For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Unstoppable with NBK 2:నా సంసారంలో నిప్పులు పోస్తారా.. చంద్రబాబు, లోకేష్‌కు బాలయ్య ఝలక్!

  |

  నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్టుగా మారి మొదలుపెట్టిన టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 సందడి మొదలైంది. అక్టోబర్ 14న సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గెస్ట్ లుగా పాల్గొన్న ఈ టాక్ షోలో కొన్ని కాంట్రవర్సీ ఈ విషయాలపై కూడా బాలయ్య బాబు ప్రశ్నలు అడిగారు. ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  రొమాంటిక్ పని ఏమిటి

  రొమాంటిక్ పని ఏమిటి

  మొదట బాలయ్య ఇంటర్వ్యూ ఇవ్వగానే తన మాటలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రజల బంధువుని పిలుస్తున్నాను అంటూ చంద్రబాబునాయుడు ఇన్వైట్ చేశారు. మీకు బాబు గారు నాకు బావగారు అంటూ వెల్కం చెప్పిన బాలయ్య ఇండియాలోనే టాప్ పొలిటిషన్ అంటూ చంద్రబాబును ఘనంగా ఆహ్వానించారు. అయితే మీ లైఫ్ లో చేసిన రొమాంటిక్ పని ఏమిటి అని బాలయ్య అడగడంతో మీ కంటే ఎక్కువనే చేశాను అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా మీరు సినిమాల్లో చేశారు మేము స్టూడెంట్ గా ఉన్నప్పుడే చేశామని కూడా అన్నారు. దీంతో బాలయ్య బాబు పగలబడిన నవ్వేశారు.

  1000 కోట్ల టర్నోవర్

  1000 కోట్ల టర్నోవర్

  అలాగే రాళ్లు రప్పలు ఉన్నదాన్ని ఇప్పుడు మహానగరం గా మార్చిన ఘనత మీదే అని ఇప్పుడు అది 1000 కోట్ల టర్నోవర్ గా మారిన సైబరాబాద్ అని బాలయ్య బాబు చెప్పారు. అంతేకాకుండా అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి గ్రాఫిక్స్ అనలేదు అని సెటైర్ కూడా వేశారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అనగానే రాజశేఖర్ నేను బాగా తిరిగాము అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

  ఎన్టీఆర్ తో విభేదాలు

  ఎన్టీఆర్ తో విభేదాలు

  అలాగే 1995లో తీసుకున్న ఒక డిసిషన్ గురించి కూడా చంద్రబాబు తెలియజేయడం విశేషం. ఒక వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను అంటే చంద్రబాబు ఎన్టీఆర్ తో గొడవ గురించి బాలయ్య బాబుని ప్రశ్నించారని తెలుస్తోంది. ఆరోజు తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది అని కూడా బాలయ్య అన్నాడు. కాళ్లు పట్టుకొని ఆడుకున్నాను అని కూడా మళ్లీ చంద్రబాబు ఏదో చెప్పారు.

  లోకేష్ ఎంట్రీ

  లోకేష్ ఎంట్రీ

  మా చెల్లిని సరదాగా ఏమని పిలుస్తారు అని బాలయ్య అడగదంతో అందుకు చంద్రబాబుకు కూడా భూవు అని పిలుస్తాను అని అన్నారు. అలాగే మా చెల్లికి ఐ లవ్ యు చెప్పాలి అని అన్నారు. ఇక మీ బాలకృష్ణ చేతిలో ఇరుక్కుపోయాను అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అదే సమయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక మీ నాన్నగారు ఈ గెటప్ లో తప్పితే మరేదైనా గెటప్ లో కనిపించారా అని బాలకృష్ణ అడగడంతో యూరప్ కు వెళ్ళిన ఇదే వేసుకుంటారు మాల్దీవ్స్ కు తీసుకువెళ్లిన ఇదే వేసుకుంటారు అని లోకేష్ వివరణ ఇచ్చారు.

   నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు

  నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు

  ఇక బాలకృష్ణ నారా లోకేష్ ను మంగళగిరి ఓటమి గురించి కూడా అడిగారు. ఇక ఆ విషయంపై లోకేష్ కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నేను హోస్ట్ అవుతాను మీరు ఇక్కడ కూర్చోండి అంటూ నారా లోకేష్ బాలయ్య బాబు సీటును తీసుకున్నారు. ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు అని అడగడంతో అందుకు బాలయ్య బాబు నేను సలహాలు మాత్రమే ఇస్తాను అని అన్నారు. ఇక బాలయ్య బాబు చంద్రబాబుని అడగడంతో అసలు నేను వండుకోను అని అన్నారు. ఇక ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువగా ఉంటారు అన్నప్పుడు బాలకృష్ణ పబ్లిక్ లో ఒప్పుకోవడానికి నా ఈగో ఒప్పుకోవడం లేదు అల్లుడు అని అన్నారు. ఇక తండ్రి కొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు కదా అని బాలయ్య బాబు సరదాగా కామెంట్ చేశారు.

  అమ్మాయిలతో నారా లోకేష్ ఫొటో

  అమ్మాయిలతో నారా లోకేష్ ఫొటో

  అలాగే నారా లోకేష్ కు సంబంధించిన చిన్నప్పటి విషయాల గురించి కూడా బాలయ్య మాట్లాడాడు. ఏది పట్టుకుంటే అది నాది అనేవాడు మూట కట్టి బయటపడేస్తాను అని అనేవాడిని. ఇక ఆ తర్వాత నారా బ్రాహ్మణిని తన దాన్ని చేసేసుకున్నాడు అని బాలయ్య అన్నాడు. ఇక నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిల తో కలిసి ఉన్న ఫోటో చూపించిన బాలయ్య అసెంబ్లీ దాక వెళ్ళింది ఆ ఫోటో అని అన్నారు. ఇక బాలయ్య బాబు చంద్రబాబు నాయుడిని కూడా ఆ ఫోటో గురించి స్పందన ఏమిటి అడిగినప్పుడు.. మామకు లేని సందేహం నాకు ఎందుకు అని అన్నారు. అలాగే ఎన్టీఆర్ గురించి చెబుతూ ఆయనను చంద్రబాబు చెప్పారు. మరి పూర్తి ఎపిసోడ్ లో ఎలాంటి విషయాలు చెబుతారో చూడాలి.

  English summary
  Unstoppable with NBK 2 chandrababu naidu and nara lokesh latest promo viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X