»   » ఏజెంట్ భైరవ రివ్యూ

ఏజెంట్ భైరవ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rating:
  2.0/5
  Star Cast: జోసెఫ్ విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు
  Director: భరతన్

  ఇళయ దళపతి విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా జగపతిబాబు విలన్ పాత్రలో నటించిన చిత్రం 'ఏజెంట్ భైరవ'. పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకం బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. భరతన్‌ దర్శకుడు.

  తమిళనాడులో పెద్ద స్టార్ హీరో అయిన విజయ్..... తెలుగులో తన మార్కెట్ విస్తరించుకోవాలని కొంతకాలంగా అలుపెరుగకుండా టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన సినిమాలు తమిళ బాక్సాఫీసు వద్ద వర్కౌట్ అయినట్లుగా తెలుగులో కావడం లేదు. విజయ్ కెరీర్లో తెలుగులో మంచి విజయం సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే 'తుపాకి' మాత్రమే.


  ఈ సారి 'ఏజెంట్ భైరవ'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఏ మేరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం.


  కాన్సెప్టు ఏమిటంటే....

  కాన్సెప్టు ఏమిటంటే....

  సమాజంలో సమస్యలనే తన సినిమాలకు కథలుగా ఎంచుకునే విజయ్... ఈ సారి ప్రైవేటు మెడికల్ కాలేజీల భాగోతాన్ని తన చిత్ర మూల కథగా ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పుట్టగొడుల్లా పుట్టుకొచ్చిన అక్రమ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. రౌడీలు, గుండాలు, రాజకీయనాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మెడికల్ కాలేజీలు పెట్టి సామాన్యులను ఎలా దోచుకుంటున్నారు? కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా వెలసిన ఈ కాలేజీలు సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న వైనాన్ని టార్గెట్ చేస్తూ సినిమా సాగింది.


  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  పిడకల కోటయ్య అలియాస్ పి.కె (జగపతి బాబు) వైజాగ్‌లో కసాయి కొట్టునడుపుతూ మాంసం విక్రయించే స్థాయి నుండి... రౌడీగా, గుండాగా, ఆపై పారిశ్రామిక వేత్తగా, ప్రభుత్వాన్ని శాశించే స్థాయికి ఎదుగుతాడు. ఎరైనా తనకు అడ్డొస్తే వాళ్ల అడ్డు తప్పించుకోవడానికి వాళ్లను చంపడానికి కూడా వెనకాడని క్రూరుడు. సమాజంలో వైట్ కాలర్ పెద్ద మనిషిలా చెలామని అవుతూ తనకు ఎదురొచ్చిన వారిని అనుచరుడైన గంగిరెడ్డితో చంపిస్తుంటాడు. విద్యా సంస్థలు స్థాపించి సమాజంలో పెద్దమనిషిలా చెలామని అవుతున్న పికె.... తన మెడికల్ కాలేజీని కాపాడుకోవడానికి తనిఖీలకు వచ్చిన అధికారులకు తన కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి మాన ప్రాణాలను ఎరగా విసురుతాడు. ఆపై ఆమెను హత్య చేయిస్తాడు. అసలు.... ఈ పిడకల కోటయ్యకు, ఏజెంట్ భైరవ(విజయ్), మాధవి లత(కీర్తి సురేష్)కి సంబంధం ఏమిటి? పిడకల కోటయ్య అక్రమాలను వీరు ఎలా ఆటకట్టించారు అనేది తర్వాతి కథ.


  పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

  పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...

  పెర్ఫార్మెన్స్ పరంగా విజయ్‌కి వంకపెట్టడానికి ఏమీలేదు. తనదైన స్టైల్ యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ అదరగొట్టాడు. కీర్తి సురేష్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. విలన్ పాత్రలో జగపతి బాబు బాగానే నటించినా...... మనం తెలుగు సినిమాల్లో చూసిన జగపతి విలనిజంతో పోల్చితే పి.కె పాత్ర అంత ఎక్స్‌ట్రార్డినరీగా ఏమీ లేదు. వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ వారి పాత్రలకు న్యాయం చేశారు.


  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాలు

  ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ అందించి పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎంఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ ఓకే. ఇతర టెక్నికల్ విభాగాలు ఫర్వాలేదు.


  కథే పెద్ద మైనస్

  కథే పెద్ద మైనస్

  సినిమాలో పెద్ద మైనస్ ఏమైనా ఉంది అంటే.... అది సినిమా కథే. కథలో కొత్తదనం లేక పోవడంతో సినిమా మొత్తంపై ఎఫెక్ట్ పడింది. ఏదో రొటీన్ కమర్షియల్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.


  యావరేజ్ స్క్రీన్ ప్లే

  యావరేజ్ స్క్రీన్ ప్లే

  స్టోరీలో కొత్తదనం లేదు, కనీసం స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా లేదు. నెక్ట్స్ సీన్ ఏమిటీ అనేది ప్రేక్షుకుడు ముందే ఊహించేలా ఉండటం కూడా సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తిని తగ్గిస్తుంది. కథ, దర్శకత్వం వహించిన భరతన్ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిందే.


  ప్లస్సులు, మైనస్సులు

  ప్లస్సులు, మైనస్సులు

  కథ, స్క్రీన్ ప్లే, పాటలు, డైరెక్షన్ పెద్ద మైనస్..... విజయ్, కీర్తి సురేష్, జగపతి బాబు పెర్ఫార్మెన్స్ ప్లస్.


  మూస కథలు, సినిమాల నుండి బయటకు రాని విజయ్

  మూస కథలు, సినిమాల నుండి బయటకు రాని విజయ్

  ఈ మధ్య కాలంలో విజయ్ సినిమా ఏది తీసుకున్నా మూసకథలు, రోటీన్ పాయింట్ల చుట్టే తిరుగుతున్నాయి. తమిళనాడు బాక్సాఫీసు వద్ద ఇవి వర్కౌట్ అవుతాయేమోకానీ....తెలుగులో ఇలాంటి పెద్దగా వర్కౌట్ కావు. కమర్షియల్, మాస్ ఎలిమెంట్లతో పాటు కొత్తగా, విభిన్నంగా ఉండే కథల వైపు ఫోకస్ చేస్తే తప్ప తెలుగులో విజయ్ మళ్లీ సక్సెస్ కొట్టే అవకాశం కనిపించడం లేదు.


  మెసేజ్ బావుంది

  మెసేజ్ బావుంది

  సినిమా చివర్లో చెప్పిన ఓ మెసేజ్ బావుంది. రౌడీలు, గుండాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాలేజీలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తే వాళ్లు డబ్బు సంపాదించాలని చూస్తారే తప్ప.... విద్యార్థుల భవిష్యత్ గురించి, విద్యా ప్రమాణాల గురించి ఆలోచించరు. విద్యాసంస్థలు పెట్టేవారికి కూడా అర్హత అంటూ నిర్ణయించాలి అని చెప్పే ప్రయత్నం చేశారు.


  ఫైనల్ వర్డ్

  ఫైనల్ వర్డ్

  ఇళయ దళపతి విజయ్ నటించిన ఏజెంట్ భైరవ చిత్రం ఏమాత్రం కొత్తదనం లేని రొటీన్ కమర్షియల్ ఎంటర్టెనర్. కొత్తదనం కోరుకునే వారికి సినిమా నచ్చక పోవచ్చు.రొటీన్ పాటలు, ఫైట్లు, సెంటిమెంట్ ఇష్టపడే వారికి ఫర్వాలేదనిపిస్తుంది.

  English summary
  Agent Bairavaa is a 2017 Indian Tamil-language action film written and directed by Bharathan and produced by Vijaya Productions. The film stars Vijay and Keerthy Suresh in the lead roles, while Sathish, Jagapathi Babu, Daniel Balaji, Mime Gopi, Sreeman and Sija Rose amongst others play supporting roles.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more