Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడిగా..!
- News
రాజీనామాకు సిద్ధమైన మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారీ: మోడీకి వినతి
- Finance
కన్నీళ్లవుతున్న టెక్కీల ఆశల మేడలు..! అంత కష్టపడ్డా చివరికి స్వదేశానికి ప్రయాణం..
- Lifestyle
ఈ గుణాలున్న పురుషులు మంచి భాగస్వామి కాలేరు, అవేంటంటే..
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Unstoppable 2: పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మరింత ఆలస్యం.. స్ట్రీమింగ్ అయ్యే ముందు మరో ఎపిసోడ్!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఆహా రేంజ్ పెరిగే విధంగా మరికొన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే కంటే ముందే ఆహా మరొక సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే వివరాల్లోకి వెళితే..

టైమ్ చూసి ప్లాన్ చేస్తున్న ఆహా
నందమూరి బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో సెకండ్ సీజన్ కు మంచి డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ షోకు రావడం కోసం చాలామంది సెలబ్రిటీలు కూడా రెడీగా ఉన్నారు. అయితే టైమ్ చూసి ఆహా సెలబ్రిటీలను ఉపయోగించుకుంటుంది. ఇటీవల వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ తోనే ఈ సీజన్ లో అత్యధిక మంది ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఎలా మాట్లాడుకుంటారో..
ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం కూడా చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అసలే ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన అంశాలు గురించి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎలా మాట్లాడుకుంటారు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో కూడా విడుదల చేయగా భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా అందుకుంది.

పవన్ సినిమాపై అప్డేట్
ఇక ఆహా అన్ స్టాపబుల్ చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రానుంది. ఈ ఎపిసోడ్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొనబోతున్నాడు. అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి నటించబోయే వినోదాయ సీతమ్ రీమేక్ పై కూడా ఇదే షోలో క్లారిటీ ఇవ్వబోతున్నారు.
|
మధ్యలో ప్లాన్ చేంజ్
అయితే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను అసలు సంక్రాంతికి స్ట్రీమింగ్ అయ్యేలా చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మధ్యలో వీరసింహారెడ్డి యూనిట్ తో ఒక ఎపిసోడ్ చేశారు. ఇక జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా అయినా సరే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రణాళిక కూడా మారిపోయింది.

పవన్ ఎపిసోడ్ ఎప్పుడంటే..
పవన్ ఎపిసోడ్ చివరిది అయినప్పటికి కూడా ప్రతి సీజన్ కు కూడా పది ఎపిసోడ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 9వ ఎపిసోడ్ కోసం మరొక గెస్ట్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక ఆ తొమ్మిదవ ఎపిసోడ్ తర్వాతనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను చివరగా స్ట్రీమింగ్ అయ్యేలా చేయాలి అని ప్రణాళికను రచించారు. ఇక ఫిబ్రవరి రెండో వారంలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రావచ్చని తెలుస్తోంది.