Don't Miss!
- News
పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Unstoppable 2 బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ!.. బాబాయ్ గురించి రాంచరణ్ ఇచ్చిన లీక్స్ ఇవే!
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable 2 Show ఇండియాలోనే టాప్ టాక్ షోగా మారింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో అత్యధిక టాప్ రేటింగ్ సాధించిన టాక్ షోగా సంచలనం రేపుతున్నది. ఈ షోలో బాలకృష్ణ తీసుకొచ్చే అతిథులు, వారితో మాటా మంతి, తదితర విషయాలు ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. ప్రతీ ఎపిసోడ్‌కు రేంజ్ పెంచుకొంటున్న ఈ షోలో తాజాగా జనసేన అధినతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథిగా పాల్గొన్నారు. ఈ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

కూల్‌గా పవర్ స్టార్ సమాధానాలు
తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోలు ఒకే వేదికపైన కనిపించడంతో అన్‌స్టాపబుల్ షోకు హాజరైన ప్రేక్షకులు చాలా థ్రిల్ అయ్యారనేది సమాచారం. బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సానుకూలంగా సమాధానం చెప్పడం అందర్నీ ఆకట్టుకొన్నట్టు తెలిసింది. ఈ షోలో చాలా వివాదాస్పద అంశాలపై పవన్ కల్యాణ్‌ను బాలకృష్ణ ప్రశ్నించారు. అయితే అంతే కూల్‌గా పవర్ స్టార్ సమాధానం చెప్పినట్టు తెలిసింది.

మామ, అల్లుళ్ల మధ్య సరదాగా
అన్‌స్టాపబుల్ 2 షోలో పవన్ కల్యాణ్‌తోపాటు సాయిధరమ్ తేజ్ పాల్గొన్నాడు. సాయిధరమ్ తేజ్ మధ్యలో షోలోకి వచ్చి కార్యక్రమాన్ని సరదాగా మార్చేశాడట. అయితే యాక్సిండెట్ గురించిన విషయాలను బాలకృష్ణ అడిగితే.. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని సాయిధరమ్ తేజ్ వివరించినట్టు సమాచారం. మామ, అల్లుళ్ల మధ్య సరదాగా సంభాషణ జరిగింది.

ఫోన్ ద్వారా త్రివిక్రమ్‌తో బాలకృష్ణ
అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చారు. అయితే అందరూ షోలో పాల్గొంటారని ఊహించారు. కానీ నేరుగా షోలో పాల్గొనలేదు. అయితే ఫోన్ ద్వారా త్రివిక్రమ్‌ను బాలకృష్ణ కనెక్ట్ అయ్యారు. అయితే పవన్ కల్యాణ్‌తో అనుబంధాన్ని తివిక్రమ్ పంచుకొన్నారు. త్రివిక్రమ్‌తో బాలకృష్ణ సంభాషణ చాలా సరదాగా సాగింది. కొద్ది నిమిషాలపాటు వారిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది.

బాబాయ్ గురించి రాంచరణ్ లీక్స్
అన్‌స్టాపబుల్ 2 షోలో రాంచరణ్‌కు బాలకృష్ణ ఫోన్ చేసి ఆటపట్టించే ప్రయత్నం చేశారు. ప్రభాస్ గురించి లీక్ ఇచ్చావు కదా.. ఇప్పుడు మీ బాబాయ్ గురించి ఏమైనా లీక్ ఇస్తావా? చిరంజీవికి తెలియకుండా మీరిద్దరు చేసిన చిలిపి పని ఏదైనా షేర్ చేసుకొంటారా అని బాలయ్య అడిగితే.. సింగపూర్ పర్యటనలో జరిగిన విషయాలు.. అలాగే చిన్నతనంలో జరిగిన సంఘటనలు, ఇతర విషయాలను రాంచరణ్ షేర్ చేసుకొన్నాడనే తాజా సమాచారం.

మూడు పెళ్లిళ్ల గురించి
ఇక పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి బాలకృష్ణ అడిగితే.. పవన్ కల్యాణ్ తన వెర్షన్‌ను ఎమోషనల్‌గా చెప్పారట. కొన్ని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకొన్నాను. అలాంటి సమస్యకు తుది పరిష్కారం అది తప్ప వేరే కనిపించలేదు అని బాలకృష్ణకు సమాధానం ఇచ్చారని తెలిసింది.

బాలకృష్ణ షోలో మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ షోలో పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో ఊహించని అతిథి ప్రత్యక్షం కావడంతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారని సమాచారం. అయితే ఈ షోలో ఎలాంటి పార్టిసిపేషన్ మోక్షజ్ఞ చేయలేదు. కానీ పవన్, బాలకృష్ణతో కలిసి ఫోటో దిగడం కోసం వచ్చారు. షో ముగిసిన తర్వాత మోక్షజ్ఞ వెళ్లిపోయారు అని సమాచారం.