పవన్ కల్యాణ్‌పై రోజా షాకింగ్ కామెంట్స్.. వాళ్లు చచ్చినా ఫర్వాలేదా? అంటూ
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం దిశగా దూసుకెళ్లేందుకు సిద్దమైన OG చిత్రం రిలీజ్‌కు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటి, వైసీపీ నేత రోజా సెల్వమణి షాకింగ్‌గా విమర్శలు చేశారు. పలు అంశాలపై ప్రభుత్వం విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా ప్రమోషన్స్ బిజీగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్‌ను, ఓజీ సినిమాను ఉద్దేశించి రోజా చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఎన్నికలకు ముందు నన్ను గెలిపిస్తే.. మీ తలరాతలను మార్చుతానంటూ వాగ్దానం చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు నా ఓజీ సినిమాకు టికెట్ రేట్లు పెంచితే చాలూ.. మీరు చచ్చినా మాకు అనవసరం అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నా పట్టించుకోవడం లేదు. తమకు మద్దతు ధర రావడం లేదని రైతులు బాధపడుతున్నారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు అని ఆమె అన్నారు.

పవన్ కల్యాణ్ రైతు సమస్యలను పక్కన పెట్టి.. కేవలం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల టికెట్లు రేట్లు పెంచుకోవడానికి, షూటింగులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రొటోకాల్‌ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం ప్రజలను గాలికి వదిలేస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ కాకుండా దేవాంశ్ సీఎం అయినా నాకే ఫర్వాలేదు. నా ప్యాకేజ్ నాకు వస్తే చాలూ. నా సినిమాలకు టికెట్ రేట్లు పెంచితే చాలూ అనే విధంగా వ్యవహరిస్తున్నారు అని రోజా ఆరోపించారు.
రాష్ట్రంలో ఆడపిల్లల మరణించినా పట్టించుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మరణించినా పట్టించుకోవడం లేదు. తన కోసం వచ్చి చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించడం లేదు. రైతులు చనిపోతే పట్టించుకోవడం లేదు. ఇక ఈయనకు డిప్యూటీ సీఎ పోస్టు? ఈయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? అని పవన్ కల్యాణ్‌ను రోజా ప్రశ్నించారు.
రాజకీయాల్లోకి వచ్చే ముందు. ఇక నుంచి సినిమాలు చేయను. నన్ను ఒకసారి గెలిపించు.. నీ తలరాతలు మార్చుతాను అని అడుక్కొని గెలిచిన నువ్వు.. కనీసం ఎక్కడైనా.. రైతు, మహిళ, నిరుద్యోగుల కోసం ఎక్కడైనా మాట్లాడవా? అండగా నిలబడ్డవా? అని ప్రశ్నించారు. మీకు ఎందుకు రాజకీయాలు.. హ్యాపీగా షూటింగులు చేసుకో. ఇలా హామీలు నెరవేర్చకపోతే.. విదేశాల్లో చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేస్తారు అని రోజా అన్నారు.


Click it and Unblock the Notifications











