For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమావాస్య మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  గతంలో హీరో సచిన్ జోషి నటించిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆషికీ రీమేక్‌తో టాలీవుడ్‌కు మరింత చేరువైన సచిన్ తాజాగా ఓ సస్పెన్స్, హారర్ కామెడీ చిత్రం అమావాస్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత కొద్దికాలంగా విజయాల కోసం పరితపిస్తున్న సచిన్‌కు అమావాస్య సక్సెస్ వెలుగులు నింపిందా? సచిన్, నర్గీస్ ఫక్రీ జోడి ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  అమావాస్య సినిమా కథ

  అమావాస్య సినిమా కథ

  కరణ్ (సచిన్ జోహి), అహానా (నర్గీస్ ఫక్రీ) ప్రేమికులు. లండన్‌లోని పురాతన వారసత్వ భవనాన్ని సందర్శించడానికి వెళ్లుతారు? ఆ భవనంలో వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి? కరణ్ స్నేహితులు సమీర్, మాయా కారణంగానే వారికి సమస్యలు ఏర్పడుతాయి. చనిపోయిన మాయ వారిని వెంటాడుతుంటుంది.

  అమావాస్య సినిమాలో ట్విస్టులు

  అమావాస్య సినిమాలో ట్విస్టులు

  ఇంతకీ మాయ, సమీర్, కరణ్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సమీర్‌కు, కరణ్‌కు స్నేహంలో ఎందుకు విభేదాలు చోటుచేసుకొన్నాయి. మాయ ఎందుకు చనిపోయింది అనే ప్రశ్నలకు సమాధానమే అమావాస్య సినిమా కథ

  తొలిభాగం ఎలా ఉందంటే

  తొలిభాగం ఎలా ఉందంటే

  తొలిభాగం విషయానికి వస్తే కథలోకి వెళ్లడానికి దర్శకుడు భూషన్ పటేల్ చాలా సమయమే తీసుకొన్నాడు. ఫస్టాఫ్‌లో పురాతన భవనంలో టైంపాస్ కోసం హారర్ సిచ్చువేషన్‌ను సృష్టించిన తీరు కొంత ఆకట్టుకొనేలా ఉంటుంది. తొలి భాగమంతా ప్రేక్షకులకు ఉత్కంఠను రేకెత్తించే అంశాలతో కాలం వెళ్లదీసినట్టు కనిపించాడు.

  రెండో భాగంలో అసలు కథ

  రెండో భాగంలో అసలు కథ

  సినిమా రెండో భాగంలో అసలు కథ ప్రారంభమవుతుంది. సమీర్, మాయ, కరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ ఆధారంగా కథ సాగుతుంది. ఓ సమస్య రావడంతో వారిలో విభేదాలు చోటుచేసుకొంటాయి. అసలు దెయ్యం మాయ అని భావించిన ప్రేక్షకులకు దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సర్ఫైజ్‌గా ఉంటుంది. చివర్లో సినిమా కోసం గ్రాఫిక్స్ చాలా రిచ్‌గా, హై క్వాలిటీతో ఉండటం కొంత థ్రిల్‌గా అనిపిస్తుంది.

  నటీనటుల ప్రతిభ

  నటీనటుల ప్రతిభ

  సచిన్ ఎప్పటిలానే యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు. రొమాంటిక్ సీన్లలో తనదైన మార్కు చూపించాడు. తనకు కొత్తగా ఉండే హారర్ జోనర్‌లో సచిన్ కనిపించడం అభిమానులకు కొంత సానుకూల అంశం. నర్గీస్ ఫక్రీ అందాల ఆరబోత బాగుంది. మిగితా హీరోయిన్లు మోనా సింగ్, నవనీత్ కౌర్ కూడా గ్లామర్‌ను బాగానే పండించారు.

  సాంకేతికంగా

  సాంకేతికంగా

  టెక్నికల్ విభాగాలకు వస్తే.. మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారర్ సినిమాకు కావాల్సిన మూడ్‌ను సినిమాటోగ్రఫి ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ వర్క్‌ మరింత క్రిస్ప్‌గా ఉండాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అందమైన ఫారీన్ లొకేషన్లలో సినిమాను తెరకెక్కించిన తీరు అభినందనీయం.

   బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  హారర్ జోనర్

  టెక్నికల్ విభాగం పనితీరు

  మైనస్ పాయింట్స్

  కథను బలంగా చెప్పలేకపోవడం

  కథనం బలహీనంగా ఉండటం

  తెలుగు నేటివిటికి దూరంగా అనిపించడం

   తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సచిన్ జోషి, నర్గీస్ ఫక్రీ, మోనా సింగ్, నవనీత్ కౌర్

  దర్శకుడు: భూషణ్ పటేల్

  నిర్మాత: రైనా జోషి

  మ్యూజిక్: సంజీవ్, దర్శన్

  సినిమాటోగ్రఫి: అమర్జీత్ సింగ్

  ఎడిటర్ దేవెన్ ముర్దేశ్వర్

  English summary
  Amavas is a film which turns out to be unintentionally funny. Bhushan Patel and his team tries too hard to spook you. Unfortunately, their scare-tricks are rusty old. Instead, the clumsy pace of the narrative is more terrifying than the ghost. And those searching for some logic, you are at the wrong place, folks!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X