ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే సమంత శాకుంతలం సినిమా ఇంకా విడుదల కాకముందే దాని డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఈ క్రమంలో సామ్ శాకుంతలం మూవీ ఓటీటీ హక్కులను అందుకున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ వివరాల్లోకి వెళితే..

  సమంత లుక్స్ పై..

  సమంత లుక్స్ పై..

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ సమంత ఒకరు. ఫ్యామిలీ మ్యాన్ అనే హిందీ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తర్వాత ఊ అంటావా మావ అనే స్పెషల్ నెంబర్ తో మరింత క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం లేడి ఒరియెంటెడ్ చిత్రాలతో బిజీగా మారింది ఈ గ్లామరస్ బ్యూటి. ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సామ్ తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత లుక్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

  ప్రేమ కావ్యంగా..

  ప్రేమ కావ్యంగా..

  అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ప్రకటించి సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను ఫ్రిబవరి 17న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ లో శకుంతల పుట్టుక నుంచి దుశ్యంతుడితో పరిచయం, ప్రేమ, రొమాన్స్ చూపించారు. ఈ సన్నివేశాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. అలాగే శకుంతల పడే కష్టాలు, దుశ్యంతుడికి, అసురలకు ఉండే భీకరమైన యుద్ధాన్ని ట్రైలర్ లో చూపించారు. గ్రాఫీక్స్ అందంగా ఉండగా.. అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ఎంట్రీ హైలెట్ గా నిలిచింది. రీసెంట్ గా అల్లు అర్హ డబ్బింగ్ చెప్పిన పిక్ వైరల్ గా కూడా మారింది.

  ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం..

  ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం..

  ఇదిలా ఉంటే తాజాగా సమంత, దేవ్ మోహన్ స్టారర్ మూవీ శాకుంతలం విడుదలకు ముందే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అనేక సంస్థలు పోటీ పడగా ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సమంత గత చిత్రం యశోద డిజిటల్ రైట్స్ ను కూడా అమెజాన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక శాకుంతలం విడుదల కాకముందే అత్యంత భారీ ధరను వెచ్చించడం చూస్తే సమంత క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది.

  హై విజువల్ ఎఫెక్ట్స్ తో..

  హై విజువల్ ఎఫెక్ట్స్ తో..

  భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన శాకుంతలం చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, కబీన్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ శాకుంతలం చిత్రంలో చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది. ఈ మూవీతోనే అల్లు అర్హ చిత్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

  English summary
  Samantha Gunasekhar Combination Movie Shaakuntalam Release On February 17. And Shaakuntalam Digital Rights Sold To Amazon Prime Video For Huge Price.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X