Liger OTT Release: ఓటీటీలోకి లైగర్​ ! ఎప్పుడు? ఎక్కడంటే?

టాలీవుడ్ డేరింగ్​ అండ్​ డ్యాషింగ్​ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్​లో రౌడీ స్టార్​ విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. టాలీవుడ్​లో మాస్​ డైరెక్టర్​గా పూరి, క్రేజీ హీరోగా విజయ్ దేవరకొండ పేరు సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి కాంబోలో ఓ మూవీ వస్తుందనగానే ఆడియెన్స్​ అంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ మూవీ లైగర్​ అని డిక్లేర్​ చేయడం, అందులో లెజండరీ బాక్సర్​ మైక్​ టైసన్​ నటించడం, సినిమా పోస్టర్లు, టీజర్​, సాంగ్స్, ట్రైలర్​తో చిత్రానికి భారీ హైప్​ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన లైగర్​ త్వరలో ఆ ఓటీటీలో స్ట్రీమింగ్​ కానుంది.

ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా లైగర్​ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.

 అంచనాలకు భిన్నంగా..

అంచనాలకు భిన్నంగా..

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్​ ఇండియా లెవెల్​లో ఆగస్టు 25న అంటే గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లైగర్​పై ఉన్న అంచనాలకు భిన్నంగా పబ్లిక్​ టాక్​ను తెచ్చుకుంటోంది.

నో రెస్పాన్స్​..

నో రెస్పాన్స్​..

ఓ రెగ్యూలర్ సినిమాకు స్లో స్క్రీన్​ప్లే, ఊహించే సన్నివేశాలు అంటూ సినిమాపై ఎక్కువగా నెగెటివ్​ కామెంట్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్​ వచ్చినంత స్పందన లైగర్​ మూవీకి రెస్పాన్స్​ రావట్లేదని టాక్. అయితే ఈ పరిస్థితిలో లైగర్​ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు.

ఆ ఓటీటీలోనే..

ఆ ఓటీటీలోనే..

లైగర్​ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్​స్టార్​ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు అన్ని భారతీయ భాషల హక్కులను దక్కించుకుంది హాట్​స్టార్. అయితే లైగర్​ ఇవాళే రిలాజ్​ అయింది కాబట్టి ఓటీటీలో ఎప్పుడు వస్తుందనేది చెప్పడం కష్టమే.

8 నుంచి 10 వారాల సంగతేంటీ?

8 నుంచి 10 వారాల సంగతేంటీ?

అయితే ఈ మూవీ నాలుగు వారాల్లో అంటే సెప్టెంబర్​ చివరి వారంలో రానుందని సమాచారం. అలాగే థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయినా 8 నుంచి 10 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్​ చేయాలని ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమావేశంలో నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు.

శాటిలైట్ రైట్స్​ కూడా..

శాటిలైట్ రైట్స్​ కూడా..

ఆ సమావేశం కంటే ముందుగానే ఈ డీల్​ కుదిరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ డిజిటల్​ స్ట్రీమింగ్​ రైట్స్​ మాత్రమే కాకుండా, శాటిలైట్ రైట్స్​ కూడా స్టార్​ గ్రూప్​ దక్కించుకుందని సమాచారం. స్టార్​ గోల్డ్​, స్టార్​ గ్రూప్​కు చెందిన ఇతర ఛానళ్లలో లైగర్​ ప్రసారం కానుంది.

డిజిటల్​ రైట్స్​కే రూ. 55 కోట్లు..

డిజిటల్​ రైట్స్​కే రూ. 55 కోట్లు..

అయితే ఈ మూవీ విడుదలకు ముందే డిజిటల్​, శాటిలైట్స్​ రెండింటికి కలిపి సుమారు రూ. 66 కోట్లకు అమ్ముడుపోయిందని సమాచారం. అందులో రూ. 55 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్​ కోసమే చెల్లించినట్లు సినీ వర్గాల్లో టాక్​.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X