»   » అన్వేషణం (‘క్షణం’ రివ్యూ)

అన్వేషణం (‘క్షణం’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

నిన్నటిదాకా హర్రర్ చిత్రాలు తెలుగు సినిమా భాక్సాఫీస్ ని భయపెట్టి, నవ్వించి అలరిస్తే ఇప్పుడు థ్రిల్లర్ చిత్రాలు ధ్రిల్ చేస్తామంటూ మొదలయ్యాయి. ఎంతలా అంటే ఈ రోజు తెలుగులో రెండు థ్రిల్లర్స్( శ్రీకాంత్ టెర్రర్, అడవి శేషు క్షణం) రిలీజ్ అయ్యాయి.

ఇవి డబ్బులు తెచ్చుకుని నిర్మాతలను ఒడ్డున పడేస్తే..ఖచ్చితంగా మరిన్ని ధ్రిల్లర్స్ వరస పెడతాయి. ముఖ్యంగా చిన్న సినిమాకు ఊపిరి పోసినట్లు అవుతుంది. అయితే ఈ ఆశ ఈ సినిమా తీరుస్తుందా ...ఈ క్షణం ఏ స్ధాయి థ్రిల్లింగ్ ని అందించిందో చూద్దాం.


ఎన్నారై రిషి(అడవి శేష్)కి ఓ రోజు ఇండియా నుంచి ఓ ఫోన్ వస్తుంది. అయితే ఆ పోన్ రెగ్యుల్ గా తనతో టట్ లో ఉండేవారు అయితే పెద్దగా చెప్పుకునేదేమీలేదు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని, అది వివాహం దాకా సాగక విడిపోయిన తన మాజీ లవర్ అయిన శ్వేత(ఆద శర్మ) నుంచి ఆ ఫోన్ కాల్.


సర్లే క్యాజువల్ గా ఎలా ఉన్నావ్..అనే కాల్ అయితే అసలు పట్టింకోనక్కర్లేదు. అయితే ఆమె మన హీరో రిషిని ఓ సాయిం అడుగుతుంది..అది మరేదో కాదు..తన కూతురు రియా రెండు నెలల నుంచి కనిపించడం లేదని, ఎవరు కిడ్నాప్ చేసారో తెలియడం లేదని, తన కూతురుని వెతికి పెట్టమని సాయం కోరుతుంది.


దాంతో కోసం ఇండియాకి వస్తాడు.. వచ్చి శ్వేత నుంచి జరిగింది తెలుసుకొని ఆ పాప కోసం సెర్చింగ్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. ఒక టైమ్ లో అసలు పాపే లేదనే దాకా వెళ్తుంది. ఏం చెయ్యాలి. ఉందని వెతకాలా..లేదని వెనక్కివెళ్లిపోవాలా.. రియా దొరికిందా లేదా? అసలు శ్వేత రిషికే ఎందుకు ఫోన్‌ చేసింది? ఈ కేసు దర్యాప్తులో ఐపీఎస్‌ జయ (అనసూయ)కి పాత్ర ఏమిటి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.


ఇలాంటి కథలు ఎక్కువగా మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తూంటాం. అయితే తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు అరుదనే చెప్పాలి. ఈ చిత్రం ఎత్తుగడ చూస్తే మనకు కహాని(తెలుగులో అనామిక) గుర్తుకు వస్తుంది. అయితే దర్శకుడు అటువైపుకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ వచ్చాడు. అసలు మీరు వెతుకుతున్న పాపే లేదు..చిత్త భ్రాంతి అని చెప్పే సన్నివేశాలు చూస్తూంటే మనకు 1 నేనొక్కిడినే గుర్తుకు వస్తుంది. ఇవే కాక చాలా హాలీవుడ్ సినిమాల గుర్తుకు వచ్చినా తనదైన శైలిలో ఈ ధ్రిల్లర్ ని డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే రైటర్ అడవి శేషు ని మెచ్చుకోవాలి.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ


ఫెరఫెక్ట్

ఫెరఫెక్ట్

ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఊహకు అందని విధంగా పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా స్క్రీన్ ప్లే నడపటమే.మేకింగ్ వైజ్

మేకింగ్ వైజ్

ఇలాంటి సినిమాలకు మేకింగ్ చాలా అవసరం... ఈ విషయంలో కొత్త దర్సకుడు మంచి మార్కులే సంపాదించాడనే చెప్పాలి. మూడ్ డైవర్ట్ కానివ్వలేదు


జస్ట్ ఓకే

జస్ట్ ఓకే

అదా శర్మ మాత్రం ఎమోషన్ సీన్స్ లో జస్ట్ ఓకే అనిపించేలా చేసింది. కూతురుని పోగొట్టుకున్న తల్లిగా ఆమె కరెక్టుగా సూట్ కాలేదు.అనసూయ..ఇంకా

అనసూయ..ఇంకా

ఐపీఎస్‌ జయ పాత్ర కథలో చాలా కీలకం. ఆ పాత్రలో అనసూయ మరింత ఎఫెక్టివ్‌గా నటించాల్సింది. పోలీసు పాత్రలోని హుందాతనం ఆమెలో కనిపించలేదు.అడవి శేష్‌

అడవి శేష్‌

తన పాత్రకి ప్రాణం పోశాడనే చెప్పాలి. సన్నివేశానికి తగినట్లు...హావభావాల్ని ప్రదర్శించడంలో పర్‌ఫెక్ట్‌ అనిపించుకొన్నాడు. ఇది అడివి శేషు వన్ మ్యాన్ షోరీరికార్డింగ్

రీరికార్డింగ్

ఈ తరహా సినిమాలకు సగం సక్సెస్ రీరికార్డింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో పాకాల శ్రీచరణ్‌ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

కానీ సినిమాకు ప్లస్ అవ్వాల్సిన రీతిలో సినిమాటోగ్రఫీ లేదు.అలాగే ఎడిటింగ్ కూడా ఇంకాస్త షార్ప్ చేయవచ్చు.సత్యం రాజేష్ హైలెట్

సత్యం రాజేష్ హైలెట్

సత్యం రాజేష్ కు చాలా కాలం తర్వాత చౌదరి అనే మంచి క్యారక్టర్ పడింది.క్లైమాక్స్ లో అతను నిలబెట్టాడు.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్‌: పివిపి సినిమా, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: అడివి శేష్‌, అదా శర్మ, అనసూయ భరద్వాజ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేష్‌, సత్యదేవ్‌, బేబీ డాలీ తదితరులు
కథ: అడివి శేష్‌
స్క్రీన్ ప్లే : అడివి శేష్‌, రవికాంత్‌ పేరేపు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
ఎడిటింగ్ : అర్జున్‌ శాస్త్రి, రవికాంత్‌ పేరేపు
సినిమాటోగ్రఫీ: షానీల్‌ డియో
నిర్మాతలు: పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే
దర్శకత్వం: రవికాంత్‌ పేరేపు
విడుదల తేదీ: ఫిబ్రవరి 26, 2016ఫైనల్ గా ధ్రిల్లర్ చిత్రాభిమానులకు ఇది విందు భోజనం లాంటిది. తెలుగులో కూడా ఇలాంటి ఫెరఫెక్ట్ ధ్రిల్లర్ సినిమాలు తీయగల టెక్నీషియన్స్ ఉన్నారు. నిర్మాతలు ఉత్సాహం చూపిస్తే ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ ఇస్తారని ఈ చిత్రం ప్రూవ్ చేస్తుంది.

English summary
Over all , the film "Kshanam" makes a positive impact on audience mindset and is filled with lots of twists and turns.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu