War 2 OTT: డెడ్‌లైన్ కంటే ముందే ఓటీటీలోకి వార్ 2? ఎన్టీఆర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వార్ 2. గతంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన వార్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను నిర్మించారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ప్రముఖ హిందీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన వార్ 2 ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని గాసిప్స్ వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

వార్ 2 బడ్జెట్ ఎంత?
వార్ 2కి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారా. వార్ 2కు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

War 2 OTT Release Hrithik Roshan and Jr NTR s Movie arriving Online soon

వార్ 2 బిజినెస్ ఎంత
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం, ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించడంతో ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగిన విధంగానే వార్ 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. వార్ 2 హిందీ వెర్షన్‌ను ఉత్తర భారతదేశంలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్‌ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు.

వార్ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఎన్టీఆర్ నటించడంతో తెలుగు రాష్ట్రాలలో వార్ 2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ కోసం ఎగబడ్డారు. వార్ 2 థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)కు సొంతం చేసుకున్నారు. అలాగే కర్ణాటక, ఇండియాలోని ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలకు బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో కలిపి వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. భారీ అంచనాల నేపథ్యంలో వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వార్ 2 కలెక్షన్స్
వార్ 2 సినిమా భారతదేశంలో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 62 కోట్ల రూపాయలు, రెండో రోజు 67.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 39 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 38 కోట్ల రూపాయలు, ఐదో రోజు 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 217 కోట్ల నెట్, ఓవర్సీస్‌‌లో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 250 కోట్ల రూపాయలు నెట్, 301 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్
వార్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. తొలి రోజు 27 కోట్ల రూపాయలు, రెండో రోజు 14 కోట్ల రూపాయలు, మూడో రోజు 8.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, 5వ రోజున 3.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు తూర్పు గోదావరి జిల్లాలో 3.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.25 కోట్లు, నెల్లూరులో 1.80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వార్ 2 సినిమా 41 కోట్ల రూపాయల షేర్, 58 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో వార్ 2 కలెక్షన్స్ చూస్తే .. కర్ణాటకలో 15.32 కోట్ల రూపాయలు, తెలుగులో 58 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, మలయాళంలో కోటి రూపాయలు, హిందీలో 133 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

వార్ 2 ముందు భారీ టార్గెట్
తొలి 4 రోజుల్లో వార్ 2 కలెక్షన్ల వర్షం కురిపించగా.. సోమవారం నుంచే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మూవీకి అసలు సిసలు పరీక్ష మొదలైంది. భారీ వర్షాలకు తోడు, జనం ఆదరణ తగ్గడంతో బుకింగ్స్ భారీగా పడిపోయాయి. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలోనూ 70 శాతం మేర బుకింగ్స్ తగ్గాయి. దీని ప్రభావంతో కలెక్షన్స్‌ను భారీగా కోల్పోయింది వార్ 2. పరిస్ధితులు చూస్తుంటే వీకెండ్ వరకు వార్ 2 కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 52 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉండగా.. వరల్డ్ వైడ్‌గా 167 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వార్ 2కి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ముందుగానే ఓటీటీలోకి వార్ 2?
ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో వార్ 2 చిత్రం షెడ్యూల్ కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం మీద ఈ మూవీ ఓటీటీ డీల్ కుదిరింది. దీనిని బట్టి వార్ 2 చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారం ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పరిస్ధితులను చూస్తుంటే వార్ 2 .. సెప్టెంబర్ తొలి వారంలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే హిందీ సినిమా వర్గాలు మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నాయి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా థియేటర్‌లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధనను హిందీ ఇండస్ట్రీ పక్కాగా ఫాలో అవుతోంది. దీనిని బట్టి వార్ 2 చిత్రం ముందుగా స్ట్రీమింగ్ కావడం అన్నది అసాధ్యం. 8 వారాల గడువు పూర్తయిన తర్వాతే హిందీ సహా అన్ని భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తేల్చిచెబుతున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Read more about: war 2 hrithik roshan jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X