Don't Miss!
- News
‘అదానీ’ ముప్పు అంటూ మోడీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్
- Lifestyle
క్యాన్సర్ చికిత్స తర్వాత శృంగార కోరికలు తగ్గుతాయా? సరిగ్గా సెక్స్ చేయలేరా?
- Sports
INDvsAUS : మాజీ ఆసీస్ ప్లేయర్‌కు దిమ్మతిరిగే సమాధానం.. నోటమాట రాలేదుగా!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: మీ నాన్న సినిమా కంటే ముందు నా సినిమా అంటూ చరణ్ తో బాలయ్య.. ప్రభాస్ షాక్!
నందమూరి బాలకృష్ణ అన్ స్టాప బుల్ షోలో ప్రభాస్ గోపీచంద్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆహా నుంచి అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన వరుస ప్రోమోలు కూడా విడుదలవుతున్నాయి. ఇక పార్ట్ వన్ ప్రీమియర్స్ డిసెంబర్ 30న ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా మరొక ప్రోమో కూడా విడుదల చేశారు. అందులో బాలకృష్ణ ప్రభాస్ సంభాషణలు చూస్తే ఎవరైనా సరే అలానే చూస్తూ ఉండిపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..

డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా
మొదట బాలకృష్ణ నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయని అనే డైలాగు వదిలారు. అంతే కాకుండా నేను కూడా నీ మాయలో పడిపోయాను అంటూ ప్రభాస్ కు చెప్పడంతో ప్రభాస్ ఆనందంగా నవ్వేశారు. బాలయ్య బాబు ప్రభాస్ మధ్యలో సరదాగా మూమెంట్స్ అయితే చాలా హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది.

పెళ్లి ఉందా లేదా?
అలాగే ప్రభాస్ పెళ్లి గురించి కూడా బాలయ్య బాబు ఆరా తీసే ప్రయత్నం చేసినట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. పెళ్లి కామెంట్ కూడా వైరల్ గా మారింది. అసలు ఇంతకు పెళ్లి ఉందా లేదా ఏంటి అసలు? అని బాలయ్య స్ట్రైట్ గా అడిగేసారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పటిలానే విభిన్నంగా సమాధానం చెప్పాడు. రాసిపెట్టి లేదేమో అని అన్నాడు. దీంతో బాలయ్య బాబు కౌంటర్ గా.. మీ అమ్మకు చెప్పిన మాటలు నాకు చెప్పకయ్యా అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు.

గర్ల్ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు
ఇక బాలయ్య బాబు మరో ప్రశ్న అడుగుతూ.. నిన్ను ఎక్కువగా నీ ఫ్రెండ్స్ ఏమని పిలుస్తారు అని అడిగినప్పుడు.. డార్లింగ్ అని పిలుస్తారు అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఏమని అంటారు అని అడగ్గానే.. ప్రభాస్ తెలివిగా ఈ మధ్య టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్.. మర్చిపోతున్నాను అంటూ చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.

హీరోయిన్ విషయంలో గొడవ
ఇక చత్రపతి సినిమా ఇంటర్వ్యూలో షాట్ చేస్తున్నప్పుడు చుట్టూ చాలామంది జనం ఉన్నప్పుడు చూపించిన హావభావాలను ప్రభాస్ చాలా ఫన్నీగా చూపించాడు. దీంతో బాలయ్య బాబు కూడా చాలా నవ్వుకున్నాడు. ఇక గోపీచంద్ రాగానే 2018 లో ఏదో హీరోయిన్ విషయంలో మీరు ఇద్దరు గొడవపడ్డారు అని బాలయ్య అడగ్గానే.. 2008 కాదు సార్ అంటూ గోపీచంద్ ఆలోచిస్తూ చెప్పాడు. దీంతో ఒరేయ్ అంటూ పక్కనే ఉన్న ప్రభాస్ అమాయకంగా అసహనం వ్యక్తం చేశాడు. రేయ్ మంచి న్యూస్ అన్నావ్ అంటే ఏమీ అని అర్థం అని మరొక విధంగా కూడా ప్రభాస్ కామెంట్ చేశాడు.
|
చరణ్ తో ఫోన్ కాల్
ఇక రామ్ చరణ్ తో బాలకృష్ణ ఫోన్ చేసి మాట్లాడాడు. ఇక సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలలో మొదట నా సినిమా చూడు ఆ తర్వాత మీ నాన్న గారి సినిమా చూడు అంటూ బాలకృష్ణ నవ్వుతూ చెప్పడంతో రామ్ చరణ్ కూడా ఫోన్లోనే నవ్వేశాడు. అలాగే ప్రభాస్ కూడా చప్పట్లు కొడుతూ మరి నవ్వుకున్నాడు. ఇక ఈ డైలాగ్ మరింత హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. బాలయ్య బాబు ఎవరిని వదలకుండా గట్టిగానే ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన 2వ పార్ట్ మాత్రం జనవరి 7వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.