Shadow ఓటీటీలో షాడో యాక్షన్ విన్యాసాలు.. వెబ్ సిరీస్‌గా మధుబాబు రచనలు.. సరికొత్త ఛాలెంజ్‌తో శరత్ మండవ

తెలుగు డిటెక్టివ్ నవలా ప్రపంచంలో షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు రచనలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 80, 90 దశకంలో మధుబాబు తన రచనలతో ఉర్రూతలూగించారు. హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా తన డిటెక్టివ్ నవలల్లో యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ జొప్పించి పాఠకులకు పుస్తకంలోనే సినిమా చూపించే సత్తా, శైలి రచయిత మధుబాబు సొంతం. ఆయన కలం నుంచి దాదాపు 150పైగా నవలలు తెలుగు ప్రేక్షకులను సమ్మోహితం చేశాయి. ఆయన రచించిన పాత్రలు చిరంజీవి లాంటి యాక్షన్ హీరోలకు ధీటుగా ఉండేవంటే ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు.

షాడో పాత్రతో అద్బుతమైన రచనా శైలితో నవలా ప్రపంచంలో మెగా రైటర్‌గా విరాజిల్లిన మధుబాబు పుస్తకాలకు వెండితెర రూపం కల్పించడానికి దర్శకుడు శరత్ మండవ పూనుకొన్నారు. మధుబాబు రాసిన 146 నవలలకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను శరత్ మండవ సొంతం చేసుకొన్నారు. మధుబాబు పుస్తకాలు ఓటీటీలో ఎపిసోడ్‌లో చిత్రీకరించే ప్లాన్ సిద్దం చేశారు. ప్రతీ ఎపిసోడ్‌కు దక్షిణాది సినిమా పరిశ్రమలోని టాప్ డైరెక్టర్లందరూ దర్శకత్వం వహిస్తారు.

Sarath Mandava to produce Madhu Babus Shadow stories as Web Series

మధుబాబు పుస్తకాలను తెర రూపం కల్పిస్తున్న నేపథ్యంలో దర్శకుడు శరత్ మండవ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. షాడో గురించి న్యూస్ రావడం కొత్తేమి కాదు. గురువు గారు.. మధుబాబు గారితో ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నాను. షాడో కథలను వెబ్ సిరీస్‌గా రూపొందించడానికి ఆయన నుంచి అనుమతి పొందడం గర్వంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌ గురించిన స్క్రిప్టు, ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాలపై కసరత్తు జరుగుతున్నది. ఈ కసరత్తుకు రూపం రాగానే.. అధికారికంగా ప్రకటన చేస్తాం. ప్రవహించే నదిలో పెద్ద మొత్తంలో నీటిని తీసుకోవడం ఎలా కష్టమో.. మధుబాబు రచనలకు తెర రూపం కల్పించడం అంతే కష్టం. కాస్త సమయం తీసుకొని మీకు కొత్త అనుభూతిని కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం అని దర్శకుడు శరత్ మండవ భావోద్వేగమైన పోస్టు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X