»   » ప్రభాస్ పెళ్లి... ఏందీ లొల్లి (‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ రివ్యూ)

ప్రభాస్ పెళ్లి... ఏందీ లొల్లి (‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

హైదరాబాద్: ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి.... అంటూ కొంతకాలంగా ఓ వెరైటీ టైటిల్ ఉన్న సినిమా ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా ఇంత హాట్ టాపిక్ కావడానికి ప్రధాన కారణం టైటిల్ లో బాహుబలి స్టార్ ప్రభాస్ పేరు ఉండటం, సినిమాలో బాహుబలిలో కాలకేయుడిగా నటించిన ప్రభాకర్ ముఖ్యపాత్రలో నటించడం.

ఎస్.జె.చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది, మేరకు నవ్వించింది అనేది రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే... నాని (ప్రభాకర్) నెల్లూరులో పెద్ద రౌడీ. భూ కబ్జాలు చేస్తూ అందరినీ హడలెత్తిస్తుంటాడు. ఈ రౌడీకి ఆడవాళ్లంటే అస్సలు పడదు. ప్రేమ అనే పదం వింటే చాలు వాళ్ల ప్రాణాలు తీసే రకం. నాని ఇలా తరయారు కావడానికి కారణం ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే. దీంతో అడజాతి మొత్తాన్ని... చివరకు తన చెల్లెలు అమృత(అశ్విని)ను కూడా ద్వేషిస్తుంటాడు.

అదీ మిగతా కథ

అదీ మిగతా కథ

అమృత ప్రభాస్ అనే పేరున్న ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఈ విషయం అన్నయ్య నానికి చెబితే తమ ప్రాణాలు తీస్తాడని భయపడుతూ ఉంటుంది. ఆమె ప్రేమకు సహకరించేందుకు ప్రభాస్ (ఏ. రవితేజ) అనే మరో వ్యక్తి రంగంలోకి దిగుతాడు. అమృత ప్రేమించిన అసలు ప్రభాస్ ఎవరు? ఈ ప్రభాస్ కు, ఆ ప్రభాస్ కు సంబంధం ఏమిటి? ప్రేమంటే ద్వేషించే నాని చెల్లి ప్రేమ విషయం తెలిసి ఏం చేసాడు? అనేది మిగతా కథ.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

సినిమాలో మెయిన్ రోల్ చేసిన..... ప్రభాకర్ తన పాత్రకు న్యాయం చేసాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ బాగానే నటించారు. అశ్విని, ఏ. రవితేజ, ఇతర నటీనటులు ఫర్వాలదు. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీలేవు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు కూడా చాలా వీక్ గానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అంత గొప్పగా ఏమీ లేకపోయినా జస్ట్ ఓకే. పాటలు ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా కాన్సెప్టుకు తగిన విధంగా ఉంది.

దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

సినిమా కథాంశం కొత్తగా లేక పోయినా... సీరియస్ డ్రామా నుండి కామెడీ పుట్టించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే స్క్రీన్ ప్లే అస్తవ్యస్తంగా ఉండటంతో అనుకున్న ఔట్ పుట్ రాలేదు. అటు కామెడీ వర్కౌట్ కాక ఇటు సీరియస్ నెస్ లేక రెంటికీ చెడ్డరేవడిలా తయారైంది. సినిమాలో మూడు ట్విస్టులను కలిపుతూ నేరేట్ చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు.

ఫైనల్ గా చెప్పాలంటే

ఫైనల్ గా చెప్పాలంటే

ఫైనల్ గా చెప్పాలంటే... ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు.

English summary
Aavu Puli Madhyalo Prabhas Movie Review And Rating: Aavu Puli Madhyalo Prabhas Pelli upcoming Telugu drama film written and directed by Sam J Chaitanya and produced by Ravi Pachipala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu