For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కథ కిల్ చేసినా... (‌ 'అఖిల్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  తెర తొలిగింది. అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడు అక్కినేని అఖిల్ పూర్తి స్ధాయిలో ప్రపంచానికి హీరోగా పరిచయం అవుతూ యాక్షన్ రొమాన్స్ ప్యాకేజీతో ధియోటర్స్ లోకి దూకేసాడు. వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వచ్చినా సినిమాకు కొంచెం కూడా క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా దర్శకుడు వివి వినాయిక్ కు సూపర్ హిట్ మాస్ చిత్రాల దర్శకుడుగా ఉన్న ముద్ర సైతం సినిమాపై ఆసక్తిని ఇంకో స్దాయికి తీసుకెళ్లింది.

  review2

  వీటినన్నటినీ దృష్టిలో పెట్టుకుని తనపై అపరిమితమైన అంచనాలు ఉన్నాయని అర్దం చేసుకున్న అఖిల్...బాగా కష్టపడ్డాడనే చెప్పాలి. సినిమా కథ కేవలం నామమాత్రంగా సాగుతూ...పూర్తిగా అఖిల్ అన్ని ఎమోషన్స్ చూపగలడు, డాన్స్ లు ఫైట్స్ ఏ మాత్రం తగ్గకుండా చేయగలడు అని ప్రమోట్ చేస్తూ చెప్పగలిగే... షో రోల్ గా సాగింది. అయితే సినిమాలో కీ ఎలిమెంట్స్ తో ఎమోషన్ ఎటాచమెంట్ మిస్సవటం, కథనం చాలా సేపు ప్లాట్ గా సాగటం, కామెడీ పేరుతో వచ్చే ఎపిసోడ్స్ ఇబ్బంది పెడతాయి. అయితే ఏదైతే ఈ సినిమా ద్వారా తండ్రి నాగార్జున, దర్శకుడు వినాయిక్,నిర్మాత నితిన్ కోరుకున్నారో అది మాత్రమే నెరివేరినట్లు కనిపిస్తోంది. అఖిల్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకునే కిక్ మాత్రం అసలు దొరకలేదు.

  సరదా కుర్రాడు అఖిల్ (అఖిల్ అఖినేని) మెడికల్ స్టూడెంట్ దివ్య (సాయేషా)తో ప్రేమలో పడతాడు. రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆమె కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తూంటాడు. ఇలా వీరి ప్రేమ కథ నడుస్తూండగా...ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఉంటే ఆమె ఆఫ్రికాలో ఉందని తెలుస్తుంది. మరో ప్రక్క జర్మన్ సైంటిస్ట్ కత్రోచి...జువా ని తన గుప్పెట్లో పెట్టుకుని అతీత శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తూంటాడు.

  ఇది తెలియని అఖిల్...దివ్యను వెనక్కి తేవటం కోసం బ్రహ్మానందంతో కలిసి కొందమంది ట్రైబర్ తెగ సాయిం తీసుకుని బయిలు దేరతాడు. వారితో కలిసి జర్నీ చేస్తున్న సమయంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవే అతని జీవితాన్ని, లక్ష్యాన్ని సమూలంగా మార్చేస్దాయి. ఆ సంఘటనలు ఏమిటి..జువాకు అఖిల్ కు సంభంధం ఏమిటి..అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చేరుకున్నాడా, విలన్ నుంచి జువాని రక్షించి ప్రపంచాన్ని రక్షించాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  review3

  ఇంతకు ముందు మన తెలుగు కథలు...తనని లేదా తన కుటుంబాన్ని సేవ్ చేసుకునేవాడిగా వచ్చాయి. ఆ తర్వాత తరంలో తన ఊరుని ..విలన్స్ నుంచి రక్షిస్తే... కొద్ది కాలం తర్వాత హీరోలు మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించే కథలూ వచ్చాయి. అయితే అటువంటి కథలు ఇమేజ్ ఉన్న మాస్ హీరోలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు అఖిల్ తొలిచిత్రంతోనే..ఏకంగా ప్రపంచాన్నే రక్షించే పనిలో పడ్డాడు. సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇదే సబబు అని భావించారేమో.

  ఇక ఇలాంటి కథలు గతంలో తెలుగులో దేవిపుత్రుడు,అంజి అంటూ వచ్చాయి. అలాగే హాలీవుడ్ లో ఇండియానా జోన్స్, లారా క్రాప్ట్ టాంబ్ రైడర్ ఇంకా మరెన్నో చూసే ఉంటాం. అలాగే చాలా విజువల్స్ ఫిరానా, అవతార్ లను గుర్తు చేస్తే హెలీకాప్టర్ సీక్వెన్స్, వల్కనో బరస్ట్ అవటం వంటివి పూర్తిగా హాలీవుడ్ సినిమాల నుంచి తీసుకున్నవే అని అర్దమవుతూ ఉంటుంది. అయితే ఇది ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న ట్రెండ్ ని ఢిఫెర్ చేసే కథే...అయితే ట్రీట్ మెంట్, స్క్రీన్ ప్లే విషయంలో దాన్ని పరమ రొటీన్ గా మార్చేసారు.

  ఇంతకాలం అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ క్లాస్ సినిమాలకే పరిమితం అవుతూ వస్తున్నారు...అప్పుడప్పుడూ మాస్ లుక్ కి ట్రై చేసినా ఆ దారిలో పూర్తి ప్రయాణం పెట్టుకోలేదు.కానీ అఖిల్ తొలి చిత్రం నుంచే మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసాడని అర్దమవుతోంది. తొలి చిత్రానికి దర్శకుడుగా ఏ గౌతమ్ మీనన్ నో, మణిరత్నం నో ఎన్నుకోకుండా మాస్ చిత్రాల దర్శకుడు వినాయిక్ ని ఎన్నుకోవటంలోనూ, డాన్స్ లు, ఫైట్స్ ని అఖిల్ తీరులో అది మనకు స్పషమవుతుంది.

  హీరోగా అఖిల్ కు మాత్రమే ఇది ఎంట్రీ చిత్రం కాదు...హీరోయిన్ సాయేషాకు ఇదే తొలి చిత్రం. ఆమె డీసెంట్ గా గ్లామర్ తో ఎక్కడా తడబాటు లేని డైలాగ్ డెలివరితో,చాలా చోట్ల అఖిల్ కు డాన్స్ లలో పోటీ ఇస్తూ చేసింది. చూస్తూంటే సాయేషా తెలుగులో స్ధిరపడేటట్లే కనపడుతోంది.

  ఇది వినాయిక్ కష్టం...

  కొత్త హీరోని, అదీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ ఉన్న కుర్రాడిని లాంచ్ చేయమని,అదీ మాస్ స్టార్ గా రెడీ చేయమని అప్పగించినప్పుడే వినాయిక్ పై భాధ్యత బాగా పెరిగింది. అందుకు తగినట్లే ఆయన చాలా థిన్ గా ఉన్న స్టోరీ లైన్ తీసుకుని, తన దైన శైలిలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ, ఈ కుర్రాడు అన్నీ చేయగలడు అని చెప్పేందుకు తగినట్లుగా సీన్స్ అల్లుకుంటూ వచ్చారు. రీసెంట్ గా బెల్లంకొండ కొడుకుని లాంచ్ చేసిన అనుభవం ఇక్కడ బాగా పనికి వచ్చిందనే చెప్పాలి.

  పాటల భాధ్యత మంచి స్పీడులో ఉన్న తమన్, అనూప్ తీసుకున్నారు. పాటలు రిలీజ్ కు ముందు బాగా ఎక్కకపోయినా పిక్చరైజేషన్ బాగుండటం,అఖిల్ కూడా స్టెప్ లతో చెలరేగిపోవటంతో జనాల్లోకి ఇప్పుడు బాగా వెళ్తాయి. ముఖ్యంగా చిల్ మారో, పడేసావే, అక్కినేని అక్కినేని సాంగ్ లు బాగున్నాయి. రీరికార్డింగ్ స్పెషలిస్టు మణిశర్మ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది. చాలా సీన్స్ కు ఆయన ప్రాణం పోసాడనే చెప్పాలి. ఆ రీరికార్డింగ్ లేకపోతే వాటిని ఊహించలేం అన్నట్లుగా సాగాయి.

  review4

  కామెడీ రిలీఫ్...వినాయిక్ చిత్రాల్లో తొలి నుంచీ కామెడీ కు ప్రయారిటీ ఇస్తూనే వస్తున్నారు. అందుకు తగినట్లే ఈ సినిమాలోనూ జాన్సన్ అండ్ జాన్సన్ గా బ్రహ్మానందం, నందకిషోర్ గా వెన్నెల కిషోర్, పోతే బాబూరావు గా సప్తగిరి, జెపి లతో కామెడీ చేయించి రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేసారు. దురదృష్టవశాత్తు వారి కామెడీ పేలని టపాస్సుల్లా తుస్సుమంది.

  టెక్నికల్ గా చెప్పాలంటే అమోల్ రాధోడ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది. ఇక ఎడిటింగ్ విషయానికి సెకండాఫ్ లో కాస్త బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది అవి ట్రిమ్ చేస్తే బాగుండేది. కోన వెంకట్ రాసిన డైలాగులు బాగానే పేలాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలవలు ఎక్కడా రాజీ పడని విధంగా గ్రాండ్ గా ఉన్నాయి.

  బ్యానర్ : శ్రేష్ఠ్ మూవీస్
  నటీనటులు :అఖిల్‌ అక్కినేని, సాయేషా సైగల్‌ ,రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, మహేష్‌ మంజ్రేకర్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి తదితరులు
  జానర్ :యాక్షన్ | ఫాంటసీ| రొమాన్స్
  రన్ టైమ్: 2 గంటల10 నిముషాలు
  కథ: వెలిగొండ శ్రీనివాస్,
  మాటలు: కోన వెంకట్,
  సినిమాటోగ్రఫీ: అమోల్‌రాథోడ్,
  ఎడిటింగ్: గౌతంరాజు,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.
  విడుదల తేదీ: 11నవంబర్ 2015
  నిర్మాతలు: నితిన్,సుధాకర్ రెడ్డి

  ---
  ఫైనల్ గా ఇది పూర్తిగా అఖిల్ షో రోల్ మాత్రమే...తనపై అంచనాలు అందుకునేందుకు అఖిల్ పడిన కష్టం చూడాలన్నా, మీరు అక్కినేని కుటుంబ అభిమాని అయినా తప్పక చూడదగ్గ చిత్రం. లేదంటే డాన్స్ లు, ఫైట్స్, కామెడీతో సాగే ఓ పరమ రొటీన్ తెలుగు మసాలా సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది. షో రీల్ ను చూడ్డానికి డబ్బు ఖర్చు పెట్టామా అనిపిస్తుంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Akhil was the only saving grace of this otherwise third degree torture.Akkineni’s young lad is making his debut with this movie. VV Vinayak managed to mix all the commercial ingredients in the right amounts to entertain the audience and Akhil excelled in all the departments out of which his dance movements are said to be the major highlights along with the poor storyline.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X