This Week Ott Releases: ఈ వారం ఓటీటీ చిత్రాలు.. ఫహద్ ఫాజిల్ మారీసన్, కాజోల్ మా.. మరో 3 చిత్రాలు

ఓటీటీ సంస్థల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలతో పోటీగా ఓటీటీలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే చిత్రాలు ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఏఏ సినిమాల్లో ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, తదితర ఓటీటీ సంస్థల్లో విడుదలైన సినిమాల వివరాల్లోకి వెళితే..

ఫహద్ ఫాజిల్ మారీసన్..
పుష్ప విలన్, మాలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన తమిళ ఫిల్మ్ మారీసన్. ఈ డ్రామా థ్రిల్లర్ ఫిల్మ్ కు సుధీష్ శంకర్ దర్శకత్వం వహించారు. వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్ గా అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఆగస్టు 22 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండటం విశేషం.

This Week OTT Release

కాజోల్ మా చిత్రం..
బాలీవుడ్ మైథలాజికల్ హారర్ర్ ఫిల్మ్ మా చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ భాషలో విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ రన్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ మంచిగానే అందాయి. ఈ చిత్రానికి అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మాంగత్ పతక్ నిర్మాతలుగా వ్యవహరించారు. జియో స్టూడియోస్, దేవ్ గన్ ఫిల్మ్స్ బ్యానర్లలో రూపుదిద్దుకుంది. కాజోల్, రోణిత్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

మాలిక్..
బాలీవుడ్ లో రూపుదిద్దుకున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ మాలిక్. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు, మానుషి చిల్లర్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించారు. పుల్కిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాతలు జై శవకర్మణి, కుమార్ ఎస్. తౌరాని రూపొందించారు. ఇక ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

పీస్ మేకర్ సీజన్ 2..
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ గున్ దర్శకత్వం వహించిన పీస్ మేకర్ సీజన్ 2 ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. హెచ్‌బీఓ మ్యాక్స్ లో ఆగస్టు 21 నుంచి, జియో హాట్ స్టార్ లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. సీజన్ 1 ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 2022 ఫిబ్రవరి 17 నుంచి అందుబాటులో ఉంది. ఇందులో ఇంకా 6 సీజన్లు విడుదల కానున్నాయి.

ది ఆల్టో నైట్స్..
హాలీవుడ్ డైరెక్టర్ బారీ లెవిసన్ దర్శకత్వం వహించిన ది ఆల్టో నైట్స్ చిత్రం ఇంగ్లీష్ లో మార్చి 21న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ఇక ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

More from Filmibeat

Read more about: Maareesan ott movies kajol devgn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X