The Kashmir Files ఓటీటీ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల్లో ఒకటిగా ది కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. విడుదలైన రోజు నుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా రాజకీయ, ఇతర వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొన్నది. కాశ్మీర్ పండితులపై పాక్ మిలిటెంట్ల ఉగ్రవాదం, అరాచకాల సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అత్యంత వివాదస్పదంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్, ఇతర విషయాల్లోకి వెళితే..

కాశ్మీర్ లోయలో 1990 నాటి పరిస్థితులపై
కాశ్మీర్ లోయలో 1990లో కశ్మీరి పండితులపై జరిగిన అమానుష సంఘటనలతో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాపై ఓ వర్గం సానుకూలంగా స్పందిస్తే.. మరో వర్గం ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.

మార్చి 11న థియేట్రికల్ రిలీజ్
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన వివేక్ అగ్నిహోత్రి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మార్చి 11వ తేదీన ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా వసూళ్ల వర్షాన్ని కురిపించింది.

330 కోట్ల గ్రాస్ వసూళ్లతో
అత్యంత వివాదాస్పదంగా మారడంతో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు పోటెత్తారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 330 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో అతి తక్కువ బడ్జెట్‌తో భారీ లాభాలను సొంతం చేసుకొన్న తొలి చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ ఘనతను సొంతం చేసుకొన్నది. కరోనావైరస్ లాక్‌డౌన్స్ తర్వాత 250 కోట్ల గ్రాస్‌ను అందుకొన్న తొలి చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది.

ది ఢిల్లీ ఫైల్స్‌తో మరోసారి
ది కాశ్మీర్ ఫైల్స్ అందించిన ఉత్సాహంతో మరో చిత్రాన్ని అందించేందుకు నిర్మాత అభిషేక్ నామా, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో జతకట్టారు. ది ఢిల్లీ ఫైల్ష్ అనే సినిమా షూటింగును ఇటీవల ప్రారంభించారు. అయితే ఇందిరా గాంధీ హత్య సమయంలో సిక్కులపై ఊచకోత గురించిన కథ అయి ఉంటుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Zee5 OTTలో ది కాశ్మీర్ ఫైల్స్
ఇక ఇదిలా ఉండగా.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులు.. ఓటీటీలో రిలీజ్ అయితే చూద్దామా అనే ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమాను Zee5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే
త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో నిర్మాత అభిషేక్ ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











