Mirai OTT Release Date: మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ మిరాయ్. ఇప్పటికే తేజా సజ్జా హను-మ్యాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి సంచలనం సృష్టించేందుకు యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ గా థియేటర్లలోకి విడుదల అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, జపనీస్ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.

మొదటి రోజు మిరాయ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. మిరాయ్ చిత్రంలోని విజువల్స్, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉంటున్నాయని తెలుపుతున్నారు. సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుతుండటం విశేషం. ఇక తాజాగా మిరాయ్ చిత్రం థియేటర్లలో విడుదలైన సందర్భంగా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు చూస్తున్నారు. కాగా మిరాయ్ ఓటీటీకి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Teja Sajja Mirai Movie OTT Release Date

మిరాయ్ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డిటైయిల్స్ ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కడంతో థియేట్రికల్ రన్ జోరుగానే సాగేలా కనిపిస్తోంది. అందుకే ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మిరాయ్ సినిమా ఓటీటీ రైట్స్ ను జియో హాట్ స్టార్ రూ.40 కోట్లకు దక్కించుకుందని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రముఖ జియో హాట్ స్టార్‌లో మిరాయ్ ఓటీటీ రైట్స్ ను దక్కించుకుంది. ఇక శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కు రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.50 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక తేజా సజ్జా నుంచి గతంలో వచ్చిన సూపర్ హీరో ఫిల్మ్ హనుమ్యాన్ తో రూ.350 కోట్లు తిరిగి సంపాదించారు. ఇదే సమయంలో మిరాయ్ చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక మిరాయ్ సూపర్ యోద చిత్రాన్ని టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీవీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రూ.40 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మిరాయ్ చిత్రం క్వాలిటీ, విజువల్స్, యాక్షన్, కథ పరంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియా, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. గౌర హరి సంగీతం అందించారు.

More from Filmibeat

Read more about: teja sajja mirai tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X