Don't Miss!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- News
Breaking : మధ్యప్రదేశ్ లో కూలిన రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్-ట్రైనింగ్ లో అపశృతి..
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Finance
Wheat Price: సామాన్యులకు శుభవార్త.. తగ్గనున్న గోధుమ పిండి ధర..
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Unstoppble with NBK మూడవ సీజన్ కోసం కూడా ప్లాన్ రెడీ.. ముగ్గురు స్టార్ హీరోలు, ఒక పొలిటీషియన్!
అన్ స్టాపబుల్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మాత్రమే కాకుండా చాలామంది హీరోలు కూడా ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండవ సీజన్ తుదిదశకు చేరుకుంటున్న సమయంలో రాబోయే రోజుల్లో కొత్త తరహా గెస్ట్ లను షోలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మూడో సీజన్ కు సంబంధించిన ప్రణాళిక కూడా ముందే రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

ఊహించని రెస్పాన్స్
అసలు మొదట అన్ స్టాపబుల్ ఈ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. నందమూరి బాలకృష్ణపై ఈ షో ముందు వరకు కూడా ఒక అభిప్రాయంతో ఉన్న జనాలు షో తర్వాత మాత్రం మరొక అభిప్రాయానికి వచ్చారు అనే చెప్పాలి.
అంతే కాకుండా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. అన్ స్టాపబుల్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రెండవ సీజన్ ను కూడా చాలా త్వరగానే మొదలుపెట్టారు.

ప్రభాస్ ఎపిసోడ్ మరో లెవెల్
ఇక అన్ స్టాపబుల్ షో క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ తో అర్ధమైంది. రెండు భాగాలుగా ఆ ఎపిసోడ్ ను విభజించగా మొదటి ఎపిసోడ్ ను ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేశారు. అయితే జనాలు చూడడానికి ఎగబడడంతో ఆ యాప్ కూడా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. అంతలా ఈ షో కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇక ప్రభాస్ రెండో భాగం ఎపిసోడ్ జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్న విషయాన్ని తెలిసిందే.

పవన్ ఎపిసోడ్ తో ముగింపు
ఇక ఈ సీజన్ ను మరో రెండు ఎపిసోడ్స్ తో పూర్తి చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. ఇక జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి చిత్ర యూనిట్ తో బాలయ్య బాబు సందడి చేసిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో రెండవ సీజన్ ను ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మూడవ సీజన్ కోసం ప్లాన్
ఇక రెండు సీజన్స్ కు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటూ ఉండటంతో అన్ స్టాపబుల్ షో 3వ సీజన్ ను కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇక కొత్త గ్యాప్ ఇచ్చి మూడవ సీజన్ ను మతింత కొత్తగా ఇదే ఏడాది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఇటీవల మూడో సీజన్ కోసం ఆహా టీమ్ ఒక ప్రణాళిక కూడా అనుకున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.

రామ్ చరణ్ - కేటీఆర్
ఇక మూడో సీజన్లో అయితే ఊహించని స్టార్స్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందే ప్రభాస్ ఎపిసోడ్లో రామ్ చరణ్ ను బాలయ్య బాబు ఎప్పుడు వస్తున్నావు అని అడిగిన విషయం తెలిసిందే. మీరు ఎప్పుడు అంటే అప్పుడు అని చరణ్ కూడా సమాధానం ఇచ్చాడు. అయితే చరణ్ ఒక్కడే రాడు కాబట్టి అతనితో పాటు రాజకీయ నేత కేటీఆర్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరికి కూడా మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే.

నందమూరి హీరోల సందడి
ఇక మూడవ సీజన్లో కూడా నందమూరి హీరోలు సందడి చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ షోలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక రెండో సీజన్లో చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ తో మొదలు పెట్టిన బాలకృష్ణ మూడవ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా వారు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే చూడాలి అని నందమూరి ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి మూడో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.