twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2022 అమెజాన్ ప్రైమ్ లో ఎక్కువగా క్రేజ్ అందుకున్న సినిమాలివే.. టాప్ లో పుష్ప రాజ్!

    |

    2022 టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడింది అనే చెప్పాలి. గత రెండేళ్ళ కాలం పాటు కరోనా కారణంగా ఓటీటీ కంటెంట్ కు కూడా చాలా క్రేజ్ వచ్చింది. అయితే మళ్ళీ థియేటర్స్ ఊపందుకున్న తర్వాత కూడా ఓటీటీ సంస్థలకు పెద్దగా నష్టాలు ఏమీ రాలేదు. ఒక విధంగా కరోనా కారణంగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు కూడా జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇక 2022లో అయితే కొన్ని సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది.

    ఇక ఈ ఏడాది ఇండియాలో ఎక్కువగా వీక్షించబడిన అమెజాన్ ప్రైమ్ సినిమాల వివరాల్లోకి వెళితే.. ముందుగా అందులో పుష్ప సినిమా మొదటి స్థానంలో ఉంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లోనే కాకుండా సంచలనాత్మకమైన రెస్పాన్స్ అయితే అందుకుంది. ఇక దాని తర్వాత KGF 2 ఉండడం విశేషం. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఈ సినిమా ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో కూడా వ్యూవ్స్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక మూడవ స్థానంలో కేజిఎఫ్ మొదటి చాప్టర్ నిలవడం విశేషం.

    Top 10 Most Viewed Indian Films On Amazon Prime In India

    కేజీఎఫ్ 2 కారణంగా ఈ ఏడాది కేజీఎఫ్ 1 కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లో ఆ సినిమాను కూడా జనాలు ఎగబడి చూశారు. ఇక ఊహించిన విధంగా సీతారామం సినిమాకు కూడా అమెజాన్ ప్రైమ్ లో మంచి గుర్తింపు రావడం విశేషం. థియేటర్లో నడుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. అయినా కూడా సినిమా ఓటీటీలో మంచి వ్యూవ్స్ ను సొంతం చేసుకుని ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన సినిమాలలో తమిళ పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తరువాత బచ్చన్ పాండే 6వ స్థానంలో జుగ్ జుగ్ జియో ఏడవ స్థానంలో నిలిచాయి. మరో ఇంట్రెస్టింగ్ త్రిల్లర్ మూవీ రన్ వే 34 అయితే ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక జురాసిక్ వరల్డ్ డొమినియం 9 స్థానంలో, గెహ్రాయన్ 10వ స్థానంలో నిలిచింది.

    English summary
    Top 10 Most Viewed Indian Films On Amazon Prime In India
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X