Don't Miss!
- Technology
రూ.18 వేలలో, 108 మెగాపిక్సెల్ కెమెరా Smartphone.. లాంచ్ ఎప్పుడంటే!
- News
గ్రామ పంచాయతీలకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. డీటెయిల్స్ ఇవే!!
- Sports
కౌంటీ క్రికెట్ ఆడనున్న సిరాజ్.. రెడ్ బాల్ క్రికెట్‌పై మియా భాయ్ స్పెషల్ ఫోకస్!
- Automobiles
కొత్తగా వచ్చిన 'ఓలా ఎస్1'కి, ఇప్పటికే అమ్ముడవుతున్న 'ఓలా ఎస్1 ప్రో'కి మధ్య తేడా ఏమిటి?
- Finance
ఆరు నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర: ఆ కంపెనీలకు మాత్రమే కేంద్రం ఊరట
- Lifestyle
Today Rasi Phalalu: ఈ రోజు ఈ రాశుల వారు అదనపు ఖర్చులు తగ్గించుకోండి..
- Travel
ఒకప్పటి రాజ నివాసాలు.. ఇప్పుడు విలాసవంతమైన విడిది కేంద్రాలు
Bimbisara ఓటీటీ రిలీజ్ అప్పుడే.. అంతకంటే ముందే సీతారామం?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార, దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన మొదటి స్ట్రైట్ తెలుగు మూవీ సీతారామం ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదలయ్యాయి. విడుదలకు ముందే ఈ రెండు సినిమాలకు కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలు ఓటీటీ లో ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయంలో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఏ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫారంలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

ఫాంటసీ ఫిల్మ్
కళ్యాణ్ రామ్ నటించిన బిబిసారా సినిమాపై మొదటినుంచి కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కొత్త దర్శకుడు అయినప్పటికీ వశిష్ట ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకొచ్చినట్లు జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా అడ్వెంచర్ ఫాంటసీ టైం ట్రావెల్ సినిమాగా తెరకెక్కింది. తప్పకుండా సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అనేలా ప్రమోషన్స్ అయితే భారీగానే చేశారు.

బింబిసార ఓటీటీ రిలీజ్
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ సినిమాను అత్యధిక బడ్జెట్ నిర్మించారు. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పాజిటివ్ గానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ గా జి5 డీసెంట్ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లో వివిధ భాషల్లో విడుదల కాకపోయినా ఓటీటీ లో మాత్రం ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ లో ఎప్పుడంటే?
బింబిసార సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ పై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇంతవరకు చిత్ర యూనియ్ సభ్యులు ఓటీటీ విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వీలైనంత ఎక్కువ రోజులు థియేటర్లోనే సినిమాను కొనసాగించాలని అనుకుంటున్నారు. ఇక మొత్తంగా 8 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు వచ్చే నెల చివరి వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ కావచ్చు అని సమాచారం.

అమెజాన్ ప్రైమ్ లో సీతారామం
వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం సినిమా కూడా మంచి అంచనాలతోనే థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ వర్కౌట్ కావడంతో ఓ వర్గం ఆడియన్స్ థియేటర్లో సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. పోటీపడి మరి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ లో అప్పుడే..
సీతారామం సినిమా ఓటీటీ థియేట్రికల్ రిలీజ్ ను బట్టి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బింబిసార సినిమా ఎనిమిది వారాల తర్వాత వస్తుండగా ఈ సినిమా అంతకంటే ముందే ఓటీటీ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెల మధ్యలోనే ఈ సినిమా ఓటీటీ లో రావచ్చు అని సమాచారం.