twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్షయ్ కుమార్ అదరగొట్టాడు (‘ఎయిర్ లిఫ్ట్’ మూవీ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5

    హైదరాబాద్: అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ మూవీ ఎయిర్ లిఫ్ట్. 1990లో జరిగిన ఇరాక్-కువైట్ యుద్ద నేప‌థ్యంలో అక్క‌డ ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించ‌డం అనే అంశంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. రియల్ స్టోరీ అధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రాజా కృష్ణ మీన‌న్ ద‌ర్శ‌కుడు. ఈ రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది.

    రియల్ స్టోరీని తెరపై ఆవిష్కరించారు. 1990...ఇరాక్-కువైట్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులవి. దాదాపు లక్షా 70వేల మంది ఇండియన్స్ ఇరాక్ లో ఇరుక్కు పోయారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వారిది అక్కడ ఉండలేని...ఇండియాకు చేరే దారి లేని పరిస్థితి. ఆ సమయంలో అక్కడ ఉండే ఓ బిజినెస్‌మేన్ వారికి సహాయం అందిస్తాడు. ఈ చిత్రంలో బిజినెస్ మేన్ రంజిత్ కత్యాల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. రంజిత్ కత్యాల్ కువైట్ లో పేరు మోసిన భారతీయ బిజినెస్ మేన్. లగ్జరీ లైఫ్ గడుపుతుంటాడు. అమృత కత్యాల్(నిమ్రత్ కౌర్) ను పెళ్లాడుతాడు. వారి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉంటుంది.

    అయితే ఇరాక్ కువైట్ ను ఆక్రమించుకోవడంతో అక్కడి పరిస్థితులు దుర్భరంగా మారుతాయి. ఈ యుద్ధంలో ఎంతో ప్రజలు చనిపోతుంటారు. ఇలా మారణ హోమం జరుగుతున్న క్రమంలో ఇరాక్ సోల్జర్స్ బిజినెస్‌మేన్ రంజిత్‌కు తారసపడతారు. ఓ ఇరాక్ మేజర్ రంజిత్, అతని భార్య తప్పించుకునేందుకు సహకరిస్తారు. ఎలా తప్పించుకోవాలో రూట్ మ్యాప్ ఇస్తారు. కానీ అతను తన తోటి భారతీయులను వదిలి తానొక్కడినే వెళ్లడానికి ఇష్టపడడు. వెంటనే ఇండియన్ ఎంబసీని సంప్రదించి సహాయం కోరుతాడు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి జోర్డాన్ బార్డర్ దాటడం ద్వారా భారతీయులను ఇండియా చేరవేయవచ్చని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో రంజిత్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎన్ని కష్టనష్టాలకు ఓర్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.

     Akshay Kumar's Airlift Movie Review

    ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పెర్ఫార్మెన్స్ హైలెట్. సినిమా మొత్తాన్ని ఆయన తన భుజాలపై మోసారు. ప్రతి ఫ్రేమలోనూ తన నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడు. అన్ని సీన్లలోనూ ఆయన పర్ ఫెక్ట్ యాక్టర్ గా నిరూపించుకున్నారు.

    ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్ పాత్రలో నిమ్రత్ కౌర్ పర్ ఫెక్టుగా నటించింది. ఆమె యాక్టింగ్ స్కిల్ సూపర్ అనే విధంగా ఉన్నాయి. ఇతర యాక్టర్స్ ఫెరీనా వాజిర్, తస్నీమ్ మెప్పించారు. మేజర్ పాత్రలో ఇనామ్ ఉల్ హక్ పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకున్నాడు.

    ఈ సినిమాకు బాగా ప్లస్ అయిన అంశాల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ యాక్టింగ్ స్కిల్స్, విజువ్ ఎపెక్ట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే సినిమా క్లైమాక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాను ఇంకా స్త పర్ ఫెక్టుగా ఎడిట్ చేస్తే బావుండేది.

     Akshay Kumar's Airlift Movie Review

    ఇరాక్, కువైట్ మధ్య జరిగిన యుద్ధం, అప్పుడు అక్కడ ఇరుక్కున్న భారతీయులు ఎదుర్కొన్న ఇబ్బందులు, బిజినెస్ మేన్ రంజిత్ సహాయంతో వారు బయట పడిన ఘటనలను దర్శకుడు కళ్లు కట్టినట్లు చూపించాడు. రియల్ సంఘటనలపై తీసిన ఈ చిత్రం......సగటు ప్రేక్షకుడిని ఆట్టుకుంటుంది.

    నటీనటులు: అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్, ఫెరీనా వాజిర్, ఇనామ్ఉల్ హక్, లెనా, పురబ్ కోహ్లి, ప్రకాష్ బెలావాడి
    దర్శకత్వం: రాజా కృష్ణ మీనన్
    సంగీతం: అమాల్ మాలిక్, అంకిత్ తివారీ
    సినిమాటోగ్రఫీ: ప్రియా సేత్
    ఎడిటింగ్: హేమంతి సర్కార్.

    English summary
    Akshay Kumar's "Airlift Film a true story that will make you Proud To BeIndian!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X