twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1997 movie review భావోద్వేగానికి గురిచేసే రేప్ మర్డర్ మిస్టరీ

    |

    నటీనటులు: డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు తదితరులు
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్
    నిర్మాత: మీనాక్షి రమావత్
    బ్యానర్: ఈశ్వర పార్వతి మూవీస్
    ఎడిటింగ్: నందమూరి హరి
    సంగీతం: కోటి
    కెమెరా: చిట్టి బాబు
    పీఆర్‌వో: సురేష్ కొండేటి
    రిలీజ్ డేట్: 2021-11-25

    దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విక్రమ్ రాథోడ్ (డాక్టర్ మోహన్) నిజాంపేట్‌లో ఏసీపీగా నియమితులవుతారు. ఏసీపీగా చేరిన ప్రాంతాన్ని దొర ( రామరాజు) తన కనుసన్నల్లో ఉంచుకొంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఇద్దరు గిరిజన యువతులు గంగ, మంగ కిడ్నాప్ గురి అవుతారు. కానీ వారిలో ఒకరు దారుణ హత్యకు గురవుతుంది. అయితే గంగ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంగా చేస్తారు. దొర కనుసన్నల్లో జరిగే కుట్ర సీఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్) భాగమవుతాడు.

    కిడ్నాప్ గురైన గంగ హత్య గురికావడం వెనుక ఏమి జరిగింది? దొర ఎందుకు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దొరను విచారించడానికి, ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించిన ఏసీపీ విక్రమ్ రాథోడ్‌కు ఎదురైన సమస్యలు ఏమిటి? కిడ్నాప్ గురైన మంగ పరిస్థితి ఏమిటి? గంగ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషులు ఎవరు? వారికి శిక్ష పడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 1997 చిత్ర కథ.

    1997 movie review and Rating: Murder Mystery with good performances

    ఆకలితో అలమటిస్తున్న తక్కువ కులానికి చెందిన బాలుడు ప్రసాదం కోసం గుడిమెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తే.. పిల్లాడి ఛాతిపై దొర తన్నే ఎమోషనల్ సీన్‌తో 1997 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత
    నిజాం పేట్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీగా విక్రమ్ రాథోడ్ చేరడమనే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌తో కథ సాగుతుంది. అయితే గంగ మర్డర్ విషయాన్ని యాక్సిడెంట్‌గా మార్చే విషయాన్ని ఏసీపీ రాథోడ్ అడ్డుకొంటాడు. దాంతో ఏసీపీపై దొర ప్రతాపం చూపడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత సస్పెన్షన్ గురికావడం జరుగుతుంది. రాజకీయ క్రీడలో బలిపశువుగా మారిన ఏసీపీ ఈ కేసుకు ఎలాంటి పరిష్కారం చూపాడు? గంగ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేశాడనే అంశాలు సినిమాకు మంచి ఎనర్జీగా కనిపిస్తాయి.

    ఏసీపీ విక్రమ్ రాథోడ్‌గానే కాకుండా దర్శకుడిగా డాక్టర్ మోహన్ బహుముఖ ప్రతిభను చాటుకొన్నారు. ఏసీపీగా తెరపైన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో మెప్పించారని చెప్పవచ్చు. ఆవేశపూరితంగా కనిపించే పోలీస్ ఆఫీసర్‌గా కాకుండా మైండ్ గేమ్‌ ఆడే పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో ఒదిగిపోయారు. ఇక సామాజిక, కుల వివక్ష, అసమానతలను కథా వస్తువుగా ఎంచుకొని భావోద్వేగమైన చిత్రాన్ని అందించే ప్రయత్నాన్ని అభినందించాలి. ఈ కథను కమర్షియల్‌గా కాకుండా వాస్తవికతను ప్రతిబింబిచేలా చేయడం దర్శకుడిగా మోహన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

    ఇక 1997 చిత్రంలో సీఐ చారిగా శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రను పోషించాడు. సినిమాకు వెన్నముకగా కనిపిస్తాడు. కథను పరుగులు పెట్టించే విధంగా నటన ప్రదర్శిస్తూ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సినిమాకు బలంగా మారాడమే కాకుండా సాఫ్ట్ విలనిజాన్ని చక్కగా పండించాడు. దొరగా రామరాజు, ఇన్స్‌పెక్టర్ రవి కుమార్‌గా రవి ప్రకాశ్, ఉన్నతాధికారులుగా నవీన్ చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ కోటి తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

    సాంకేతిక విషయాలకు వస్తే.. కోటి అందించిన సంగీతం సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ఆదేశ్ రవి రాసిన ఏమి బతుకు.. ఏమి బతుకు.. పాటకు సింగర్ మంగ్లీ ప్రాణం పోశారు. ఈ పాట సమాజంలోని వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబిచేలా తెరపైన కనిపించింది. ప్రేక్షకుడిని తప్పకుండా భావొద్వేగానికి గురిచేసేలా చిత్రీకరించారు. చిట్టిబాబు సినిమాటోగ్రఫి బాగుంది. నందమూరి హరి ఎడిటింగ్ పర్‌ఫెక్ట్‌గా ఉంది. నిర్మాతగా మీనాక్షి రమావత్ ఆమె పాటించిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. లాభాపేక్ష లేకుండా సమాజంలోని అసమానతలపై ప్రేక్షకులను చైతన్యవంతులుగా చేయాలనే ప్రయత్నం అభినందనీయం.

    Recommended Video

    1997 Movie Team Interview.. టాప్ టెకనీషియన్లు వర్క్ చేసిన చిత్రం

    సమాజంలోని కుల వివక్ష, అసమానతలు, గ్రామాల్లో అమ్మాయిలపై పెత్తందార్ల లైంగిక దాడులపై సంధించిన సినీ విమర్శనాస్త్రం 1997. భావోద్వేగమైన అంశాలు ప్రతీ ఒక్కరిని ఆలొచింపజేస్తాయి. అవినీతి వ్యవస్థను కళ్లకు గట్టినట్టు తెరపైన ఆవిష్కరించారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు 1997 తప్పకుండా నచ్చుతుంది.

    English summary
    Dr Mohan's Directorial venture 1997 movie review and Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X