»   » అమ్మాయిలున్నారు కానీ.....(‘ఇద్దరమ్మాయిలతో' రివ్యూ)

అమ్మాయిలున్నారు కానీ.....(‘ఇద్దరమ్మాయిలతో' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rating:
  1.5/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల


  'దేశముదురు' వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తున్న సినిమా అనగానే అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం,ఎలాంటి సినిమా చూడబోతున్నాం అనే ఆసక్తి ఉంటుంది. అయితే ఆ ఉత్సాహాన్ని సక్సెస్ గా మార్చుకోవటం కత్తిమీద సామే...వారి అంచనాలు అందుకోవటానికి మరింత ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన ఇద్దరమ్మాయిలతో లో అది లోపించింది. కాంబినేషన్ సెట్ కాగానే స్క్రిప్టు రెడీ కాకుండా సినిమా మొదలపెట్టినట్లు మొదటి సీన్ నుంచి అనిపిస్తుంది... సెకండాఫ్ మొదలయ్యేసరికి మన అంచనా కరెక్టే అని రూఢీ అవుతుంది. అప్పటికీ అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ ఇద్దరూ సినిమా భారం మొత్తాన్ని తమ తమ ప్రతిభతో మోద్దామని గట్టి కృషే చేసారు కానీ కలిసిరాని కథ ఫలితం లేకుండా చేసింది.

  స్పెయిన్ లో సంజు రెడ్డి(అల్లు అర్జున్) గిటారిస్ట్ ఉంటూ బ్యాండ్ మెయింటైన్ చేస్తూంటాడు. అక్కడికి పై చదువు నిమిత్తం వచ్చిన ఆకాంక్ష(కేధరిన్) కి తను రెంట్ కి దిగిన రూమ్ లో ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరి అంతకుముందు ఆ గదిలో ఉన్న టెనెంట్ కోమలి శంకరాభరణం(అమలా పాల్)ది. ఎంతో ఆసక్తిగా ఆ డైరీ తిరగేసిన ఆకాంక్షకు అందులో సంజు,కోమలిల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ చదువుతూ...ఫాలో అవుతూ బయిట ఆమె సంజుని పరిచయం చేసుకుంటుంది...అతి త్వరలోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. అంతేకాదు ఆ లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్ట్ కు షాక్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి...సంజు ...ఈ ఇద్దరమ్మాయిల్లో ఎవరిని ఏక్సెప్ట్ చేసాడనేది మిగతా కథ.


  సూపర్ హిట్ చిత్రం గజనీ ని గుర్తు చేస్తూ సాగే కథ తో సాగే ఈ చిత్రం... ఓ పాట,ఓ ఫైట్,కామెడీ సీన్ అన్నట్లు స్క్రీన్ ప్లే వరస పేర్చారు. ముఖ్యంగా గజనీలో ఏదైతే వర్కవుట్ అయ్యిందో అది ఇక్కడ కనపడదు. అందులో ఉన్న క్యూట్ లవ్ స్టోరీని,యాక్షన్ వెనక ఉన్న ఎమోషన్ ని ఈ చిత్రం క్యాచ్ చేయలేకపోయింది. తన లవర్ పై ఎటాక్ చేసిన వారు కోసం అందులో సూర్య ఎంతో డెస్పరేట్ గా తిరుగుతూంటాడు. అదే ఈ సినిమాకు వచ్చేసరికి హీరో అప్పుడప్పుడూ తనకు గుర్తుకు వచ్చినప్పుడు విలన్స్ ని వెతుకుతూ బయిలుదేరి ఎటాక్ చేస్తూంటాడు. దానికి తోడు కేథరిన్ ది ఎంత సినిమా టెక్ పాత్ర అయినా మరీ అతిగా(సెంట్రల్ మినిస్టర్ కూతురు అయ్యిండి చీప్ గా) బిహేవ్ చేస్తున్నట్లుంది. అయితే అమలా పాల్, అల్లు అర్జున్ మధ్య సీన్స్ బాగా రాసారు, తీసారు. కానీ అందులో పండాల్సిన లవ్ ఫీల్ మాత్రం పండించలేకపోవటంతో హీరో పై సానుభూతి,విలన్ పై కోపం ప్రేక్షకుడుకి పెద్దగా కలగని పరిస్ధితి.

  సాధారణంగా ఇలాంటి యాక్షన్ చిత్రాల్లో హీరోని తన శాయిశక్తులా విలన్ వెంటాడుతూ ఉంటే...దాన్నుంచి తప్పించుకుంటూ హీరో వారిపై ఎదురు దాడి చేస్తేనే కిక్ ఉంటుంది. అదే ఈ సినిమాలో మిస్సైంది. విలన్ ..పెద్ద సీరియస్ గా హీరోని తీసుకున్నట్లు కనపడడు. దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారింది. ఎంతసేపూ కేథరిన్ కు,హీరోకు మధ్య సీన్స్ పెట్టారు కానీ విలన్ ని క్లైమాక్స్ దాకా పట్టించుకోకుండా వదిలేసారు. లవ్ కు తగిన రీతిలో యాక్షన్ కూడా ఉండి ఉంటే సినిమా బాగుండేది.


  మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

  ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లు అర్జున్ మరింత స్టైలిష్ గా కనిపించాడు. అతని డాన్స్ లు మరింత ఊపుతో సాగి విజిల్స్ వేయించాయి.

  పూరీ సినిమాల్లో ఉంటే పంచ్, డైలాగ్స్ ఈ సినిమాలో బాగా మిస్సవ్వటం ఆయన అభిమానులను నిరాస పరిచే అంశం

  ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాదా సీదాగా ఉండటం..ఊహకు అందటం జరిగింది.

  ఫైట్ సీక్వెన్స్ కూడా కొత్తగా ఈ సినిమాలో కంపోజ్ చేసారు...అవి కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. అయితే ఆ ఫైట్ కి తగ్గ ఎమోషన్,సిట్యువేషన్ కుదరలేదు.

  కెమెరా వర్క్ ఈ సినిమాకు ఉన్న ప్లస్ లలో ఒకటి.

  రన్ రన్, వైయిలిన్ సాంగ్, టాప్ లేచిపోద్ది పాటకు ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవి సినిమాను మ్యూజికల్ గా నిలబెట్టే ప్రయత్నం చేసాడు.

  బ్రహ్మానందం, అలీ కాంబేషన్ పూరి దర్శకత్వంలో ఎప్పుడూ హిట్టే. అలాంటిది ఈ సారి చిన్న మెత్తు నవ్వులు కూడా కురిపించలేకపోయారు.

  నిర్మాతగా గణేష్ బాబు బాగా ఖర్చు పెట్టారు. ఆ రిచెనెస్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది.

  ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బాగానే సాగింది కానీ,సెకండాఫ్ లో కాస్త గజిబిజి అయినట్లుంది. నేరేషన్ కూడా గత పూరీ చిత్రాల్లా స్పీడుగా ఉండేలా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది.

  అమలా పాల్ సంప్రదాయ బ్రాహ్మణుల అమ్మాయిగా లుక్ ఓకే అనిపించింది. అయితే ఫెరఫార్మెన్స్ వైజ్ గా చాలా బాగా చేసింది.

  కేథరిన్...స్కిన్ షో ..బాగా చేసింది. ఎక్కువ ఆమె తొడల మీదే కెమెరా దృష్టి చాలా సీన్స్ పై పెట్టారు.

  బ్యానర్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
  నటీనటులు:అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ,బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు
  సంగీతం: దేవిశ్రీప్రసాద్,
  కెమెరా: అమూల్ రాథోడ్,
  ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
  సమర్పణ: శివబాబు బండ్ల,
  నిర్మాత: బండ్ల గణేష్,
  కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  ఫైనల్ గా ఎంత పెద్ద దర్శకుడు, హీరో ఉన్నా, ఎంత ఖర్చు పెట్టినా,ఫారిన్ లొకేషన్స్ లో తీసినా, హారోయిన్స్ అందాలు ఆరబోసినా... కథ అనేది లేకపోతే కష్టమే అని మరో సారి ప్రూవ్ చేసినట్లుంది. మిగతా విషయాలతో సంభధం లేకుండా కేవలం మంచి పాటలు,డాన్స్ లు, ఫైట్స్ చూద్దామనుకున్న వాళ్లకి ఈ సినిమా ఒక ఆప్షన్.

  English summary
  After a long gap, Allu Arjun and Puri Jagannath have teamed up for Iddarammayilatho movie released today with negative talk. For the first time in his career, stylish star Allu Arjun is romancing two heroines in this movie. Due to the Lack of script couldn't reach the audience.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more