For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akasam Movie Review హృదయాన్ని హత్తుకొనే ప్రేమ కథలు.. శివాత్మిక, రీతూ, అపర్ణ టాప్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్

  |

  Rating:
  3.0/5
  Star Cast: అశోక్ సెల్వన్, శివాత్మిక, అపర్ణ, రీతూవర్మ, జీవా
  Director: రా కార్తీక్

  నటీనటులు: అశోక్ సెల్వన్, రీతూ వర్మ, శివాత్మిక రాజశేఖర్, అపర్ణ బాలమురళీ. జీవా, ఇషా రెబ్బా, శివదా తదితరులు
  రచన, దర్శకత్వం: రా కార్తీక్
  నిర్మాత: శ్రీనిధి సాగర్, పీ రూపక్ ప్రణవ్ తేజ్
  సినిమాటోగ్రఫి: విధూ అయ్యన్న
  ఎడిటింగ్: అంథోని
  మ్యూజిక్: గోపి సుందర్
  బ్యానర్: వయాకామ్ 18 స్టూడియోస్, రైస్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
  రిలీజ్ డేట్: 2022-11-04

  ఆకాశం కథ ఏమిటంటే?

  ఆకాశం కథ ఏమిటంటే?

  మితభాషి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్జున్ (అశోక్ సెల్వన్) ప్రతీ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, అలాగే ప్రాణం కంటే ఎక్కువగా శుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువకుడు. చిన్నతనం నుంచే ఏదైనా పుస్తకం చదివినా.. ఏదైన కథ విన్నా, చూసినా అందులోని పాత్రలో తనను ఊహించుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న అర్జున్‌కు పెళ్లి జరిగిన రోజే.. భార్య తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురి అవుతాడు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి ట్రీట్‌మెంట్ తీసుకొంటున్న సమయంలో డాక్టర్ రెండు పుస్తకాలు చదవమని ఇస్తుంది. ఆ రెండు పుస్తకాల్లోని కథలు అర్జున్ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయనేది సినిమా కథ.

  ఫస్టాఫ్‌లో కథ, కథనాలు

  ఫస్టాఫ్‌లో కథ, కథనాలు

  ఆకాశం కథ.. కోల్‌కతాలోని మీనాక్షిని కలిసేందుకు వెళ్తున్న అర్జున్‌కు సుభద్ర కలువడంతో సినిమా మొదలువుతుంది. అర్జున్ మ్యారేజ్ బ్రేకప్ తర్వాత సినిమా అంతా భావోద్వేగమైన కంటెంట్‌తో ముందుకెళ్తుంది. వీర, మీనాక్షి కథ చాలా ఎమోషనల్‌గా, సాఫీగా సినిమా ఫస్టాఫ్ సాగిపోతుంది. భారీ తుఫాన్‌లో వీరకు ఎదురైన ప్రమాదానికి సంబంధించిన ట్విస్ట్ సినిమా రెండో భాగంపై క్యూరియాసిటిని పెంచుతుంది.

  సెకండాఫ్‌లో ఎమోషన్స్

  సెకండాఫ్‌లో ఎమోషన్స్

  ఇక సెకండాఫ్‌లో మథీ, ప్రభాకరన్ కథ ఫన్నీగా, ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌ అంశాలతో అనుక్షణం ఓ గుండె నిండా మంచి ఫీలింగ్‌ను కలిగిస్తుంది. సెకండాఫ్‌లో వీర, మీనాక్షి అలాగే.. మథీ, ప్రభాకరన్‌ కథలకు భావోద్వేగమైన ముగింపు మనసును కకావికలం చేస్తుంది. రెండు జంటల ప్రేమకథలు హృదయాన్ని భారంగా మారుస్తూ.. చక్కటి క్లైమాక్స్‌తో ఆకాశం ఫీల్‌గుడ్‌ మూవీగా ముగుస్తుంది.

  అశోక్ సెల్వన్, ఇతర నటీనటులు గురించి

  అశోక్ సెల్వన్, ఇతర నటీనటులు గురించి


  నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ఆకాశం మూవీకి అత్యంత బలంగా కనిపిస్తాయి. అశోక్ సెల్వన్ పలు రకాల గెటప్స్‌తో విభిమన్నమైన పాత్రలతో అనుక్షణం థ్రిల్‌కు గురిచేస్తాడు. మూడీగా, ఎనర్జిటిక్‌గా రకరకాల ఎమోషన్స్‌తో సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకొంటాడు. రీతూ వర్మ, శివాత్మిక, అపర్ణ బాలమురళీ ఫెర్ఫార్మెన్స్ పీక్స్‌గా ఉంటాయి. ఎమోషన్స్, ఫన్‌తో మనసును ఆకట్టుకొంటారు. ఈ ముగ్గరు హీరోయిన్లు తమ కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇక జీవా అతిథి పాత్రలో భావోద్వేగానికి గురి చేస్తారు.

  సాంకేతికంగా ఎలా ఉందంటే?

  సాంకేతికంగా ఎలా ఉందంటే?

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో బ్రిల్లియెన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా విధూ అయ్యన్న సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంటుంది. వెండితెర మీద కలర్‌ఫుల్ పెయింటింగ్‌గా అనిపిస్తుంది. ఆర్డిస్టుల మూడ్‌ను ఎలివేట్ చేయడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. గోపిసుందర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా మారింది. సినిమా నిడివి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. కథ, పాత్రల బిహేవియర్ వల్ల నిడివి తప్పనసరి అయినట్టు అనిపిస్తుంది. కాస్త ఎడిటింగ్‌కు పదును పెడితే.. సినిమా ఇంకా ఫీల్‌గుడ్‌గా మారే అవకాశం ఉంది. ప్రోడక్షన్ వ్యాల్యూస్ హై క్లాస్, హై రేంజ్‌లో ఉన్నాయి.

  ఫైనల్‌గా ఆకాశం గురించి..

  ఫైనల్‌గా ఆకాశం గురించి..

  లవ్, సెంటిమెంట్, ఎమోషన్స్, నటీనటుల టాప్ క్లాస్ ఫెర్ఫార్మెన్స్‌తో రూపొందిన చిత్రం ఆకాశం. దర్శకుడు రా కార్తీక్ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్బుతంగా ఉంటుంది. అశోక్ సెల్వన్, శివాత్మిక, అపర్ణ, రీతూవర్మ తమ నటనతో ప్రేక్షకుల మనసులో ముద్ర వేస్తారు. హృదయాన్ని ప్రేమతోను, ఎమోషన్స్‌తో భారంగా మారుస్తుంది. ప్రతీ సన్నివేశం మీ పెదాల మీద చిరునవ్వును పూయిస్తుంది. ఫ్యామీలి, యూత్, అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే చిత్రం. ఈ వీకెండ్‌లో ఫీల్‌గుడ్, క్లీన్ ఎంటర్‌టైనర్ చూడాలంటే.. ఆకాశం కేరాఫ్.. అడ్రస్.. సో.. ఎంజాయ్ ఇన్ థియేటర్స్.

  English summary
  Nitham Oru Vaanam's Telugu Dubbing Aakasam movie has released on November 4th. Here is the Telugu filmibeat's Exclusive Review
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X