»   » ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ... కానీ చాలా స్లో! (100 డేస్ ఆఫ్ లవ్... రివ్యూ)

ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ... కానీ చాలా స్లో! (100 డేస్ ఆఫ్ లవ్... రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' మూవీ వచ్చిన తర్వాత దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య‌మీన‌న్ జంట‌ బాగా పాపులర్ అయింది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటించిన మరో చిత్రం '100డేస్ ఆఫ్ ల‌వ్'. 'ఓకే బంగారం' కంటే ముందే ఈ సినిమా మళయాలంలో రిలీజై సూపర్ హిట్టయింది. ఇదే చిత్రాన్ని ఇపుడు తెలుగులో రిలీజ్ చేసారు.

జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌లు తెలుగులో గ్రాండ్ గా రిలీజైంది. మరి మళయాలంలో హిట్టయిన ఈచిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ విషయానికొస్తే...
రావు గోపాల్ రావు (దుల్కర్ సల్మాన్) టైమ్స్ లో ఫీచర్ రైటర్‌గా పనిచేస్తూంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రుల చెప్పినట్లు ఉండటం ఇష్టం లేని అతడు వాళ్లకు వచ్చి తనకు నచ్చినట్లు జీవితస్తుంటాడు. కామిక్ కార్టూనిస్టు కావాలన్నది లక్ష్యం.


అయితే అతని స్వభావ రీత్యా ఎడిటర్ తో గొడవ పడటం లాంటి  చేష్టలతో ఉద్యోగాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేని పరిస్థితి. కెరీర్ అస్తవ్యస్తంగా ఉన్న అతడు రోడ్డు మీద అనుకోకుండా తనకు కనిపించి మాయమైన సావిత్రి (నిత్యా మీనన్)ని తొలి చూపులోనే ప్రేమస్తాడు. ఆమె కెమెరా పట్టుకుని తన కోసం అన్వేషిస్తుంటాడు.


సావిత్రి విషయానికొస్తే.... తనను ఇష్టంగా చూసుకునే వ్యక్తితో ఓ సెక్యూర్డ్ లైఫ్ కోరుకునే మనస్తత్వం. కొంత కాలం తర్వాత సావిత్రి గోపాల్ కు ఎదురు పడుతుంది కానీ, ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇక ఆమె ప్రేమలో పడే సమయానికి మరొకరితో ఆమెకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మరి అప్పుడు గోపాల్ ఏం చేసాడు? రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వీరిద్దరు కలిసారా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే...


స్లైడ్ షోలో పూర్తి రివ్యూ....


దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్

దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్

దుల్కర్ సల్మాన్.. నిత్యామీనన్ జంట తెరపై చూడ ముచ్చటగా కనిపించారు. ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. వారి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే అది సినిమా అనే విషయం మరిచిపోతాం. అంతలా ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు.


ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

హీరో ఫ్రెండు పాత్రలో శేఖర్ మీనన్ ప్రేక్షకులుక గుర్తుండి పోయే పాత్రలో బాగా నటించాడు. నవ్వించాడు. ఒకప్పుడు తెలుగులో హీరోగా కనిపించిన వినీత్ మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ప్రేక్షకులు కనిపించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. రాహుల్ మాధవ్ ఫర్వాలేదు.


కొత్తదనం ఉందా?

కొత్తదనం ఉందా?

‘100 డేస్ ఆఫ్ లవ్'లో కొత్తదనం ఉందా? అంటే లేదనే చెప్పాలి. కానీ సినిమా చూసే వారికి ఆ ఆలోచన పెద్దగా రాదు.


ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా...

ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా...

వందల లవ్ స్టోరీలు వస్తున్నపుడు ఏ కథ అయినా కొత్తగా అనిపించదు. అయితే ఆ సినిమాలోని పాత్రలు, ఆ పాత్రల్లోని ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడం, సరికొత్త సీన్లతో ప్రేక్షకుడికి మంచి అనుభూతిత కలిగించడంలోనే దర్శకుడి ప్రతిభదాగి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కొంత మేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.


స్క్రీన్ ప్లే

స్క్రీన్ ప్లే

స్కీన్ ప్లే విషయంలో దర్శకుడు ఈ సినిమాను చాలా నెమ్మదిగా నడిపించాడు. చూసే వారికి సినిమా చాలా స్లోగా ఉందనే ఫీల్ కలుగుతుంది.


ఎంత స్లో అంటే..

ఎంత స్లో అంటే..

అసలు కథ మొదలవ్వడానికి ఇంటర్వెల్ వరకూ ఎదురుచూడాలి. హీరోయిన్‌ను వెతకడంలోనే ఫస్టాఫ్ మొత్తం ఫినిష్. అసలు ప్రేమకథను సెకండాఫ్‌లో మొదలవుతుంది.


హైలెట్

హైలెట్

ఈ సినిమాలో హైలెట్ అయిన అంశం అంటే సెకండాఫ్‍‌లో దుల్కర్ - నిత్యా మీనన్‌ల జర్నీ అనే చెప్పుకోవాలి. అప్పటివరకూ సాదాసీదాగా నడిచే కథను వీరిద్దరి ప్రయాణం మొలైన తర్వాత ప్రేక్షకుల్లో మంచి ఫీల్ కలిగిస్తుంది.


డబ్బింగ్ సినిమానే అయినా..

డబ్బింగ్ సినిమానే అయినా..

ఇది డబ్బింగ్ సినిమానే అయినా... ఆ ఫీల్ రాదు. బెంగుళూరు నేపథ్యంతో సినిమా సాగుతుంది కాబట్టి నేటివిటీ సమస్య అనిపించదు.


టెక్నికల్

టెక్నికల్

గోవింద్ మీనన్ అందించిన పాటలు బావున్నాయి. బిజిబల్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ కలిగిస్తుంది. ప్రతీష్ వర్మ సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాణ విలువలు బాగున్నాయి. శశాంక్ వెన్నెలకంటి అందించిన తెలుగు వెర్షన్ మాటలు ఆకట్టుకున్నాయి.


మేకింగ్ ఓకే కీనా..

మేకింగ్ ఓకే కీనా..

దర్శకుడు సినిమాను మేకింగ్ విషయంలో హైరేంజికి తీసుకళ్లినా.... దానికి తగిన విధంగా కథనాన్ని అందులో పొందు పరచలేక పోయాడు.


మనసుకు హత్తుకునే సీన్లు

మనసుకు హత్తుకునే సీన్లు

సినిమాలో సెకండాఫ్ లో కొన్ని సీన్లు మనసుకు హత్తుకునే లా ఉంటాయి. దుల్కర్ నిత్యా మీనన్‌కి ప్రపోజ్ చేసే సీన్ బావుంది. క్యారెక్టరైజేషన్స్ పరంగా కూడా ప్రతి పాత్రను దర్శకుడు బాగా తీర్చి దిద్దాడు.


చివరగా...

చివరగా...

ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే... మనం సినిమాలో పాత్రలకు కనెక్ట్ అయితే ఓకే అనిపిస్తుంది, లేకుంటే సినిమా చాలా స్లోగా ఉందనే అసంతృప్తితో బయటకు వస్తాం.


English summary
100 Days of Love is a film which is dubbed into Telugu to just cash in on the huge craze of Nithya Menen and Dulquer. But Dulquer Salman-Nithya Menen's film bags mixed verdict from critics, audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu