»   » కుటుంబాలే కలెక్షన్స్ ('సన్నాఫ్‌ సత్యమూర్తి' రివ్యూ)

కుటుంబాలే కలెక్షన్స్ ('సన్నాఫ్‌ సత్యమూర్తి' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

----సూర్య ప్రకాష్ జోశ్యుల

ఫ్యామిలీలని టార్గెట్ చేస్తూ తీసిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవటంతో త్రివిక్రమ్ కు మరింత ధైర్యం వచ్చినట్లుంది. ఈ సారి తండ్రి సెంటిమెంట్ ని ఎత్తుకుని దాన్ని బలంగా చెప్తూ...కథ రాసుకుని సన్నాఫ్ సత్యమూర్తి అనే అచ్చ తెలుగు టైటిల్ ని పెట్టుకుని కుటుంబాల నాడి పట్టుకునే ప్రయత్నం చేసాడు. అయితే సెంటిమెంట్, డైలాగులు,అక్కడక్కడా స్పీచ్ ల మీద పెట్టిన శ్రద్ద..ఎందుకనో చివరిదాకా ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే మీద పెట్టలేదనిపిస్తుంది. దాంతో సెకండాఫ్ లాగినట్లు ..చాలా చోట్ల ఫార్స్ కామెడీతో సాగతీసినట్లు అనిపిస్తుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అయితే కలర్ ఫుల్ సీన్స్ దానికి కలిసివచ్చే అందమైన లొకేషన్స్, తెరంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు...అల్లు అర్జున్ అభినయం, బ్రహ్మానందం కామెడీ దాన్ని దాటేలా చేసాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ త్రివిక్రమ్ మాత్రమే రాయగలడు అని చెప్పగలం. కుటుంబాలకు నచ్చేలా లేదా మెచ్చేలా తీసిన ఈ చిత్రం..వారు నుంచి వచ్చే కలెక్షన్స్ మీదే ఆధారపడి నడుస్తుంది. ఈ క్లీన్ సినిమాకు వేసవి సీజన్ అందుకు కలిసి వస్తుందనటంలో సందేహం లేదు.


300 కోట్లు ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) గారి అబ్బాయి విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్). సత్యమూర్తి గారు ఓ యాక్సిడెంట్ లో హఠాత్తుగా చనిపోవటంతో...ఒక్కసారిగా ఆస్దులు..అప్పులు లెక్కల్లో ...ఆస్ది అంతా కొట్టుకుపోయి...రోడ్డు మీద కుటుంబం పడే పరిస్ధితి వస్తుంది. అయితే విరాజ్ ఆనంద్ ఎదురుగా ఓ ఆప్షన్ ఉంటుంది. ఆ అప్పులు కట్టనని ఎగ్గొట్టే మార్గం ఉంటుంది. కానీ తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, ఆయన ఇచ్చిన విలువలే ఆస్దిగా నమ్మే విరాజ్ ఆనంద్...అందుకు ఒప్పుకోక...అప్పులు తీర్చి... సామాన్యుడులా మారి వెడ్డింగ్ ప్లానర్ గా మారి కుటుంబాన్ని లాగుతూంటాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో అతను..సమీర(సమంత)తో ప్రేమలో పడతాడు. అయితే సమీత తండ్రి సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్) డబ్బే జీవితం అనుకునే మనిషి.


అతనికి కి మొదటి నుంచి విరాజ్ ఆనంద్ అంటే పడదు. దాంతో తన కూతురుతో ప్రేమ ఓకే చేయాలంటే....సత్యమూర్తి గారి ద్వారా తాను నష్టపోయిన ఆస్ది కు చెందిన కాగితాలు తెచ్చిఇవ్వాలనే కండీషన్ పెడతాడు. దాన్ని తెచ్చి ఇవ్వాలంటే దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర)ని విరాజ్ ఆనంద్ ఎదుర్కోవాలి. రాయలసీమ - తమిళనాడు బార్డర్ లో ఉండే దేవరాజ్ ఆనంద్ సామాన్యుడు కాడు...అతను... ఓ ప్రెవేట్ సైన్యాన్ని నడుపుతూంటాడు. అలాంటి వాడి దగ్గర నుంచి ఆ ఆస్ధి ఎలా తెచ్చాడు..తన తండ్రి..పరువు ఎలా నిలబెట్టాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పొందాడు అనేది మిగతా కథ.


త్రివిక్రమ్ కు తొలి నుంచి అతని పెన్నే అతని బలం, చాలా సార్లు బలహీనత గా కూడా మారుతోంది. డైలాగు కోసం సీన్లు, కామెడీ కోసం జోక్ లు పేర్చటం మామూలోపోతూ వస్తోంది. అయితే అది ఈ సారి మరీ దారి తప్పింది. విలువలే ఆస్ది అంటూ యూనివర్సల్ పాయింట్ ని ఎత్తుకున్న ఆయన మొదట పదినిముషాల వరకే స్పీడుగా కథనం నడిపారు. తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నట్లు సీన్స్ పేరుస్తూ పోయారు. ముఖ్యంగ సెకండాఫ్ కావాలి కావాలి చేసినట్లు లాక్ ఇంటర్వెల్ దగ్గర పడుతుంది. ఆ సెకండాఫ్ కూడా శ్రీను వైట్ల సినిమాల్లో సెకండాఫ్ ని గుర్తు చేస్తూ విలన్ ఇంట్లో సెటప్ చేసి, బ్రహ్మానందం ని బకరా చేస్తూ అలీలతో తో కామెడీ చేస్తూ నడిపేసారు. త్రివిక్రమ్ సినిమా కాకపోతే అది తెలుగు సినిమాల్లో కామనే అనుకునే సర్దిపెట్టుకోవచ్చు . కానీ కేవలం తన డైలాగులతో,సీన్లతో సినిమాలను సూపర్ హిట్ వైపు నడిపించిన త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన సినిమా అంటే ఊహించబుద్ది కాదు.


మిగతా రివ్యూ..స్లైడ్ షోలో


ఒదిగిపోయాడు

ఒదిగిపోయాడు

కోట్ల రూపాయల విలువ చేసే ఆస్ది కన్నా...విలువలే ముఖ్యమని చెప్పే పాత్రలో అల్లు అర్జున్ పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసారు.


డైలమోతో..

డైలమోతో..

సినిమాలో నెగిటివ్ పాత్ర(ఉపేంద్ర) మీద ఆ ఫీల్ కలగదు. అతను మంచివాడా, చెడ్డవాడా అనే డైలమోలో దర్శకుడు కూడా ఉన్నట్లు ఉన్నాడు. దాంతో సెకండాఫ్ లో వారి ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు పెద్ద ఆసక్తికరంగా లేవు.


బాగా తగ్గింది

బాగా తగ్గింది

రెగ్యులర్ గా త్రివిక్రమ్ చిత్రాల నుంచి ఆశించే ఎంటర్నైమెంట్ ఇందులో బాగా తగ్గింది. అలి, బ్రహ్మానందం ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారనే చెప్పాలి. వారికి రాసిన డైలాగులు బాగున్నాయి కానీ..వారి మీద చేసిన ఎపిసోడ్స్ బలంగా లేవు


బ్యూటిఫుల్ మైండ్

బ్యూటిఫుల్ మైండ్

రస్సెల్ క్రో చిత్రం ..బ్యూటిఫుల్ మైండ్ లో పాత్రను గుర్తు తెచ్చేలా... వెన్నెల కిషోర్ పాత్రను తీర్చి దిద్దటం బాగుంది. దాని ఎండ్ పంచ్ కూడా బాగుంది.


హీరోయిన్స్

హీరోయిన్స్

ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సారి త్రివిక్రమ్ ప్లాన్ చేసాడు. అందరికీ సరైన ప్రాధాన్యత ఇచ్చానన్నారు కానీ.. నిత్యామీననన్ పాత్రే ఆమె స్ధాయికి లేదా ఆమె ఇమేజ్ కు తగ్గట్లు లేదనిపిస్తుంది. సమంత రెగ్యులర్ రొటీన్ ఎక్సప్రెషన్ తో లాగేసింది. అదా శర్మ ఓకే.


సత్యమూర్తి పాత్ర

సత్యమూర్తి పాత్ర

సత్యమూర్తి పాత్ర ప్రకాష్ రాజ్ వేసారు. ఆ పాత్ర మనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో పాత్రను గుర్తుకు తెస్తుంది. క్లైమాక్స్ సంఘటనతో సహా..అలా ఎందుకు జరిగిందో మరి.


టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ రెండు హిట్ సాంగ్స్ తో ఈ ఆల్బమ్ రూపొందించారు. అయితే అత్తారింటికి దారేది రేంజిలో పాటలు అలరించలేదు. అయితే రీరికార్డింగ్ మాత్రం చాలా బాగుంది. కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోసింది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయించుకుంటే బాగుండేది.


ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: హారికా అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు: అల్లు అర్జున్‌,సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెన్నెల కిశోర్, రావు రమేష్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు
కెమెరా:ప్రసాద్ మూరెళ్ల,
సంగీతం:దేవిశ్రీ ప్రసాద్,
ఆర్ట్:రవీందర్,
నిర్మాత:రాధాకృష్ణ.ఎస్.,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:త్రివిక్రమ్.
విడుదల తేదీ: ఏప్రిల్‌ 9,2015.ఫైనల్ గా తల్లి,తండ్రుల ఇచ్చిన విలువలే పిల్లలకు ఆస్దులు అనే థిన్ స్టోరీలైన్ తో పెద్ద హీరోకు కథ చేసే ధైర్యానికి త్రివిక్రమ్ ని అభినందించాలి. అయితే వినోదం మరింతగా పెట్టుకుని ఉంటే ..విలువలకు మరింత విలువ వచ్చి ఉండేది.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Son Of Satyamurthy is touted to be the image make over film for Allu Arjun. Utilizing the pen power of Trivikram, Allu Arjun is aiming to take over the overseas market in a single shot. Did he achieve the goal ? Read the review to know.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu