twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Movie Review: వెండి తెరపై అల్లు అర్జున్ బ్రాండ్... సుకుమార్ టేకింగ్ వావ్!

    |

    Rating:
    3.0/5
    Star Cast: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్
    Director: సుకుమార్

    ఐకాన్ స్టార్‌గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ కెరీర్ పరంగా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న నేపథ్యంలో వచ్చిన చిత్రం పుష్ప. లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లుగా ఈ సినిమా ప్రేక్షకులకు దూరమైంది. అయితే మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా బన్నీ కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై దృష్టి పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య వచ్చిన చిత్రం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్‌ను ఐకాన్‌గా నిలిపిందా అనే విషయాని తెలుసుకోవాలంటే సుకుమార్ టేకింగ్, నటీనటులు పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

    పుష్ప మూవీ కథ..

    పుష్ప మూవీ కథ..


    తిరుపతి శేషాచలం అడవుల్లో పుష్ప రాజ్ ( అల్లు అర్జున్) గంధం చెక్కల అక్రమ వ్యాపారంలో కూలీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. అయితే చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం, కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది. ఇక తన వ్యాపారంలో ఎదురు పడిన కొండారెడ్డి (అజయ్ ఘోష్), మంగళం శ్రీను (సునీల్) దాక్షయిని (అనసూయ)తో చేతులు కలుపుతాడు. అయితే ఓ దశలో తనకు అన్యాయం చేసిన మంగళం శ్రీనును ఎదురించి సవాల్ విసురుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫాజిల్ ఫహద్) అమీతుమీ సిద్దమవుతాడు. తాను మనుసు పడిన తన గ్రామానికి చెందిన శ్రీవల్లి (రష్మిక మందన్న)తో పెళ్లిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతారు.

    పుష్ప  మూవీలో ట్విస్టులు

    పుష్ప మూవీలో ట్విస్టులు

    అయితే తన జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే లక్ష్యానికి పుష్ప ఎలా చేరుకొన్నాడు? తనకు ఎదురుపడిన మంగళం శ్రీనుతో చాణక్య నీతిని ఎలా ప్రదర్శించాడు. తన కోసం కాపు కాసే పోలీస్ అధికారులను ఎలా బోల్తా కొట్టించాడు. తాను మనసుపడిన శ్రీవల్లిని పెళ్లికి ఎలా ఒప్పించాడు. ఈ కథలో ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు (రావు రమేష్) పాత్ర ఏమిటి? పుష్ప రెండవ భాగంపై సుకుమార్ ఎలాంటి ఆసక్తినిక కలిగించాడు అనే ప్రశ్నలకు సమాధానమే పుష్ప సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    సంగీత వాయిద్యం వయోలిన్‌‌ గురించి చెబుతూ జపాన్‌లో మొదలుపెట్టిన కథ తిరుపతికి చేరుకొన్న విధానంతో తన కథనం ఎలా ఉండబోతుందోననే ఆసక్తిని రేపింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వివరించడానికి కాస్త సమయం ఎక్కువే తీసుకొన్నప్పటికీ.. పుష్ప ఎంట్రీతో కథ చాలా వేగంగా పరుగులు పెడుతుంది. స్మగ్లింగ్‌లో పుష్ప అనుసరించే తెలివితేటలు, కూలీ నుంచి భాగస్వామిగా ఎదిగే పరిణామ క్రమం సుకుమార్ ప్రతిభకు మరోసారి అద్దంపట్టింది. రష్మిక ప్రేమయాణం, తన కుటుంబ నేపథ్యం, తన జీవితానికి, తన తల్లికి జరిగిన అన్యాయం అంశాలు చాలా ఎమోషనల్‌గా కనిపిస్తాయి. తన ఇంటి పేరు అనే ఎమోషనల్ పాయింట్‌తో కథను డ్రైవ్ చేసిన విధానం సినిమాకు మరింత సెంటిమెంట్ చేర్చింది. ఇప్పటి వరకు సాఫ్ట్ హీరోయిజం ఆకట్టుకొన్న అల్లు అర్జున్ పుష్పగా రస్టిక్ క్యారెక్టర్‌లో చెలరేగిపోయారు. ఫస్టాఫ్‌లో టన్నుల కొద్ది గంధపు దుంగలను ఏటి వాగు ద్వారా పంపించే సీన్ ప్రేక్షకులకు మంచి జోష్ పెంచుతుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్


    ఇక సెకండాఫ్ విషయానికి వస్తే మంగళం సీన్‌ను ఎదురించే ఎపిసోడ్‌తో కథ మరో లెవెల్‌కు చేరిపోతుంది. మంగళం శ్రీను ఇంటిలో యాక్షన్ ఎపిసోడ్స్, ఫారెస్ట్‌లో పుష్పను చంపడానికి కొండారెడ్డి చేసిన మర్డర్ ప్లాన్, దానిని నుంచి తప్పించుకొన్ని మంగళం శ్రీను బామ్మర్ధిని చంపిన ఎపిసోడ్స్ కథను పీక్స్‌ తీసుకెళ్తాయి. ఎంపీ నాయుడు, మంగళం శ్రీను, పుష్ప మధ్య జరిగిన మీటింగ్ కథను మరింత పవర్‌ఫుల్‌గా మార్చుతుంది. చివర్లో భన్వర్ సింగ్ షెకావత్‌తో పుష్ప పోలీస్ స్టేషన్ సీన్, అలాగే ఫారెస్ట్‌లో ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు, డైలాగ్స్ రచ్చగా మారాయి. చివర్లో పెళ్లీ పీటల మీదకు వచ్చిన పుష్ప బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా, క్రేజీగా ఉంది.

    సుకుమార్ టేకింగ్

    సుకుమార్ టేకింగ్

    దర్శకుడు సుకుమార్ మదిలో మెదిలిన పాయింట్‌‌ను ఒక్కొక్క పొరగా అల్లిన తీరు చాలా బాగుంది. పాత్రలను డిజైన్ చేసిన విధానం అద్బుతంగా ఉంది. పిరియాడిక్ మూవీకి కావాల్సిన క్యాస్టూమ్ డిజైనింగ్ సినిమాకు ఓ రకమైన శోభను తీసుకొచ్చింది. పాత్రల హావభావాలు, ఎమోషనల్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు మేలవించి తెర మీద చూపించిన పద్ధతి చాలా బాగుంది. తెలుగు తెర మీద ఓ కొత్త అనుభూతిని కలిగించే విధంగా కథ, కథనాలు రూపొందించుకోవడం సినిమాకు అత్యంత బలం.

    అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

    అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?


    పుష్ప సినిమాలో అల్ల అర్జున్‌ది వన్ మ్యాన్ షో. ప్రేక్షకులకు స్టైలిష్ హీరోగా కనిపించిన పుష్పగా ముతక పాత్రలో ఇరగదీశాడు. ఇటీవల కాలంలో దక్షిణాదిలో (కేజీఎఫ్‌లో యష్ మినహాయిస్తే) ఏ హీరో చూపించిన విధంగా ఫెర్ఫార్మెన్స్‌తో తనలో నటుడిని బయటపెట్టాడు. ప్రతీ సీన్‌ సీన్‌కు కథను లేపుకొంటూ వెళ్లిపోయాడు. కొండారెడ్డి, మురుగన్, మంగళం శ్రీను, పోలీస్ ఉన్నతాధికారులు గోవింద్ (శత్రు), షెకావత్ (ఫాహద్ ఫాజిల్) పోటాపోటీగా నడిచే సీన్లలో విశ్వరూపం చూపించాడు. రొమాంటిక్ సీన్లలో రష్మికతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించాడు.

    రష్మిక, అనసూయ, మిగితా క్యారెక్టర్లు

    రష్మిక, అనసూయ, మిగితా క్యారెక్టర్లు

    పుష్ప సినిమాలో రష్మిక, అనసూయ క్యారెక్టర్లకు పెద్దగా స్కోప్ లేకపోయింది. అయితే ఒకట్రెండు సీన్లలో రష్మిక, అనసూయ మెరుపులు మెరిపించారు. బన్నీతో కొన్ని సీన్లలో రష్మిక బాడీ లాంగ్వేజ్, కళ్లతో హావభావాలు ఆకట్టుకొన్నాయి. మంగళం శ్రీను భార్యగా దాక్షయిని పాత్రలో అనసూయ కనిపించింది. పాత్ర తీరును బట్టి చూస్తే పార్ట్ 2లో అనసూయ పాత్ర ఇరగదీసే అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక కొండారెడ్డిగా అజయ్ ఘోష్ ఆకట్టుకొన్నాడు. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు ఒక ఢిఫరెంట్ రోల్‌తో మరోసారి ఫుల్ మార్కులు కొట్టేశాడు. శత్రులోని నటుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడని చెప్పవచ్చు. ఇక పుష్పకు స్నేహితుడిగా నటించిన కేశవ్ (జగదీష్) బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో కూడిన డైలాగ్స్ తో అదరగొట్టేశాడు.

    ఫాహద్ ఫాజిల్, సునీల్ పవర్‌ఫుల్ రోల్స్‌తో

    ఫాహద్ ఫాజిల్, సునీల్ పవర్‌ఫుల్ రోల్స్‌తో

    ఇక పుష్పలో హైలెట్‌గా మారిన రెండు పాత్రలు మంగళం శ్రీనుగా సునీల్, భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫాహద్ ఫాజిల్. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని పాత్రలో సునీల్ కనిపించడమే కాకుండా కొత్తరకమైన బాడీ లాంగ్వేజ్‌తో సూపర్ అనిపించుకొన్నాడు. విలన్ పాత్రలో మంచిగా ఒదిగిపోయాడు. ఇక ఫాహద్ ఫాజిల్ చివరి పది నిమిషాల్లో ఎంట్రీ ఇచ్చినా.. హై వోల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో తన మార్కును రుచి చూపించాడు. నా నటనకు ఇది టీజర్ మాత్రమే.. పార్ట్‌ 2లో అసలు సినిమా చూపిస్తాననే సంకేతాలు అందించాడు.

    టెక్నికల్ టీమ్ గురించి

    టెక్నికల్ టీమ్ గురించి

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఇండియాలో ఇంత మంది సినిమాటోగ్రాఫర్లు ఉన్నారు.. ఫారిన్ నుంచి ఎందుకు తెచ్చుకొన్నారనే ప్రశ్నకు మిరోస్లావ్ కుబా బ్రోజెక్ తన కెమెరా పనితనంతో తెరపై చక్కని సమాధానం చూపిస్తాడు. ఫారెస్ట్ సీన్లు, ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లే కాకుండా ప్రతీ సన్నివేశాన్ని, ప్రతీ ఆర్టిస్టు మూడ్‌ను అద్బుతంగా కెమెరాలో బంధించాడు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ పాటలు ఆడియోలో ఎంత క్రేజ్‌ను కల్పించాయో.. తెర మీద అంతే మొత్తంలో ఆకట్టుకొన్నాయి. బన్నీ, రష్మిక పాటలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. రీరికార్డింగ్‌తో దేవీ అరిపించేశాడు. చివరి 30 నిమిషాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్. ఇతర విభాగాలు 100 శాతం టాలెంట్‌ను ప్రదర్శించాయి. శ్రీకాంత్ అందించిన డైలాగ్స్ తూటాల్లో పేలాయి.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సుకుమార్ కథ, అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్‌ను నమ్మిన తీరుకు, వారు చేసిన ధైర్యానికి నవీన్ యెర్నేని, వై రవి ప్రకాశ్ అభినందించాల్సిందే. విభిన్నమైన కథను ప్రోత్సాహించి ప్యాన్ ఇండియా లెవల్‌లో తెలుగు సినిమా ప్రైడ్‌ను చెప్పడానికి మరోసారి కారణం అయ్యారు. నటీనటులను ఎంపిక చేసిన విధానం సినిమాపై వారికి ఉన్న అభిరుచి తెలియజెప్పింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

    ఫైనల్‌గా ఎందుకు చూడాలంటే..

    ఫైనల్‌గా ఎందుకు చూడాలంటే..

    లవ్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషన్స్, కామెడీ లాంటి అంశాలను రంగరించి రూపొందించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ. సినిమా చూసిన తర్వాత పుష్ప పాత్రలో అల్లు అర్జున్ తప్ప మరొకరిని ఊహించడానికి కష్టమే. ప్రతీ ఆర్టిస్టు ఫెర్ఫార్మెన్స్, పాత్రల డిజైన్ అందర్నీ ఆకట్టుకొంటుంది. కేజీఎఫ్ తరహా మదర్ సెంటిమెంట్, బిల్డప్ షాట్స్ ఉన్న చిత్రం ఇది. తెర మీద వచ్చిన ఊరమాస్ సినిమాగా వచ్చు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అనే తేడా లేకుండా అందరూ కనెక్ట్ అవుతారు. సమంత ఐటెమ్ సాంగ్ ప్రేక్షకులకు మరో బోనస్. ఎలాంటి ఆలోచనలు లేకుండా సినిమా చూస్తే థ్రిల్లింగ్ అంశాలతో పాటు పైసా వసూల్ గ్యారెంటి. అల్లు అర్జున్ ఇరగదీశాడు.. డొంట్ మిస్ ఇట్.

    Recommended Video

    Pushpa The Rise Review.. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే
    పుష్పలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    పుష్పలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, శత్రు, రావు రమేష్, అజయ్ ఘోష్, సమంత రుత్ ప్రభు తదితరులు
    రచన, దర్శకత్వం: సుకుమార్
    నిర్మాత: నవీన్ యెర్నేని, వై రవి ప్రకాశ్
    సినిమాటోగ్రఫి: మిరోస్లావ్ కుబా బ్రోజెక్
    ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రూబెన్
    మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
    బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
    బడ్జెట్: 200 కోట్లు
    రిలీజ్ డేట్: 2021-12-17

    Read more about: pushpa allu arju
    English summary
    Allu Arjun Pushpa movie review: Allu Arjun and Sukumar Combination comes with Pushpa. Pushpa hits the screens on December 17th. Here is Telugu filmibeat exclusive review .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X