Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
బాలకృష్ణ, చిరంజీవితో పాన్ వరల్డ్ మూవీ.. అన్‌స్టాపబుల్‌లో అల్లు అరవింద్
నందమూరి బాలకృష్ణ - మెగాస్టార్ చిరంజీవి మధ్యలో బయటకు తెలియని వైరుధ్యాలు కొనసాగుతున్నట్లు చాలాసార్లు ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్యలో ఇప్పటికి సోషల్ మీడియాలో వార్ కొనసాగుతూ ఉంటుంది. అయితే వారి మధ్యలో సాన్నిహిత్యం ఉందని ఇటీవల అన్ స్టాపబుల్ షో ద్వారా క్లారిటీ వచ్చింది. ఇక అల్లు అరవింద్ ఏకంగా ఆ హీరోల కాంబినేషన్లో ఒక సినిమానే ఆలోచిస్తున్నట్లు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

5వ ఎపిసోడ్ గెస్టులు
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక 5వ ఎపిసోడ్ లో ఈసారి టాప్ టాలీవుడ్ లెజెండ్స్ కనిపించబోతున్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, అలాగే సురేష్ బాబు స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వగా అనంతరం సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు కూడా వచ్చారు. ఇక ఆ ప్రోమో విడుదలవగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

భలే దొంగ, మంచి దొంగ
ఇక సురేష్ బాబు, అల్లు అరవింద్ ను చూస్తూ.. టాలీవుడ్ టాప్ లెజెండ్ నిర్మాతలు అని వెల్కమ్ చెప్పారు. మిమ్మల్ని చూస్తే భలే దొంగ, మంచి దొంగ అని దొంగ అనే సినిమాలన్నీ గుర్తుకు వస్తున్నాయని చెప్పడంతో కథానాయకుడు లాంటి మంచి సినిమాలు చెప్పండి బాబు అని సురేష్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

మెగా బాలయ్య కాంబినేషన్
ఇక తరువాత బాలయ్య సురేష్ బాబుతో అనుభవం బాగానే ఉంది అని.. మీతోనే కాంబినేషన్ బ్యాలెన్స్ ఉందని అల్లు అరవింద్ కు చెప్పారు. దీంతో అల్లు అరవింద్ ఊహించని విధంగా స్పందిస్తూ.. మీతో అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ కలిపి సినిమా చేద్దామని అనుకుంటున్నట్లు సమాధానంగా ఇవ్వడంతో బాలయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అప్పుడు అది పాన్ వరల్డ్ సినిమా
ఇక
మెగా
నందమూరి
మల్టీస్టారర్
కాంబినేషన్
పై
బాలయ్య
స్పందిస్తూ..
అప్పుడు
అది
పాన్
వరల్డ్
సినిమా
అవుతుందని
అన్నారు.
దీంతో
అల్లు
అరవింద్
సురేష్
బాబు
హ్యాపీగా
నవ్వుకున్నారు.
ఇక
మరోవైపు
అల్లు
అరవింద్,
సురేష్
బాబు
మధ్యలో
ఒక
మందు
సిట్టింగ్
బ్యాలెన్స్
ఉందని
సరదాగా
కామెంట్
చేసుకున్నారు.

చెప్పుకోలేనేవి కొన్ని ఉన్నాయని
ఇక మీరు బన్నీతో మీరు వెంకీతో ఎలా వేగుతున్నారు అని బాలయ్య ఆ ఇద్దరి నిర్మాతలను అడగడంతో అందుకు అల్లు అరవింద్ సమాధానం ఇస్తూ చెప్పుకోలేనేవి కొన్ని ఉన్నాయని కూడా అన్నారు. ఇక ఏ హీరోతో పెద్దగా కథ అవసరం లేకపోయినా సినిమా చేయవచ్చని అనుకునే హీరో ఎవరని అడుగుతూ తన పేరు మాత్రం రాయకండి నాకు సిగ్గేస్తుంది అని బాలయ్య సమాధానం ఇచ్చారు.
ఆత్మ సంతృప్తిని ఇస్తాము
ఇక
మీరు
ఇద్దరు
తెలుగులో
టాప్
ప్రొడ్యూసర్స్
కాబట్టి
ప్రపంచ
సినిమాలతో
పోలిస్తే
మన
తెలుగు
సినిమాల
ప్రత్యేకత
ఏమిటి
అనే
ప్రశ్నను
బాలయ్య
అడిగారు.
సురేష్
బాబు
మాట్లాడుతూ..
తెలుగు
సినిమా
అనేది
తాలి
మీల్స్
లాంటిది
అని
సమాధానం
ఇచ్చారు.
ఇక
అల్లు
అరవింద్
మాట్లాడుతూ..
100
రూపాయలు
ఇచ్చి
టిక్కెట్
కొనుక్కొని
సినిమా
చూసేవాడికి
మనం
చాలా
ఆత్మ
సంతృప్తిని
ఇస్తాము
అని
అన్నారు.